Shiva · Traditional devotional text · Source: vignanam.org (Traditional devotional text (public-domain shlokas))
ఓం నమో భగవతే శ్రీ రమణాయ అరుణాచల అక్షర-మణిమాల
అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచలా అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచలా
అరుణాచల మనుచు స్మరియించువారల అహము నిర్మూలింపు అరుణాచలా అళగు సుందరముల వలె చేరి నేను నీ వుందమభిన్నమై అరుణాచలా లోదూరి లాగి నీ లోగుహను చెరగా అనుమరించి తేమొకో అరుణాచలా ఎవరికిగా నన్ను ఏలితి విడిచిన అఖిలము నిందించు అరుణాచలా ఈ నింద తప్పు నిన్నేటికి దలపించితిక విడువారెవరరు అరుణాచలా కనిన జనని కన్న ఘనదయాదాయకా ఇదియా యనుగ్రహము అరుణాచలా నిన్నేమార్చి యరుగనీక యుల్లము పైని నురుదిగా నుండుమా అరుణాచలా ఊరూరు తిరుగక యుల్లము నిను గని యణగ నీ ద్యుతి జూపుము అరుణాచలా నను చెరచి యిపుడు నను కలియక విడుటిది మగతన మొక్కొయా అరుణాచలా ఏటి కీ నిదుర నన్నితరులు లాగగ ఇది నీకు న్యాయమా అరుణాచలా పంచేంద్రియ ఖలులు మదిలోన దూరుచో మదిని నీవుందవో అరుణాచలా ఒకడవౌ నిను మాయ మొనరించి వచ్చువారెవరిది నీ జాలము అరుణాచలా
అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచలా అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచలా
ఓంకార వాక్యార్ధ యుత్తమ సమహీన నిన్నెవరెరుగువారు అరుణాచలా అవ్వబోలె నొసగి నాకు నీ కరుణ నన్నేలుట నీ భారము అరుణాచలా కన్నుకు గన్నయి కన్నులేక కను నిను కనువారెవరుగనుము అరుణాచలా ఇనుము ఆయస్కాంతము వలె గవిసి నను విడువక కలసి నాతోనుండుము అరుణాచలా గిరి రూప మైనట్టి కరుణా సముద్రమా కృప చేసి నన్నేలుం అరుణాచలా క్రింద మీదెటను చెన్నొందు కిరణమణి నా క్రిందు గతి మాపు అరుణాచలా కుట్ర యంతయు గోసి గుణముగ బాలించు గురు రూపమై వెలుగు అరుణాచలా కూచి వాల్గన్నుల కోతబడక కృప చేసి నన్ చేరి కావుం అరుణాచలా వంచకా వేడియున్ గొంచెమున్ గరగవే అభయ మంచేలుమా అరుణాచలా అడుగకిచ్చెడు నీదు నకళంక మగు కీర్తి హాని సేయక బ్రోవు అరుణాచలా హస్తలమలక నీదు సద్రసమున సుఖోన్మాద మొందగ నేలు అరుణాచలా వల నుంచి భక్తుల పరిమార్చు నిను గట్టుకొని యెట్లు జీవింతును అరుణాచలా
అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచలా అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచలా
Offered for worship and study, not as prediction. Non-commercial.
More devotional texts
కోపరహిత గుణ గురిగాగ నను గొను కొరయేమి చేసితి అరుణాచలా గౌతమ పూజిత కరుణా ఘన నగమా కడ గంట ఏలుమా అరుణాచలా సకలము కబళించు కరకాంతియిన మనో జలజ మరల్పుమా అరుణాచలా తిండిని నిన్జేరితిని తిన నా నేను శాంతమై పోవుదును అరుణాచలా మది చల్లపడ భద్రకర ముంచి యమృతనోర్ తెరు మనుగ్రహచంద్ర అరుణాచలా వన్నెను చెరచి నిర్వాణ మొనర్చి కృపావన్నె నిడి బ్రోవుమరుణాచలా సుఖ సముద్రము పొంగ వాక్ మనమ్ములడంగ నూరక నమరు మందరుణాచలా వంచింతువేల నన్ శోధింపకిక నీదు జ్యోతి రూపము చూపుం అరుణాచలా పరవిద్య గరపి యీ భూమి మైకము వీడి రూపగు విద్య జూపు అరుణాచలా చేరకున్నను మేను నీరుగ గరగి కన్నీటేరయి నశింతు అరుణాచలా ఛీ యని ద్రోసిన చేయు కర్మ తపన గాకేది మను మారం అరుణాచలా చెప్పక చెపి నీవు మౌనత నుండని యూరక యుందువే అరుణాచలా
అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచలా అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచలా
సోమరి నైతిని మిన్నని సుఖ నిద్ర కన్న వేరెది గతి అరుణాచలా శౌర్యము జూపితి శమియించె నని మాయ చలియి0ప కున్నావు అరుణాచలా కుక్కకు న్నీచమే నేనే గురుతుగొని వెదకి నిన్జేరుదు అరుణాచలా జ్ఞానము లేక నీ యాస దైన్యము బాప జ్ఞానము దెల్పి బ్రోవుమరుణాచలా తేటి వలెను నీవు వికసింప లేదని యెదుట నిలుతువేల అరుణాచలా తత్వ మెరుగజాల నంతయై నిలుతువే యిదియేమి తత్వమో అరుణాచలా తా నేను తానను తత్వ మిద్దానిని తానుగా చూపింతు అరుణాచలా త్రిప్పి యహంతను నెప్పుడు లో ద్రుష్టి గన దెలియు ననునదే అరుణాచలా తీరముండని యెద వెదకియు నిన్ను నే తిరిగి పొందితి బ్రోవు మరుణాచలా సత్య జ్ఞానము లేని యీ జన్మ ఫలమేమి యొప్పగ రావేల అరుణాచలా శుద్ధ వాంగ్మన యుతులం దోచు నీ నిజా హంత గల్పి నను బ్రోవు అరుణాచలా దైవ మనుచు నిన్ను దరిచేరగా నన్ను పూర్ణ నాశ మొనర్చితి అరుణాచలా
అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచలా అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచలా
వెదుకక గనిన సచ్చ్రీయనుగ్రహనిధి మది తెగుల్ తీర్చి బ్రోవు అరుణాచలా ధైర్యము పరుగిడు నీ నిజహమరయ నే నాశమైతి బ్రోవు అరుణాచలా తాకి కృపాకరము నను గలియకున్న నిజము నశింతు బ్రోవు అరుణాచలా దోషరహిత నీవు నాతో నైక్యమయి నిత్యానంద మయమోనర్పరుణాచలా నగకు నెడముకాదు నిన్వెదకిన నన్ను గను కృపానగ వేసి అరుణాచలా నాన లేదె వెదుక నేనయి నీ వొంటి స్థాణువై నిలిచితివి అరుణాచలా నీ జ్వాల గాల్చినన్ నీరు సేసెడు మున్నె నీ కృప వర్షింపు అరుణాచలా నీవు నే నణగ నిత్యానందమయముగా నిలుచు స్థితి కరుణి0పు అరుణాచలా అణురూపు నిన్ను నే మిన్ను రూపుం చేర భావోర్ములెపుడాగు అరుణాచలా సూత్ర జ్ఞానము లేని పామరు నా మాయా జ్ఞానము కోసికావు అరుణాచలా మక్కి మక్కి కరగి నే నిన్ను శరణంద నగ్నుడవై నిల్చితి అరుణాచలా నేస్తముండని నాకు నీ యాశ చూపినన్ మోసగింపక బ్రోవు అరుణాచలా
అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల
Browse Related Categories: