Devi · Traditional devotional text · Source: vignanam.org (Traditional devotional text (public-domain shlokas))
రవిసుధాకర వహ్నిలోచన రత్నకుండల భూషిణీ ప్రవిమలంబుగ మమ్మునేలిన భక్తజన చింతామణీ । అవని జనులకు కొంగుబంగారైన దైవశిఖామణీ శివుని పట్టపురాణి గుణమణి శ్రీగిరి భ్రమరాంబికా ॥ 1 ॥
కలియుగంబున మానవులకును కల్పతరువై యుండవా వెలయగును శ్రీ శిఖరమందున విభవమై విలసిల్లవా । ఆలసింపక భక్తవరులకు అష్టసంపద లీయవా జిలుగు కుంకుమ కాంతిరేఖల శ్రీగిరి భ్రమరాంబికా ॥ 2 ॥
అంగ వంగ కలింగ కాశ్మీరాంధ్ర దేశములందునన్ పొంగుచును వరహాల కొంకణ పుణ్యభూముల యందునన్ । రంగుగా కర్ణాట రాట మరాట దేశములందునన్ శృంగినీ దేశముల వెలసిన శ్రీగిరి భ్రమరాంబికా ॥ 3 ॥
అక్షయంబుగ కాశిలోపల అన్నపూర్ణ భవానివై సాక్షిగణపతి కన్న తల్లివి సద్గుణావతి శాంభవీ । మోక్షమోసగెడు కనకదుర్గవు మూలకారణ శక్తివి శిక్షజేతువు ఘోరభవముల శ్రీగిరి భ్రమరాంబికా ॥ 4 ॥
ఉగ్రలోచన వరవధూమణి కొప్పుగల్గిన భామినీ విగ్రహంబుల కెల్ల ఘనమై వెలయు శోభనకారిణీ । అగ్రపీఠమునందు వెలసిన ఆగమార్థ విచారిణీ శీఘ్రమేకని వరములిత్తువు శ్రీగిరి భ్రమరాంబికా ॥ 5 ॥
నిగమగోచర నీలకుండలి నిర్మలాంగి నిరంజనీ మిగుల చక్కని పుష్పకోమలి మీననేత్ర దయానిధీ । జగతిలోన ప్రసిద్ధికెక్కిన చంద్రముఖి సీమంతినీ చిగురుటాకులవంటి పెదవుల శ్రీగిరి భ్రమరాంబికా ॥ 6 ॥
సోమశేఖర పల్లవాధరి సుందరీమణీ ధీమణీ కోమలాంగి కృపాపయోనిధి కుటిలకుంతల యోగినీ । నా మనంబున పాయకుండమ నగకులేశుని నందినీ సీమలోన ప్రసిద్ధికెక్కిన శ్రీగిరి భ్రమరాంబికా ॥ 7 ॥
Offered for worship and study, not as prediction. Non-commercial.
భూతనాథుని వామభాగము పొందుగా చేకొందువా ఖ్యాతిగను శ్రీశైలమున విఖ్యాతిగా నెలకొంటివా । పాతకంబుల పారద్రోలుచు భక్తులను చేకొంటివా శ్వేతగిరిపై నుండి వెలసిన శ్రీగిరి భ్రమరాంబికా ॥ 8 ॥
ఎల్లవెలసిన నీదు భావము విష్ణులోకము నందున పల్లవించును నీ ప్రభావము బ్రహ్మలోకము నందున । తెల్లముగ కైలాసమందున మూడులోకము లందున చెల్లునమ్మ త్రిలోకవాసిని శ్రీగిరి భ్రమరాంబికా ॥ 9 ॥
తరుణి శ్రీగిరి మల్లికార్జున దైవరాయల భామినీ కరుణతో మమ్మేలు యెప్పుడు కల్పవృక్షము భంగినీ । వరుసతో నీ యష్టకంబును వ్రాసి చదివిన వారికి సిరులనిచ్చెద వెల్ల కాలము శ్రీగిరి భ్రమరాంబికా ॥ 10 ॥
Browse Related Categories: