Devi · Traditional devotional text · Source: vignanam.org (Traditional devotional text (public-domain shlokas))
(కాళిదాస కృతం)
చేటీ భవన్నిఖిల ఖేటీ కదంబవన వాటీషు నాకి పటలీ కోటీర చారుతర కోటీ మణీకిరణ కోటీ కరంబిత పదా । పాటీరగంధి కుచశాటీ కవిత్వ పరిపాటీమగాధిప సుతా ఘోటీఖురాదధిక ధాటీముదార ముఖ వీటీరసేన తనుతామ్ ॥ 1 ॥ శా ॥
ద్వైపాయన ప్రభృతి శాపాయుధ త్రిదివ సోపాన ధూళి చరణా పాపాపహ స్వమను జాపానులీన జన తాపాపనోద నిపుణా । నీపాలయా సురభి ధూపాలకా దురితకూపాదుదన్చయతుమాం రూపాధికా శిఖరి భూపాల వంశమణి దీపాయితా భగవతీ ॥ 2 ॥ శా ॥
యాళీభి రాత్మతనుతాలీనకృత్ప్రియక పాళీషు ఖేలతి భవా వ్యాళీ నకుల్యసిత చూళీ భరా చరణ ధూళీ లసన్మణిగణా । యాళీ భృతి శ్రవసి తాళీ దళం వహతి యాళీక శోభి తిలకా సాళీ కరోతు మమ కాళీ మనః స్వపద నాళీక సేవన విధౌ ॥ 3 ॥ శా ॥
బాలామృతాంశు నిభ ఫాలామనా గరుణ చేలా నితంబ ఫలకే కోలాహల క్షపిత కాలామరాకుశల కీలాల శోషణ రవిః । స్థూలాకుచే జలద నీలాకచే కలిత వీలా కదంబ విపినే శూలాయుధ ప్రణతి శీలా దధాతు హృది శైలాధి రాజ తనయా ॥ 4 ॥ శా ॥
కంబావతీవ సవిడంబా గళేన నవ తుంబాభ వీణ సవిధా బింబాధరా వినత శంబాయుధాది నికురుంబా కదంబ విపినే । అంబా కురంగ మదజంబాల రోచి రిహ లంబాలకా దిశతు మే శం బాహులేయ శశి బింబాభి రామ ముఖ సంబాధితా స్తన భరా ॥ 5 ॥ శా ॥
దాసాయమాన సుమహాసా కదంబవన వాసా కుసుంభ సుమనో వాసా విపంచి కృత రాసా విధూత మధు మాసారవింద మధురా । కాసార సూన తతి భాసాభిరామ తను రాసార శీత కరుణా నాసా మణి ప్రవర భాసా శివా తిమిర మాసాయే దుపరతిమ్ ॥ 6 ॥ శా ॥
Offered for worship and study, not as prediction. Non-commercial.
న్యంకాకరే వపుషి కంకాళ రక్త పుషి కంకాది పక్షి విషయే త్వం కామనా మయసి కిం కారణం హృదయ పంకారి మే హి గిరిజామ్ । శంకాశిలా నిశిత టంకాయమాన పద సంకాశమాన సుమనో ఝంకారి భృంగతతి మంకానుపేత శశి సంకాశ వక్త్ర కమలామ్ ॥ 7 ॥ శా ॥
జంభారి కుంభి పృథు కుంభాపహాసి కుచ సంభావ్య హార లతికా రంభా కరీంద్ర కర దంభాపహోరుగతి డింభానురంజిత పదా । శంభా ఉదార పరిరంభాంకురత్ పులక దంభానురాగ పిశునా శం భాసురాభరణ గుంభా సదా దిశతు శుంభాసుర ప్రహరణా ॥ 8 ॥ శా ॥
దాక్షాయణీ దనుజ శిక్షా విధౌ వికృత దీక్షా మనోహర గుణా భిక్షాశినో నటన వీక్షా వినోద ముఖి దక్షాధ్వర ప్రహరణా । వీక్షాం విధేహి మయి దక్షా స్వకీయ జన పక్షా విపక్ష విముఖీ యక్షేశ సేవిత నిరాక్షేప శక్తి జయ లక్షావధాన కలనా ॥ 9 ॥ శా ॥
వందారు లోక వర సంధాయినీ విమల కుందావదాత రదనా బృందారు బృంద మణి బృందారవింద మకరందాభిషిక్త చరణా । మందానిలా కలిత మందార దామభిరమందాభిరామ మకుటా మందాకినీ జవన భిందాన వాచమరవిందాననా దిశతు మే ॥ 10 ॥ శా ॥
యత్రాశయో లగతి తత్రాగజా భవతు కుత్రాపి నిస్తుల శుకా సుత్రామ కాల ముఖ సత్రాసకప్రకర సుత్రాణ కారి చరణా । ఛత్రానిలాతిరయ పత్త్రాభిభిరామ గుణ మిత్రామరీ సమ వధూః కు త్రాసహీన మణి చిత్రాకృతి స్ఫురిత పుత్రాది దాన నిపుణా ॥ 11 ॥ శా ॥
కూలాతిగామి భయ తూలావళిజ్వలనకీలా నిజస్తుతి విధా కోలాహలక్షపిత కాలామరీ కుశల కీలాల పోషణ రతా । స్థూలాకుచే జలద నీలాకచే కలిత లీలా కదంబ విపినే శూలాయుధ ప్రణతి శీలా విభాతు హృది శైలాధిరాజ తనయా ॥ 12 ॥ శా ॥
ఇంధాన కీర మణిబంధా భవే హృదయబంధా వతీవ రసికా సంధావతీ భువన సంధారణే ప్యమృత సింధావుదార నిలయా । గంధానుభావ ముహురంధాలి పీత కచ బంధా సమర్పయతు మే శం ధామ భానుమపి రుంధాన మాశు పద సంధాన మప్యనుగతా ॥ 13 ॥ శా ॥
Browse Related Categories: