Sri Rama · Traditional devotional text · Source: vignanam.org (Traditional devotional text (public-domain shlokas))
రామచంద్రాయ జనకరాజజా మనోహరాయ మామకాభీష్టదాయ మహిత మంగళమ్ ॥
కోసలేశాయ మందహాస దాసపోషణాయ వాసవాది వినుత సద్వరద మంగళమ్ ॥ 1 ॥
చారు కుంకుమో పేత చందనాది చర్చితాయ హారకటక శోభితాయ భూరి మంగళమ్ ॥ 2 ॥
లలిత రత్నకుండలాయ తులసీవనమాలికాయ జలద సద్రుశ దేహాయ చారు మంగళమ్ ॥ 3 ॥
దేవకీపుత్రాయ దేవ దేవోత్తమాయ చాప జాత గురు వరాయ భవ్య మంగళమ్ ॥ 4 ॥
పుండరీకాక్షాయ పూర్ణచంద్రాననాయ అండజాతవాహనాయ అతుల మంగళమ్ ॥ 5 ॥
విమలరూపాయ వివిధ వేదాంతవేద్యాయ సుజన చిత్త కామితాయ శుభగ మంగళమ్ ॥ 6 ॥
రామదాస మృదుల హృదయ తామరస నివాసాయ [కమల వాసాయ] స్వామి భద్రగిరివరాయ సర్వ మంగళమ్ ॥ 7 ॥
Browse Related Categories:
Offered for worship and study, not as prediction. Non-commercial.
More devotional texts