Devi · Traditional devotional text · Source: vignanam.org (Traditional devotional text (public-domain shlokas))
శ్రీవిద్యే శివవామభాగనిలయే శ్రీరాజరాజార్చితే శ్రీనాథాదిగురుస్వరూపవిభవే చింతామణీపీఠికే । శ్రీవాణీగిరిజానుతాంఘ్రికమలే శ్రీశాంభవి శ్రీశివే మధ్యాహ్నే మలయధ్వజాధిపసుతే మాం పాహి మీనాంబికే ॥ 1 ॥
చక్రస్థేఽచపలే చరాచరజగన్నాథే జగత్పూజితే ఆర్తాలీవరదే నతాభయకరే వక్షోజభారాన్వితే । విద్యే వేదకలాపమౌళివిదితే విద్యుల్లతావిగ్రహే మాతః పూర్ణసుధారసార్ద్రహృదయే మాం పాహి మీనాంబికే ॥ 2 ॥
కోటీరాంగదరత్నకుండలధరే కోదండబాణాంచితే కోకాకారకుచద్వయోపరిలసత్ప్రాలంబహారాంచితే । శింజన్నూపురపాదసారసమణీశ్రీపాదుకాలంకృతే మద్దారిద్ర్యభుజంగగారుడఖగే మాం పాహి మీనాంబికే ॥ 3 ॥
బ్రహ్మేశాచ్యుతగీయమానచరితే ప్రేతాసనాంతస్థితే పాశోదంకుశచాపబాణకలితే బాలేందుచూడాంచితే । బాలే బాలకురంగలోలనయనే బాలార్కకోట్యుజ్జ్వలే ముద్రారాధితదైవతే మునిసుతే మాం పాహి మీనాంబికే ॥ 4 ॥
గంధర్వామరయక్షపన్నగనుతే గంగాధరాలింగితే గాయత్రీగరుడాసనే కమలజే సుశ్యామలే సుస్థితే । ఖాతీతే ఖలదారుపావకశిఖే ఖద్యోతకోట్యుజ్జ్వలే మంత్రారాధితదైవతే మునిసుతే మాం పాహీ మీనాంబికే ॥ 5 ॥
నాదే నారదతుంబురాద్యవినుతే నాదాంతనాదాత్మికే నిత్యే నీలలతాత్మికే నిరుపమే నీవారశూకోపమే । కాంతే కామకలే కదంబనిలయే కామేశ్వరాంకస్థితే మద్విద్యే మదభీష్టకల్పలతికే మాం పాహి మీనాంబికే ॥ 6 ॥
వీణానాదనిమీలితార్ధనయనే విస్రస్తచూలీభరే తాంబూలారుణపల్లవాధరయుతే తాటంకహారాన్వితే । శ్యామే చంద్రకళావతంసకలితే కస్తూరికాఫాలికే పూర్ణే పూర్ణకలాభిరామవదనే మాం పాహి మీనాంబికే ॥ 7 ॥
Offered for worship and study, not as prediction. Non-commercial.
శబ్దబ్రహ్మమయీ చరాచరమయీ జ్యోతిర్మయీ వాఙ్మయీ నిత్యానందమయీ నిరంజనమయీ తత్త్వంమయీ చిన్మయీ । తత్త్వాతీతమయీ పరాత్పరమయీ మాయామయీ శ్రీమయీ సర్వైశ్వర్యమయీ సదాశివమయీ మాం పాహి మీనాంబికే ॥ 8 ॥
ఇతి శ్రీమత్పరమహంసపరివ్రాజకాచార్యస్య శ్రీగోవిందభగవత్పూజ్యపాదశిష్యస్య శ్రీమచ్ఛంకరభగవతః కృతౌ మీనాక్షీ స్తోత్రమ్ ।
Browse Related Categories: