Sri Venkateswara Swamy · Traditional devotional text · Source: vignanam.org (Traditional devotional text (public-domain shlokas))
అందరికాధారమైన ఆది పురుషుడీతడు విందై మున్నారగించె విదురునికడ నీతుడు ॥ సనకాదులు కొనియాడెడి సర్వాత్మకుడీతడు వనజ భవాదులకును దైవంబై నతడీతడు । ఇనమండలమున జెలగేటిహితవై భవుడితడు మునుపుట్టిన దేవతలకు మూలభూతి యీతడు ॥ సిరులొసగి యశోదయింట శిశువైనత డీతడు ధరనావుల మందలలో తగ జరించె నీతడు । సరసతలను గొల్లెతలకు జనవులొసగె నీతడు ఆరసి కుచేలుని యడుకులు ఆరగించెనీతడు ॥ పంకజభవునకును బ్రహ్మ పద మొసగెను యీతుడు సంకీర్తన లాద్యులచే జట్టి గొనియెనీతడు । తెంకిగ నేకాలము పరదేవుడైన యీతడు వేంకటగిరి మీద ప్రభల వెలసిన ఘనుడీతడు ॥
Offered for worship and study, not as prediction. Non-commercial.
More devotional texts
Browse Related Categories: