Sri Venkateswara Swamy · Traditional devotional text · Source: vignanam.org (Traditional devotional text (public-domain shlokas))
రాగం: కడిగిన ఆ: స రి2 మ1 ప ని2 ద2 స అవ: స ని2 ద1 ప మ1 గ2 రి2 స తాళం: ఆది పల్లవి బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము దానె నీ పాదము ॥ చరణం 1 చెలగి వసుధ గొలిచిన నీ పాదము బలి తల మోపిన పాదము । తలకగ గగనము తన్నిన పాదము బలరిపు గాచిన పాదము ॥ బ్రహ్మ కడిగిన పాదము (ప ) చరణం 2 కామిని పాపము కడిగిన పాదము పాముతల నిడిన పాదము । ప్రేమపు శ్రీసతి పిసికెడి పాదము పామిడి తురగపు పాదము ॥ బ్రహ్మ కడిగిన పాదము (ప ) చరణం 3 పరమ యోగులకు పరి పరి విధముల పరమొసగెడి నీ పాదము । తిరువేంకటగిరి తిరమని చూపిన పరమ పదము నీ పాదము ॥ బ్రహ్మ కడిగిన పాదము (ప ) బ్రహ్మము దానె నీ పాదము ॥
Offered for worship and study, not as prediction. Non-commercial.
More devotional texts
Browse Related Categories: