Sri Venkateswara Swamy · Traditional devotional text · Source: vignanam.org (Traditional devotional text (public-domain shlokas))
హరి యవతార మీతడు అన్నమయ్య । అరయ మా గురుడీతడు అన్నమయ్య । వైకుంఠ నాథుని వద్ద వడి పడు చున్న వాడు ఆకరమై తాళ్ళపాక అన్నమయ్య । ఆకసపు విష్ణు పాదమందు నిత్యమై ఉన్న వాడు ఆకడీకడ తాళ్ళపాక అన్నమయ్య ॥ ఈవల సంసార లీల ఇందిరేశుతో నున్న వాడు ఆవటించి తాళ్ళపాక అన్నమయ్య । భావింప శ్రీ వేంకటేశు పదములందే యున్నవాడు హావ భావమై తాళ్ళపాక అన్నమయ్య ॥ క్షీరాబ్ధిశాయి బట్టి సేవింపుచు నున్నవాడు ఆరితేరి తాళ్ళపాక అన్నమయ్య । ధీరుడై సూర్యమండల తేజము వద్ద నున్నవాడు ఆరీతుల తాళ్ళపాక అన్నమయ్య ॥
Offered for worship and study, not as prediction. Non-commercial.
More devotional texts
Browse Related Categories: