Sri Venkateswara Swamy · Traditional devotional text · Source: vignanam.org (Traditional devotional text (public-domain shlokas))
రాగం: కాపి ఆ: స రి2 మ1 ప ని3 స అవ: స ని2 ద2 ని2 ప మ1 గ2 రి2 స తాళం: ఆది పల్లవి (రాగం: కేదార) జో అచ్యుతానంద జోజో ముకుందా రావె పరమానంద రామ గోవిందా ॥ (2.5) జో జో (2) చరణం 1 అంగజుని గన్న మా యన్న యిటు రారా బంగారు గిన్నెలో పాలు పోసేరా । (2) దొంగ నీవని సతులు గొంకుచున్నారా ముంగిట నాడరా మోహనాకార ॥ (1) జో జో ॥ (2) చరణం 2 (రాగం: సురటి) ఆ: స గ3 రి2 గ3 మ1 ప ద2 ని2 ద2 ప స అవ: స ని3 ద2 ప మ1 గ3 రి2 స గోవర్ధనంబెల్ల గొడుగుగా పట్టి కావరమ్మున నున్న కంసుపడగొట్టి । నీవు మధురాపురము నేలచేపట్టి ఠీవితో నేలిన దేవకీపట్టి ॥ చరణం 3 నందు నింటను జేరి నయము మీఱంగ చంద్రవదనలు నీకు సేవ చేయంగ । నందముగ వారిండ్ల నాడుచుండంగ మందలకు దొంగ మా ముద్దురంగ ॥ చరణం 4 (రాగం: బిలహరి) ఆ: స రి2 గ3 ప ద2 స అవ: స ని3 ద2 ప మ1 గ3 రి2 స పాలవారాశిలో పవళించినావు బాలుగా మునుల కభయమిచ్చినావు । మేలుగా వసుదేవు కుదయించినావు బాలుడై యుండి గోపాలుడైనావు ॥ చరణం 5 (రాగం: ధన్యాసి) ఆ: స గ2 మ1 ప ని2 స అవ: స ని2 ద1 ప మ1 గ2 రి1 స అట్టుగట్టిన మీగ డట్టె తిన్నాడే పట్టి కోడలు మూతిపై రాసినాడే । అట్టె తినెనని యత్త యడగ విన్నాడే గట్టిగా నిది దొంగ కొట్టుమన్నాడే ॥ చరణం 6 (రాగం: శన్కరాభరణ) ఆ: స రి2 గ3 మ1 ప ద2 ని3 స అవ: స ని3 ద2 ప మ1 గ3 రి2 స గొల్లవారిండ్లకు గొబ్బునకుబోయి కొల్లలుగా త్రావి కుండలను నేయి । చెల్లునా మగనాండ్ర జెలిగి యీశాయీ చిల్లతనములు సేయ జెల్లునటవోయి ॥ చరణం 7 (రాగం: ఖరహరప్రియా) ఆ: స రి2 గ2 మ1 ప ద2 ని2 స అవ: స ని2 ద2 ప మ1 గ2 రి2 స రేపల్లె సతులెల్ల గోపంబుతోను గోపమ్మ మీ కొడుకు మా యిండ్ల లోను । మాపుగానే వచ్చి మా మానములను నీ పాపడే చెఱిచె నేమందుమమ్మ ॥ చరణం 8 (రాగం: కాంభోజి) ఆ: స రి2 గ3 మ1 ప ద2 స అవ: స ని2 ద2 ప మ1 గ3 రి2 స ని3 ప ద2 స ఒకని యాలినిదెచ్చి నొకని కడబెట్టి జగడములు కలిపించి సతిపతులబట్టి । పగలు నలుజాములును బాలుడై నట్టి మగనాండ్ర చేపట్టి మదనుడై నట్టి ॥ చరణం 9 అలిగి తృణావర్తు నవని గూల్చితివి బలిమిమై బూతన బట్టి పీల్చితివి । చెలగి శకటాసురుని జేరి డొల్చితివి తలచి మద్దులు రెండు ధరణి వ్రాల్చితివి ॥ చరణం 10 (రాగం: సురటి) ఆ: స రి2 మ1 ప ని2 స అవ: స ని2 ద2 ప మ1 గ3 ప మ1 రి2 స హంగుగా తాళ్ళపాకన్నయ్య చాల శృంగార రచనగా చెప్పె నీ జోల । (2) సంగతిగ సకల సంపదల నీవేళ మంగళము తిరుపట్ల మదనగోపాల ॥ (1) జో అచ్యుతానంద జోజో ముకుందా రావె పరమానంద రామ గోవిందా ॥ (ప.) (2.5) జో జో ॥ (4)
Offered for worship and study, not as prediction. Non-commercial.
More devotional texts
Browse Related Categories: