Sri Venkateswara Swamy · Traditional devotional text · Source: vignanam.org (Traditional devotional text (public-domain shlokas))
కామధేను విదే కల్పవృక్ష మిదే ప్రామాణ్యము గల ప్రపన్నులకు ॥ హరినామజపమే ఆభరణంబులు పరమాత్మునినుతి పరిమళము । దరణిదరు పాదసేవే భోగము పరమంబెరిగిన ప్రపన్నులకు ॥ దేవుని ధ్యానము దివ్యాన్నంబులు శ్రీవిభు భక్తే జీవనము । ఆవిష్ణు కైంకర్యమే సంసారము పావనులగు యీ ప్రపన్నులకు ॥ యేపున శ్రీవేంకటేశుడే సర్వము దాపై యితని వందనమే విధి । కాపుగ శరణాగతులే చుట్టాలు పై పయి గెలిచిన ప్రపన్నులకు ॥
Offered for worship and study, not as prediction. Non-commercial.
More devotional texts
Browse Related Categories: