Sri Venkateswara Swamy · Traditional devotional text · Source: vignanam.org (Traditional devotional text (public-domain shlokas))
మూసిన ముత్యాల కేలే మొరగులు ఆశల చిత్తాని కేలే అలవోకలు ॥ కందులేని మోమున కేలే కస్తూరి చిందు నీ కొప్పున కేలే చేమంతులు । మందయానమున కేలే మట్టెల మోతలు గంధమేలే పైపై కమ్మని నీ మేనికి ॥ భారపు గుబ్బల కేలే పయ్యెద నీ బీరపు జూపుల కేలే పెడమోము । జీరల భుజాల కేలే చెమటలు నీ గోరంట గోళ్ళ కేలే కొనవాండ్లు ॥ ముద్దుల మాటల కేలే ముదములు నీ యద్దపు జెక్కుల కేలే అరవిరి । వొద్దికమాటల కేలే వూర్పులు నీకు నద్దమేలే తిరు వేంకటాద్రీశు గూడి ॥
Offered for worship and study, not as prediction. Non-commercial.
More devotional texts
Browse Related Categories: