Sri Venkateswara Swamy · Traditional devotional text · Source: vignanam.org (Traditional devotional text (public-domain shlokas))
రాగం: మధ్యామావతి (పెద తిరు ఆ: స రి2 మ1 ప ని2 స అవ: స ని2 ప మ1 రి2 స తాళం: ఆది పల్లవి పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత । పడమరలి నవ్వీనె పెండ్లి కూతురు ॥ (2) చరణం 1 పేరుకల జవరాలె పెండ్లి కూతురు పెద్ద । పేరుల ముత్యాల మేడ పెండ్లి కూతురు । (2) పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు । (2) విభు పేరుకుచ్చు సిగ్గువడీ బెండ్లి కూతురు ॥ పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత..(ప..)(2) చరణం 2 బిరుదు పెండము వెట్టె బెండ్లి కూతురు । నెర బిరుదు మగని కంటె బెండ్లి కూతురు । పిరిదూరి నప్పుడే పెండ్లి కూతురూ । పతి బెరరేచీ నిదివో పెండ్లి కూతురు ॥ పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత..(ప..) చరణం 3 పెట్టెనే పెద్ద తురుము పెండ్లి కూతురు । నేడె పెట్టెడు చీరలు గట్టి పెండ్లి కూతురు । గట్టిగ వేంకటపతి కౌగిటను । పెట్టిన నిధానమయిన పెండ్లి కూతురు ॥ పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పడమరలి నవ్వీనె పెండ్లి కూతురు ॥
Offered for worship and study, not as prediction. Non-commercial.
More devotional texts
Browse Related Categories: