Sri Venkateswara Swamy · Traditional devotional text · Source: vignanam.org (Traditional devotional text (public-domain shlokas))
సువ్వి సువ్వి సువ్వాలమ్మా నవ్వుచు దేవకి నందను గనియె ॥ శశి వొడచె అలసంబులు గదచె దిశ దేవతల దిగుళ్ళు విడచె ॥ కావిరి విరసె కంసుడు గినిసె వావిరి పువ్వుల వానలు గురిసె ॥ గతి సేసె అటు గాడిద గూసె కుతిలకుడిచి జనకుడు నోరు మూసె ॥ గగురు పొడిచె లోకము విధి విడిచె మొగులు గురియగ యమునపై నదచె ॥ కలిజారె వేంకటపతి మీరె అలమేల్మంగ నాంచారమ్మకలుకలు తీరె ॥
Offered for worship and study, not as prediction. Non-commercial.
More devotional texts
Browse Related Categories: