Sri Venkateswara Swamy · Traditional devotional text · Source: vignanam.org (Traditional devotional text (public-domain shlokas))
రాగం: లలితా ఆ: స రి1 గ3 మ1 ద1 ని3 స అవ: స ని3 ద1 మ1 గ3 రి1 స తాళం: ఆది పల్లవి తెప్పగా మర్రాకు మీద తేలాడువాడు । ఎప్పుడు లోకములెల్ల నేలేటివాడు ॥ చరణం 1 మోతనీటి మడుగులో యీతగరచినవాడు । పాతగిలే నూతిక్రింద బాయనివాడు । (2) మూతిదోసిపట్టి మంటి ముద్ద పెల్లగించువాడు । (2) రోతయైన పేగుల పేరులు గలవాడు ॥ (2) తెప్పగా మర్రాకు మీద తేలాడువాడు..(ప..) చరణం 2 కోడికూత నోరివాని కుర్రతమ్ముడైనవాడు । బూడిద బూసినవాని బుద్ధులవాడు । (2) మాడవన్నె లేడివెంట మాయలబడినవాడు । (2) దూడల నావులగాచి దొరయైనవాడు ॥ (2) తెప్పగా మర్రాకు మీద తేలాడువాడు..(ప..) చరణం 3 ఆకసానబారే వూరి అతివల మానముల । కాకుసేయువాడు తురగముపైవాడు । (2) ఏకమై వేంకటగిరి నిందిరారమణి గూడి । (2) యేకాలముబాయని యెనలేనివాడు ॥ (2) తెప్పగా మర్రాకు మీద తేలాడువాడు । ఎప్పుడు లోకములెల్ల నేలేటివాడు ॥
Offered for worship and study, not as prediction. Non-commercial.
More devotional texts
Browse Related Categories: