Svarajatis - Carnatic Music Lessons · Traditional devotional text · Source: vignanam.org (Traditional devotional text (public-domain shlokas))
రాగం ఖమాస్ (మేళకర్త 28, హరికాంభోజి జన్యరాగ) ఆరోహణ: స . . . . మ1, గ3 మ1 . ప . ద2 ని2 . స' అవరోహణ: స' . ని2 ద2 . ప . మ1 గ3 . రి2 . స తాళం: చతుస్ర జాతి త్రిపుట తాళం (ఆది) రూపకర్త: చిన్నకృష్ణ దాసర్ పల్లవి సాంబశివాయనవే రాజితగిరి శాంభవీమనోహరా పరాత్పరా కృపాకరా శ్రీ చరణం 1 నీవే గురు దైవంబని యే వేళను సేవింపుచు సదా మదిని శివ చరణం 2 పరమ దయానిధి వనుచు మరువక నా హృదయమున మహాదేవ మహాప్రభో సుందర నయన సురవర దాయక భవభయ హరశివ చరణం 3 స్థిర మధురాపురమున వరములొసగు హరుని నిరతమును దలచి చరణం 4 శ్రీ శుభకర శశి మకుటధర జయ విజయ త్రిపురహరా- శ్రితజన లోలాద్భుత గుణశీలా కృతనుతపాలా పతితుని లోలా- ముదంబల రంగ పదాబ్జములందు పదంబులుజేర్చు పశుపతిని జ్ఞానము ధ్యానము స్నానము పానము దానము మానము అభిమానమనుచు కనికరమున చరణంబులు కను- గొను శృతులన్నుతుల శరణనుచు (సాంబ) చరణం 5 (ఖండ గతి - 5 కాల) సారెసారెగు నీ నామ మంత్రం కోరినాను నీ పాదాంబుజ మంత్రం దాసుడౌ చిన్ని కృష్ణునికి దిక్కు నీవేయని శొక్కనాథుని నమ్ముకొని స్వరాః పల్లవి
Offered for worship and study, not as prediction. Non-commercial.
Browse Related Categories: