Vishnu · Traditional devotional text · Source: vignanam.org (Traditional devotional text (public-domain shlokas))
సాంద్రానందతనో హరే నను పురా దైవాసురే సంగరే త్వత్కృత్తా అపి కర్మశేషవశతో యే తే న యాతా గతిమ్ । తేషాం భూతలజన్మనాం దితిభువాం భారేణ దూరార్దితా భూమిః ప్రాప విరించమాశ్రితపదం దేవైః పురైవాగతైః ॥1॥
హా హా దుర్జనభూరిభారమథితాం పాథోనిధౌ పాతుకా- మేతాం పాలయ హంత మే వివశతాం సంపృచ్ఛ దేవానిమాన్ । ఇత్యాదిప్రచురప్రలాపవివశామాలోక్య ధాతా మహీం దేవానాం వదనాని వీక్ష్య పరితో దధ్యౌ భవంతం హరే ॥2॥
ఊచే చాంబుజభూరమూనయి సురాః సత్యం ధరిత్ర్యా వచో నన్వస్యా భవతాం చ రక్షణవిధౌ దక్షో హి లక్ష్మీపతిః । సర్వే శర్వపురస్సరా వయమితో గత్వా పయోవారిధిం నత్వా తం స్తుమహే జవాదితి యయుః సాకం తవాకేతనమ్ ॥3॥
తే ముగ్ధానిలశాలిదుగ్ధజలధేస్తీరం గతాః సంగతా యావత్త్వత్పదచింతనైకమనసస్తావత్ స పాథోజభూః । త్వద్వాచం హృదయే నిశమ్య సకలానానందయన్నూచివా- నాఖ్యాతః పరమాత్మనా స్వయమహం వాక్యం తదాకర్ణ్యతామ్ ॥4॥
జానే దీనదశామహం దివిషదాం భూమేశ్చ భీమైర్నృపై- స్తత్క్షేపాయ భవామి యాదవకులే సోఽహం సమగ్రాత్మనా । దేవా వృష్ణికులే భవంతు కలయా దేవాంగనాశ్చావనౌ మత్సేవార్థమితి త్వదీయవచనం పాథోజభూరూచివాన్ ॥5॥
శ్రుత్వా కర్ణరసాయనం తవ వచః సర్వేషు నిర్వాపిత- స్వాంతేష్వీశ గతేషు తావకకృపాపీయూషతృప్తాత్మసు । విఖ్యాతే మధురాపురే కిల భవత్సాన్నిధ్యపుణ్యోత్తరే ధన్యాం దేవకనందనాముదవహద్రాజా స శూరాత్మజః ॥6॥
ఉద్వాహావసితౌ తదీయసహజః కంసోఽథ సమ్మానయ- న్నేతౌ సూతతయా గతః పథి రథే వ్యోమోత్థయా త్వద్గిరా । అస్యాస్త్వామతిదుష్టమష్టమసుతో హంతేతి హంతేరితః సంత్రాసాత్ స తు హంతుమంతికగతాం తన్వీం కృపాణీమధాత్ ॥7॥
Offered for worship and study, not as prediction. Non-commercial.
More devotional texts
గృహ్ణానశ్చికురేషు తాం ఖలమతిః శౌరేశ్చిరం సాంత్వనై- ర్నో ముంచన్ పునరాత్మజార్పణగిరా ప్రీతోఽథ యాతో గృహాన్ । ఆద్యం త్వత్సహజం తథాఽర్పితమపి స్నేహేన నాహన్నసౌ దుష్టానామపి దేవ పుష్టకరుణా దృష్టా హి ధీరేకదా ॥8॥
తావత్త్వన్మనసైవ నారదమునిః ప్రోచే స భోజేశ్వరం యూయం నన్వసురాః సురాశ్చ యదవో జానాసి కిం న ప్రభో । మాయావీ స హరిర్భవద్వధకృతే భావీ సురప్రార్థనా- దిత్యాకర్ణ్య యదూనదూధునదసౌ శౌరేశ్చ సూనూనహన్ ॥9॥
ప్రాప్తే సప్తమగర్భతామహిపతౌ త్వత్ప్రేరణాన్మాయయా నీతే మాధవ రోహిణీం త్వమపి భోఃసచ్చిత్సుఖైకాత్మకః । దేవక్యా జఠరం వివేశిథ విభో సంస్తూయమానః సురైః స త్వం కృష్ణ విధూయ రోగపటలీం భక్తిం పరాం దేహి మే ॥10॥
Browse Related Categories: