Sri Rama · Traditional devotional text · Source: vignanam.org (Traditional devotional text (public-domain shlokas))
రాగం: నాదనామక్రియ/నాదనామక్రియ 15 మాయమాళవ గొవ్ళ జన్య ఆ: స రి1 గ3 మ1 ప ద1 ని3 అవ: ని3 ద1 ప మ1 గ3 రి1 స ని3 తాళం: ఆది పల్లవి ఏ తీరుగ నను దయ చూచెదవో, ఇనవంశోత్తమ రామా నా తరమా భవ సాగరమీదను, నళిన దళేక్షణ రామా ॥ ఏ తీరుగ ॥ చరణం 1 శ్రీ రఘు నందన సీతా రమణా, శ్రితజన పోషక రామా కారుణ్యాలయ భక్త వరద నిను, కన్నది కానుపు రామా ॥ ఏ తీరుగ ॥ చరణం 2 క్రూరకర్మములు నేరక చేసితి, నేరములెంచకు రామా దారిద్ర్యము పరిహారము సేయవే, దైవ శిఖామణి రామా ॥ ఏ తీరుగ ॥ చరణం 3 వాసవనుత రామదాస పోషక వందన-మయోధ్య రామా దాసార్చిత మాకభయ-మొసంగవే దాశరథీ రఘురామా ॥ ఏ తీరుగ ॥ చరణం 4 గురుడవు నా మది దైవము నీవని గురుశాస్త్రంబులు రామా గురుదైవంబని యెరుగక తిరిగెడు క్రూరుడనైతిని రామా ॥ ఏ తీరుగ ॥ చరణం 5 నిండితి వీ వఖిలాండ కోటి బ్రహ్మాండములందున రామా నిండుగ మది నీ నామము దలచిన నిత్యానందము రామా ॥ ఏ తీరుగ ॥ చరణం 6 వాసవ కమల భవాసురవందిత వారధి బంధన రామా భాసుర వర సద్గుణములు కల్గిన భద్రాద్రీశ్వర రామా ॥ ఏ తీరుగ ॥ చరణం 7 మురిపెముతో నా స్వామివి నేవని ముందుగ తెల్పితి రామా మరువక ఇక నభిమానమున్చు నే మరుగుజొఛితిని రామా ॥ ఏ తీరుగ ॥ ఏ తీరుగ నను దయ చూచెదవో, ఇనవంశోత్తమ రామా నా తరమా భవ సాగరమీదను, నళిన దళేక్షణ రామా
Offered for worship and study, not as prediction. Non-commercial.
More devotional texts
Browse Related Categories: