Vishnu · Traditional devotional text · Source: vignanam.org (Traditional devotional text (public-domain shlokas))
కలితకనకచేలం ఖండితాపత్కుచేలం గళధృతవనమాలం గర్వితారాతికాలమ్ । కలిమలహరశీలం కాంతిధూతేంద్రనీలం వినమదవనశీలం వేణుగోపాలమీడే ॥ 1 ॥
వ్రజయువతివిలోలం వందనానందలోలం కరధృతగురుశైలం కంజగర్భాదిపాలమ్ । అభిమతఫలదానం శ్రీజితామర్త్యసాలం వినమదవనశీలం వేణుగోపాలమీడే ॥ 2 ॥
ఘనతరకరుణాశ్రీకల్పవల్ల్యాలవాలం కలశజలధికన్యామోదకశ్రీకపోలమ్ । ప్లుషితవినతలోకానంతదుష్కర్మతూలం వినమదవనశీలం వేణుగోపాలమీడే ॥ 3 ॥
శుభదసుగుణజాలం సూరిలోకానుకూలం దితిజతతికరాలం దివ్యదారాయితేలమ్ । మృదుమధురవచఃశ్రీ దూరితశ్రీరసాలం వినమదవనశీలం వేణుగోపాలమీడే ॥ 4 ॥
మృగమదతిలకశ్రీమేదురస్వీయఫాలం జగదుదయలయస్థిత్యాత్మకాత్మీయఖేలమ్ । సకలమునిజనాళీమానసాంతర్మరాళం వినమదవనశీలం వేణుగోపాలమీడే ॥ 5 ॥
అసురహరణఖేలనం నందకోత్క్షేపలీలం విలసితశరకాలం విశ్వపూర్ణాంతరాళమ్ । శుచిరుచిరయశశ్శ్రీధిక్కృత శ్రీమృణాలం వినమదవనశీలం వేణుగోపాలమీడే ॥ 6 ॥
స్వపరిచరణలబ్ధ శ్రీధరాశాధిపాలం స్వమహిమలవలీలాజాతవిధ్యండగోళమ్ । గురుతరభవదుఃఖానీక వాఃపూరకూలం వినమదవనశీలం వేణుగోపాలమీడే ॥ 7 ॥
చరణకమలశోభాపాలిత శ్రీప్రవాళం సకలసుకృతిరక్షాదక్షకారుణ్య హేలమ్ । రుచివిజితతమాలం రుక్మిణీపుణ్యమూలం వినమదవనశీలం వేణుగోపాలమీడే ॥ 8 ॥
Offered for worship and study, not as prediction. Non-commercial.
More devotional texts
శ్రీవేణుగోపాల కృపాలవాలాం శ్రీరుక్మిణీలోలసువర్ణచేలామ్ । కృతిం మమ త్వం కృపయా గృహీత్వా స్రజం యథా మాం కురు దుఃఖదూరమ్ ॥ 9 ॥
ఇతి శ్రీ వేణుగోపాలాష్టకమ్ ।
Browse Related Categories: