Devi · Traditional devotional text · Source: vignanam.org (Traditional devotional text (public-domain shlokas))
యామామనంతి మునయః ప్రకృతిం పురాణీం విద్యేతి యాం శ్రుతిరహస్యవిదో వదంతి । తామర్ధపల్లవితశంకరరూపముద్రాం దేవీమనన్యశరణః శరణం ప్రపద్యే ॥ 1 ॥
అంబ స్తవేషు తవ తావదకర్తృకాణి కుంఠీభవంతి వచసామపి గుంభనాని । డింభస్య మే స్తుతిరసావసమంజసాపి వాత్సల్యనిఘ్నహృదయాం భవతీం ధినోతు ॥ 2 ॥
వ్యోమేతి బిందురితి నాద ఇతీందులేఖా- -రూపేతి వాగ్భవతనూరితి మాతృకేతి । నిఃస్యందమానసుఖబోధసుధాస్వరూపా విద్యోతసే మనసి భాగ్యవతాం జనానామ్ ॥ 3 ॥
ఆవిర్భవత్పులకసంతతిభిః శరీరై- -ర్నిఃస్యందమానసలిలైర్నయనైశ్చ నిత్యమ్ । వాగ్భిశ్చ గద్గదపదాభిరుపాసతే యే పాదౌ తవాంబ భువనేషు త ఏవ ధన్యాః ॥ 4 ॥
వక్త్రం యదుద్యతమభిష్టుతయే భవత్యా- -స్తుభ్యం నమో యదపి దేవి శిరః కరోతి । చేతశ్చ యత్త్వయి పరాయణమంబ తాని కస్యాపి కైరపి భవంతి తపోవిశేషైః ॥ 5 ॥
మూలాలవాలకుహరాదుదితా భవాని నిర్భిద్య షట్సరసిజాని తటిల్లతేవ । భూయోఽపి తత్ర విశసి ధ్రువమండలేందు- -నిఃస్యందమానపరమామృతతోయరూపా ॥ 6 ॥
దగ్ధం యదా మదనమేకమనేకధా తే ముగ్ధః కటాక్షవిధిరంకురయాంచకార । ధత్తే తదాప్రభృతి దేవి లలాటనేత్రం సత్యం హ్రియైవ ముకులీకృతమిందుమౌలేః ॥ 7 ॥
అజ్ఞాతసంభవమనాకలితాన్వవాయం భిక్షుం కపాలినమవాససమద్వితీయమ్ । పూర్వం కరగ్రహణమంగలతో భవత్యాః శంభుం క ఏవ బుబుధే గిరిరాజకన్యే ॥ 8 ॥
Offered for worship and study, not as prediction. Non-commercial.
చర్మాంబరం చ శవభస్మవిలేపనం చ భిక్షాటనం చ నటనం చ పరేతభూమౌ । వేతాలసంహతిపరిగ్రహతా చ శంభోః శోభాం బిభర్తి గిరిజే తవ సాహచర్యాత్ ॥ 9 ॥
కల్పోపసంహరణకేలిషు పండితాని చండాని ఖండపరశోరపి తాండవాని । ఆలోకనేన తవ కోమలితాని మాత- -ర్లాస్యాత్మనా పరిణమంతి జగద్విభూత్యై ॥ 10 ॥
జంతోరపశ్చిమతనోః సతి కర్మసామ్యే నిఃశేషపాశపటలచ్ఛిదురా నిమేషాత్ । కల్యాణి దేశికకటాక్షసమాశ్రయేణ కారుణ్యతో భవతి శాంభవవేదదీక్షా ॥ 11 ॥
ముక్తావిభూషణవతీ నవవిద్రుమాభా యచ్చేతసి స్ఫురసి తారకితేవ సంధ్యా । ఏకః స ఏవ భువనత్రయసుందరీణాం కందర్పతాం వ్రజతి పంచశరీం వినాపి ॥ 12 ॥
యే భావయంత్యమృతవాహిభిరంశుజాలై- -రాప్యాయమానభువనామమృతేశ్వరీం త్వామ్ । తే లంఘయంతి నను మాతరలంఘనీయాం బ్రహ్మాదిభిః సురవరైరపి కాలకక్షామ్ ॥ 13 ॥
యః స్ఫాటికాక్షగుణపుస్తకకుండికాఢ్యాం వ్యాఖ్యాసముద్యతకరాం శరదిందుశుభ్రామ్ । పద్మాసనాం చ హృదయే భవతీముపాస్తే మాతః స విశ్వకవితార్కికచక్రవర్తీ ॥ 14 ॥
బర్హావతంసయుతబర్బరకేశపాశాం గుంజావలీకృతఘనస్తనహారశోభామ్ । శ్యామాం ప్రవాలవదనాం సుకుమారహస్తాం త్వామేవ నౌమి శబరీం శబరస్య జాయామ్ ॥ 15 ॥
అర్ధేన కిం నవలతాలలితేన ముగ్ధే క్రీతం విభోః పరుషమర్ధమిదం త్వయేతి । ఆలీజనస్య పరిహాసవచాంసి మన్యే మందస్మితేన తవ దేవి జడీ భవంతి ॥ 16 ॥
బ్రహ్మాండ బుద్బుదకదంబకసంకులోఽయం మాయోదధిర్వివిధదుఃఖతరంగమాలః । ఆశ్చర్యమంబ ఝటితి ప్రలయం ప్రయాతి త్వద్ధ్యానసంతతిమహాబడబాముఖాగ్నౌ ॥ 17 ॥
దాక్షాయణీతి కుటిలేతి కుహారిణీతి కాత్యాయనీతి కమలేతి కలావతీతి । ఏకా సతీ భగవతీ పరమార్థతోఽపి సందృశ్యసే బహువిధా నను నర్తకీవ ॥ 18 ॥
ఆనందలక్షణమనాహతనామ్ని దేశే నాదాత్మనా పరిణతం తవ రూపమీశే । ప్రత్యఙ్ముఖేన మనసా పరిచీయమానం శంసంతి నేత్రసలిలైః పులకైశ్చ ధన్యాః ॥ 19 ॥
త్వం చంద్రికా శశిని తిగ్మరుచౌ రుచిస్త్వం త్వం చేతనాసి పురుషే పవనే బలం త్వమ్ । త్వం స్వాదుతాసి సలిలే శిఖిని త్వమూష్మా నిఃసారమేవ నిఖిలం త్వదృతే యది స్యాత్ ॥ 20 ॥
జ్యోతీంషి యద్దివి చరంతి యదంతరిక్షం సూతే పయాంసి యదహిర్ధరణీం చ ధత్తే । యద్వాతి వాయురనలో యదుదర్చిరాస్తే తత్సర్వమంబ తవ కేవలమాజ్ఞయైవ ॥ 21 ॥
సంకోచమిచ్ఛసి యదా గిరిజే తదానీం వాక్తర్కయోస్త్వమసి భూమిరనామరూపా । యద్వా వికాసముపయాసి యదా తదానీం త్వన్నామరూపగణనాః సుకరా భవంతి ॥ 22 ॥
భోగాయ దేవి భవతీం కృతినః ప్రణమ్య భ్రూకింకరీకృతసరోజగృహాః సహస్రమ్ । చింతామణిప్రచయకల్పితకేలిశైలే కల్పద్రుమోపవన ఏవ చిరం రమంతే ॥ 23 ॥
హర్తుం త్వమేవ భవసి త్వదధీనమీశే సంసారతాపమఖిలం దయయా పశూనామ్ । వైకర్తనీ కిరణసంహతిరేవ శక్తా ధర్మం నిజం శమయితుం నిజయైవ వృష్ట్యా ॥ 24 ॥
శక్తిః శరీరమధిదైవతమంతరాత్మా జ్ఞానం క్రియా కరణమాసనజాలమిచ్ఛా । ఐశ్వర్యమాయతనమావరణాని చ త్వం కిం తన్న యద్భవసి దేవి శశాంకమౌలేః ॥ 25 ॥
భూమౌ నివృత్తిరుదితా పయసి ప్రతిష్ఠా విద్యాఽనలే మరుతి శాంతిరతీవకాంతిః । వ్యోమ్నీతి యాః కిల కలాః కలయంతి విశ్వం తాసాం హి దూరతరమంబ పదం త్వదీయమ్ ॥ 26 ॥
యావత్పదం పదసరోజయుగం త్వదీయం నాంగీకరోతి హృదయేషు జగచ్ఛరణ్యే । తావద్వికల్పజటిలాః కుటిలప్రకారా- -స్తర్కగ్రహాః సమయినాం ప్రలయం న యాంతి ॥ 27 ॥
నిర్దేవయానపితృయానవిహారమేకే కృత్వా మనః కరణమండలసార్వభౌమమ్ । ధ్యానే నివేశ్య తవ కారణపంచకస్య పర్వాణి పార్వతి నయంతి నిజాసనత్వమ్ ॥ 28 ॥
స్థూలాసు మూర్తిషు మహీప్రముఖాసు మూర్తేః కస్యాశ్చనాపి తవ వైభవమంబ యస్యాః । పత్యా గిరామపి న శక్యత ఏవ వక్తుం సాపి స్తుతా కిల మయేతి తితిక్షితవ్యమ్ ॥ 29 ॥
కాలాగ్నికోటిరుచిమంబ షడధ్వశుద్ధౌ ఆప్లావనేషు భవతీమమృతౌఘవృష్టిమ్ । శ్యామాం ఘనస్తనతటాం శకలీకృతాఘాం ధ్యాయంత ఏవ జగతాం గురవో భవంతి ॥ 30 ॥
విద్యాం పరాం కతిచిదంబరమంబ కేచి- -దానందమేవ కతిచిత్కతిచిచ్చ మాయామ్ । త్వాం విశ్వమాహురపరే వయమామనామః సాక్షాదపారకరుణాం గురుమూర్తిమేవ ॥ 31 ॥
కువలయదలనీలం బర్బరస్నిగ్ధకేశం పృథుతరకుచభారాక్రాంతకాంతావలగ్నమ్ । కిమిహ బహుభిరుక్తైస్త్వత్స్వరూపం పరం నః సకలజనని మాతః సంతతం సన్నిధత్తామ్ ॥ 32 ॥
ఇతి శ్రీకాళిదాస విరచిత పంచస్తవ్యాం చతుర్థః అంబాస్తవః ।
Browse Related Categories: