Sri Venkateswara Swamy · Traditional devotional text · Source: vignanam.org (Traditional devotional text (public-domain shlokas))
అతిదుష్టుడ నే నలసుడను । యితరవివేకం బికనేల ॥ ఎక్కడ నెన్నిట యేమి సేసితినొ నిక్కపుదప్పులు నేరములు । గక్కన నిన్నిట కలిగిననీవే దిక్కుగాక మరి దిక్కేది ॥ ఘోరపుబాపము కోట్లసంఖ్యలు చేరువ నివె నాచేసినివి । నీరసునకు నిటు నీకృప నాకిక కూరిమి నా యెడ గుణమేది ॥ యెఱిగి చేసినది యెఱుగక చేసిన- కొఱతలు నాయెడ గోటులివే । వెఱపు దీర్చి శ్రీవేంకటేశ కావు మఱవక నాగతి మఱి యేది ॥
Offered for worship and study, not as prediction. Non-commercial.
More devotional texts
Browse Related Categories: