Sri Venkateswara Swamy · Traditional devotional text · Source: vignanam.org (Traditional devotional text (public-domain shlokas))
రాగం: పూజలివివో ఆ: స రి2 గ2 మ1 ప ద2 ని2 స అవ: స ని2 ద2 ప మ1 గ2 రి2 స తాళం: ఆది పల్లవి నిత్య పూజలివిగో నెరిచిన నోహో । ప్రత్యక్షమైనట్టి పరమాత్మునికి నిత్య పూజలివిగో ॥ చరణం 1 తనువే గుడియట తలయె శిఖరమట పెను హృదయమే హరి పీఠమట । కనుగొన చూపులే ఘన దీపములట తన లోపలి అంతర్యామికిని ॥ చరణం 2 పలుకే మంత్రమట పాదయిన నాలుకే కలకల మను పిడి ఘంటయట । నలువైన రుచులే నైవేద్యములట తలపులోపలనున్న దైవమునకు ॥ చరణం 3 గమన చేష్టలే అంగరంగ గతియట తమి గల జీవుడే దాసుడట । అమరిన ఊర్పులే ఆలబట్టములట క్రమముతో శ్రీ వెంకటరాయునికి ॥
Offered for worship and study, not as prediction. Non-commercial.
More devotional texts
Browse Related Categories: