Sri Rama · Traditional devotional text · Source: vignanam.org (Traditional devotional text (public-domain shlokas))
శ్రీ రఘురామ చారుతుల-సీతాదళధామ శమక్షమాది శృం గార గుణాభిరామ త్రిజ-గన్నుత శౌర్య రమాలలామ దు ర్వార కబంధరాక్షస వి-రామ జగజ్జన కల్మషార్నవో త్తారకనామ! భద్రగిరి-దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 1 ॥
రామవిశాల విక్రమ పరాజిత భార్గవరామ సద్గుణ స్తోమ పరాంగనావిముఖ సువ్రత కామ వినీల నీరద శ్యామ కకుత్ధ్సవంశ కలశాంభుధిసోమ సురారిదోర్భలో ద్ధామ విరామ భద్రగిరి - దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 2 ॥
అగణిత సత్యభాష, శరణాగతపోష, దయాలసజ్ఘరీ విగత సమస్తదోష, పృథివీసురతోష, త్రిలోక పూతకృ ద్గగ నధునీమరంద పదకంజ విశేష మణిప్రభా ధగ ద్ధగిత విభూష భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 3 ॥
రంగదరాతిభంగ, ఖగ రాజతురంగ, విపత్పరంపరో త్తుంగ తమఃపతంగ, పరి తోషితరంగ, దయాంతరంగ స త్సంగ ధరాత్మజా హృదయ సారసభృంగ నిశాచరాబ్జమా తంగ, శుభాంగ, భద్రగిరి దాశరథీ కరుణాపయోనిథీ. ॥ 4 ॥
శ్రీద సనందనాది మునిసేవిత పాద దిగంతకీర్తిసం పాద సమస్తభూత పరిపాల వినోద విషాద వల్లి కా చ్ఛేద ధరాధినాథకుల సింధుసుధామయపాద నృత్తగీ తాది వినోద భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 5 ॥
ఆర్యుల కెల్ల మ్రొక్కివిన తాంగుడనై రఘునాధ భట్టరా రార్యుల కంజలెత్తి కవి సత్తములన్ వినుతించి కార్య సౌ కర్య మెలర్పనొక్క శతకంబొన గూర్చి రచింతునేడుతా త్పర్యమునన్ గ్రహింపుమిది దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 6 ॥
మసకొని రేంగుబండ్లుకును మౌక్తికముల్ వెలవోసినట్లుదు ర్వ్యసనముజెంది కావ్యము దురాత్ములకిచ్చితిమోస మయ్యె నా రసనకుँ బూతవృత్తిసుక రంబుగ జేకురునట్లు వాక్సుధా రసములుచిల్క బద్యుముఖ రంగమునందునటింప వయ్యసం తసము జెంది భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 7 ॥
Offered for worship and study, not as prediction. Non-commercial.
More devotional texts
శ్రీరమణీయహార యతసీ కుసుమాభశరీర, భక్త మం దార, వికారదూర, పరతత్త్వవిహార త్రిలోక చేతనో దార, దురంత పాతక వితాన విదూర, ఖరాది దైత్యకాం తార కుఠార భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 8 ॥
దురితలతాలవిత్ర, ఖర దూషణకాననవీతిహొత్ర, భూ భరణకళావిచిత్ర, భవ బంధవిమోచనసూత్ర, చారువి స్ఫురదరవిందనేత్ర, ఘన పుణ్యచరిత్ర, వినీలభూరికం ధరసమగాత్ర, భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 9 ॥
కనకవిశాలచేల భవకానన శాతకుఠారధార స జ్జనపరిపాలశీల దివిజస్తుత సద్గుణ కాండకాండ సం జనిత పరాక్రమక్రమ విశారద శారద కందకుంద చం దన ఘనసార సారయశ దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 10 ॥
శ్రీ రఘువంశ తోయధికి శీతమయూఖుడవైన నీ పవి త్రోరుపదాబ్జముల్ వికసితోత్పల చంపక వృత్తమాధురీ పూరితవాక్ప్రసూనముల బూజలొనర్చెద జిత్తగింపుమీ తారకనామ భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 11 ॥
గురుతరమైన కావ్యరస గుంభనకబ్బుర మందిముష్కరుల్ సరసులమాడ్కి సంతసిల జూలుదురోటుశశాంక చంద్రికాం కురముల కిందు కాంతమణి కోటిస్రవించిన భంగివింధ్యభూ ధరమున జాఱునే శిలలు దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 12 ॥
తరణికులేశ నానుడుల దప్పులు గల్గిన నీదునామ స ద్విరచితమైన కావ్యము పవిత్రముగాదె వియన్నదీజలం బరగుచువంకయైన మలినాకృతి బాఱిన దన్మహత్వముం దరమె గణింప నెవ్వరికి దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 13 ॥
దారుణపాత కాబ్ధికి సదా బడబాగ్ని భవాకులార్తివి స్తారదవానలార్చికి సుధారసవృష్టి దురంత దుర్మతా చారభయంక రాటవికి జండకఠోరకుఠారధార నీ తారకనామ మెన్నుకొన దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 14 ॥
హరునకు నవ్విభీషణునక ద్రిజకుం దిరుమంత్ర రాజమై కరికి సహల్యకుం ద్రుపదకన్యకు నార్తిహరించుచుట్టమై పరగినయట్టి నీపతిత పావననామము జిహ్వపై నిరం తరము నటింపజేయుమిక దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 15 ॥
ముప్పున గాలకింకరులు ముంగిటవచ్చిన వేళ, రోగముల్ గొప్పరమైనచో గఫము కుత్తుక నిండినవేళ, బాంధవుల్ గప్పినవేళ, మీస్మరణ గల్గునొ గల్గదొ నాటి కిప్పుడే తప్పకచేతు మీభజన దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 16 ॥
పరమదయానిధే పతితపావననామ హరే యటంచు సు స్ధిరమతులై సదాభజన సేయు మహాత్ముల పాదధూళి నా శిరమునదాల్తుమీరటకు జేరకుడంచు యముండు కింకరో త్కరముల కాన బెట్టునట దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 17 ॥
అజునకు తండ్రివయ్యు సనకాదులకుం బరతత్త్వమయ్యుస ద్ద్విజమునికోటికెల్లబర దేతవయ్యు దినేశవంశ భూ భుజులకు మేటివయ్యుబరి పూర్ణుడవై వెలిగొందుపక్షిరా డ్ధ్వజమిము బ్రస్తుతించెదను దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 18 ॥
పండిత రక్షకుం డఖిల పాపవిమొచను డబ్జసంభవా ఖండల పూజితుండు దశకంఠ విలుంఠన చండకాండకో దండకళా ప్రవీణుడవు తావక కీర్తి వధూటి కిత్తుపూ దండలు గాగ నా కవిత దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 19 ॥
శ్రీరమ సీతగాగ నిజసేవక బృందము వీరవైష్ణవా చార జవంబుగాగ విరజానది గౌతమిగా వికుంఠ ము న్నారయభద్ర శైలశిఖరాగ్రముగాగ వసించు చేతనో ద్ధారకుడైన విష్ణుడవు దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 20 ॥
కంటి నదీతటంబుబొడగంటిని భద్రనగాధివాసమున్ గంటి నిలాతనూజనురు కార్ముక మార్గణశంఖచక్రముల్ గంటిని మిమ్ము లక్ష్మణుని గంటి కృతార్ధుడ నైతి నో జగ త్కంటక దైత్యనిర్ధళన దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 21 ॥
హలికునకున్ హలాగ్రమున నర్ధము సేకురుభంగి దప్పిచే నలమట జెందువానికి సురాపగలో జల మబ్బినట్లు దు ర్మలిన మనోవికారియగు మర్త్యుని నన్నొడగూర్చి నీపయిన్ దలవు ఘటింపజేసితివె దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 22 ॥
కొంజకతర్క వాదమను గుద్దలిచే బరతత్త్వభూస్ధలిన్ రంజిలద్రవ్వి కంగొనని రామనిధానము నేడు భక్తిసి ద్ధాంజనమందుహస్తగత మయ్యెబళీ యనగా మదీయహృ త్కంజమునన్ వసింపుమిక దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 23 ॥
రాముँడు ఘోర పాతక విరాముడు సద్గుణకల్పవల్లికా రాముడు షడ్వికారజయ రాముడు సాధుజనావనవ్రతో ద్దాముँడు రాముడే పరమ దైవము మాకని మీ యడుంగు గెం దామరలే భుజించెదను దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 24 ॥
చక్కెరమానివేముదిన జాలినకైవడి మానవాధముల్ పెక్కురు ఒక్క దైవముల వేమఱుగొల్చెదరట్ల కాదయా మ్రొక్కిననీకు మ్రొక్కవలె మోక్ష మొసంగిన నీవయీవలెం దక్కినమాట లేమిటికి దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 25 ॥
'రా' కలుషంబులెల్ల బయలంబడద్రోచిన 'మా'క వాటమై డీకొనిప్రోవుచునిక్క మనిధీయుతులెన్నँదదీయ వర్ణముల్ గైకొని భక్తి చే నుడువँగానరు గాక విపత్పరంపరల్ దాకొనునే జగజ్జనుల దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 26 ॥
రామహరే కకుత్ధ్సకుల రామహరే రఘురామరామశ్రీ రామహరేయటంచు మది రంజిల భేకగళంబులీల నీ నామము సంస్మరించిన జనంబు భవంబెడబాసి తత్పరం ధామ నివాసులౌదురట దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 27 ॥
చక్కెర లప్పకున్ మిగుల జవ్వని కెంజిగురాకు మోవికిం జొక్కపుజుంటి తేనియకు జొక్కులుచుంగన లేరు గాక నే డక్కట రామనామమధు రామృతమానుటకంటె సౌఖ్యామా తక్కినమాధురీ మహిమ దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 28 ॥
అండజవాహ నిన్ను హృదయంబుననమ్మిన వారి పాపముల్ కొండలవంటివైన వెసగూలి నశింపక యున్నె సంత తా ఖండలవైభవోన్నతులు గల్గకమానునె మోక్ష లక్ష్మికై దండయొసంగకున్నె తుద దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 29 ॥
చిక్కనిపాలపై మిసిమి జెందిన మీగడ పంచదారతో మెక్కినభంగి మీవిమల మేచకరూప సుధారసంబు నా మక్కువ పళ్లేరంబున సమాహిత దాస్యము నేటిదో యిటన్ దక్కెనటంచు జుర్రెదను దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 30 ॥
సిరులిడసీత పీడలెగ జిమ్ముటకున్ హనుమంతుడార్తిసో దరుడు సుమిత్రసూతి దురితంబులుమానుప రామ నామముం గరుణదలిర్ప మానవులగావగ బన్నిన వజ్రపంజరో త్కరముగదా భవన్మహిమ దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 31 ॥
హలికులిశాంకుశధ్వజ శరాసన శంఖరథాంగ కల్పకో జ్వలజలజాత రేఖలను సాంశములై కనుపట్టుచున్న మీ కలితపదాంబుజ ద్వయము గౌతమపత్ని కొసంగినట్లు నా తలపున జేర్చికావగదె దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 32 ॥
జలనిధిలోనదూఱి కుల శైలముమీటి ధరిత్రిగొమ్మునం దలవడమాటిరక్కసుని యంగముగీటిబలీంద్రునిన్ రసా తలమునమాటి పార్ధివక దంబముగూఱ్చిన మేటిరామ నా తలపుననాటి రాగదవె దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 33 ॥
భండన భీముడా ర్తజన బాంధవుడుజ్జ్వల బాణతూణకో దండకళాప్రచండ భుజ తాండవకీర్తికి రామమూర్తికిన్ రెండవ సాటిదైవమిక లేడనుచున్ గడగట్టి భేరికా డాండ డడాండ డాండ నినదంబు లజాండమునిండ మత్తవే దండము నెక్కి చాటెదను దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 34 ॥
అవనిజ కన్నుదోయి తొగలందు వెలింగెడు సోమ, జానకీ కువలయనేత్ర గబ్బిచనుకొండల నుండు ఘనంబ మైధిలీ నవనవ యౌవనంబను వనంబుకున్ మదదంతి వీవెకా దవిలి భజింతు నెల్లపుడు దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 35 ॥
ఖరకరవంశజా విను ముఖండిత భూతపిశాచఢాకినీ జ్వర పరితాపసర్పభయ వారకమైన భవత్పదాబ్జ ని స్పుర దురువజ్రపంజరముజొచ్చితి, నీయెడ దీన మానవో ధ్ధర బిరుదంక మేమఱుకు దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 36 ॥
జుర్రెదమీక థామృతము జుర్రెదమీపదకంజతో యమున్ జుర్రెద రామనామమున జొబ్బిలుచున్న సుధారసంబ నే జుర్రెద జుర్రుజుర్రుँగ రుచుల్ గనువారిపదంబు గూర్పవే తుర్రులతోడి పొత్తిడక దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 37 ॥
ఘోరకృతాంత వీరభట కోటికి గుండెదిగుల్ దరిద్రతా కారపిశాచ సంహరణ కార్యవినోది వికుంఠ మందిర ద్వార కవాట భేది నిజదాస జనావళికెల్ల ప్రొద్దు నీ తారకనామ మెన్నుకొన దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 38 ॥
విన్నపమాలకించు రఘువీర నహిప్రతిలోకమందు నా కన్నదురాత్ముడుం బరమ కారుణికోత్తమ వేల్పులందు నీ కన్న మహాత్ముడుం బతిత కల్మషదూరుడు లేడునాకువి ద్వన్నుత నీవెనాకు గతి దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 39 ॥
పెంపునँదల్లివై కలుష బృందసమాగమ మొందుకుండు ర క్షింపనుదండ్రివై మెయు వసించుదు శేంద్రియ రోగముల్ నివా రింపను వెజ్జవై కృప గుఱించి పరంబు దిరబుగాँగ స త్సంపదలీయ నీవెగతి దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 40 ॥
కుక్షినజాండపం క్తులొన గూర్చి చరాచరజంతుకోటి సం రక్షణసేయు తండ్రివి పరంపర నీ తనయుండనైన నా పక్షము నీవుగావలదె పాపము లెన్ని యొనర్చినన్ జగ ద్రక్షక కర్తవీవెకద దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 41 ॥
గద్దరియో గిహృత్కమల గంధర సానుభవంబుँజెందు పె న్నిద్దవు గండుँ దేँటి థరణీసుత కౌँగిలిపంజరంబునన్ ముద్దులుగుల్కు రాచిలుక ముక్తినిధానమురామరాँగదే తద్దయు నేँడు నాకడకు దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 42 ॥
కలియుగ మర్త్యకోటినిను గంగొన రానివిధంబో భక్తవ త్సలతవహింపవో చటుల సాంద్రవిపద్దశ వార్ధి గ్రుంకుచో బిలిచిన బల్క వింతమఱపీ నరులిట్లనరాదు గాక నీ తలపున లేదె సీత చెఱ దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 43 ॥
జనవర మీక థాలి వినసైँపక కర్ణములందు ఘంటికా నినద వినోదముల్ సులుపునీచునకున్ వరమిచ్చినావు ని న్ననయమునమ్మి కొల్చిన మహాత్మునకేమి యొసంగు దోసనం దననుత మాకొసంగుమయ దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 44 ॥
పాపము లొందువేళ రణపన్నగ భూత భయజ్వారాదులన్ దాపద నొందువేళ భరతాగ్రజ మిమ్ము భజించువారికిన్ బ్రాపుగ నీవుదమ్ము డిరుపక్కియలన్ జని తద్విత్తి సం తాపము మాంపి కాతురట దాశరథీ కరుణాపయోనిధి. ॥ 45 ॥
అగణిత జన్మకర్మదురి తాంబుధిలో బహుదుఃఖవీచికల్ దెగిపడవీడలేక జగతీధర నీపదభక్తి నావచే దగిలి తరింపగోరితి బదంపబడి నదు భయంభు మాంపవే తగదని చిత్తమం దిడక దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 46 ॥
నేనొనరించు పాపముల నేకములైనను నాదుజిహ్వకుం బానకమయ్యెమీపరమ పావననామముదొంటి చిల్కరా మాననుగావుమన్న తుది మాటకు సద్గతి జెందెగావునన్ దాని ధరింపగోరెదను దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 47 ॥
పరధనముల్ హరించి పరభామలనంటి పరాన్న మబ్బినన్ మురిపమ కానిమీँదనగు మోసమెఱుంగదు మానసంబు స్తరమదికాలకింకర గదాహతి పాల్పడనీక మమ్ము నేదు తఱిదరిజేర్చి కాచెదవొ దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 48 ॥
చేసితి ఘోరకృత్యములు చేసితి భాగవతాపచారముల్ చేసితి నన్యదైవములँ జేరి భజించిన వారిపొందు నేँ జేసిన నేరముల్ దలँచి చిక్కులँబెట్టకుమయ్యయయ్య నీ దాసుँడనయ్య భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 49 ॥
పరుల ధనంబుँజూచిపర భామలజూచి హరింపగోరు మ ద్గురుతరమానసం బనెడు దొంగనుబట్టినిరూఢదాస్య వి స్ఫురితవివేక పాశములँ జుట్టి భవచ్చరణంబనే మరు త్తరువునగట్టివేయగ దె దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 50 ॥
సలలిత రామనామ జపసార మెఱుంగను గాశికాపురీ నిలయుడగానుమీచరణ నీరజరేణు మహాప్రభావముం దెలియనహల్యగాను జగతీవర నీదగు సత్యవాక్యముం దలపగ రావణాసురుని తమ్ముడగాను భవద్విలాసముల్ దలచినుతింప నాతరమె దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 51 ॥
పాతకులైన మీకృపకు బాత్రులు కారెతలంచిచూడ జ ట్రాతికిగల్గె బావన మరాతికి రాజ్యసుఖంబుగల్గె దు ర్జాతికి బుణ్యమబ్బెగపి జాతిమహత్త్వమునొందెగావునం దాతవ యెట్టివారలకు దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 52 ॥
మామక పాతక వజ్రము మ్రాంపనగణ్యము చిత్రగుప్తులే యేమని వ్రాతురో? శమనుడేమి విధించునొ? కాలకింకర స్తోమ మొనర్చిటేమొ? వినజొప్పడ దింతకమున్నెదీనచిం తామణి యొట్లు గాచెదవొ దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 53 ॥
దాసిన చుట్టూమా శబరి? దాని దయామతి నేలినావు; నీ దాసుని దాసుడా? గుహుడు తావకదాస్య మొసంగినావు నే జేసిన పాపమో! వినుతి చేసినగావవు గావుమయ్య! నీ దాసులలోన నేనొకँడ దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 54 ॥
దీక్షవహించి నాకొలది దీనుల నెందఱి గాచితో జగ ద్రక్షక తొల్లియా ద్రుపద రాజతనూజ తలంచినంతనే యక్షయమైన వల్వలిడి తక్కట నామొఱజిత్తగించి ప్రత్యక్షము గావవేమిటికి దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 55 ॥
నీలఘనాభమూర్తివగు నిన్ను గనుంగొనికోరి వేడినన్ జాలముసేసి డాగెదవు సంస్తుతి కెక్కిన రామనామ మే మూలను దాచుకోగలవు ముక్తికి బ్రాపది పాపమూలకు ద్దాలముగాదె మాయెడల దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 56 ॥
వలదు పరాకు భక్తజనవత్సల నీ చరితంబు వమ్ముగా వలదు పరాకు నీబిరుదు వజ్రమువంటిది గాన కూరకే వలదు పరాకు నాదురిత వార్ధికి దెప్పవుగా మనంబులో దలతుమెకా నిరంతరము దాశరథీ కరునాపయోనిధీ. ॥ 57 ॥
తప్పులెఱుంగ లేక దురితంబులు సేసితినంటి నీవుమా యప్పవుగావు మంటి నికనన్యులకున్ నుదురంటనంటినీ కొప్పిదమైన దాసజను లొప్పిన బంటుకు బటవంటి నా తప్పుల కెల్ల నీవెగతి దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 58 ॥
ఇతడు దురాత్ముడంచుజను లెన్నँగ నాఱడిँగొంటినేనెపో పతితుँడ నంటినో పతిత పావనమూర్తివి నీవుగల్ల నే నితిరుల వేँడనంటి నిహ మిచ్చిననిమ్ముపరంబొసంగుమీ యతులిత రామనామ మధు రాక్షర పాళినిరంతరం బహృ ద్గతమని నమ్మికొల్చెదను దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 59 ॥
అంచితమైననీదు కరుణామృతసారము నాదుపైని బ్రో క్షించిన జాలుదాననిర సించెదనాదురితంబు లెల్లదూ లించెద వైరివర్గ మెడలించెద గోర్కులనీదుబంటనై దంచెద, గాలకింకరుల దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 60 ॥
జలనిధు లేడునొక్క మొగిँ జక్కికిదెచ్చెశరంబు, ఱాతినిం పలరँగ జేసెనాతిగँబ దాబ్జపరాగము, నీ చరిత్రముం జలజభవాది నిర్జరులు సన్నుతి సేయँగ లేరు గావునం దలపనగణ్యమయ్య యిది దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 61 ॥
కోతికిశక్యమా యసురకోటుల గెల్వను గాల్చెబో నిజం బాతనిమేన శీతకరుడౌట దవానలు డెట్టివింత? మా సీతపతివ్రతా మహిమసేవకు భాగ్యముమీకటాక్షము ధాతకు శక్యమా పొగడ దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 62 ॥
భూపలలామ రామరఘుపుంగవరామ త్రిలోక రాజ్య సం స్ధాపనరామ మోక్షఫల దాయక రామ మదీయ పాపముల్ పాపగదయ్యరామ నిను బ్రస్తుతి చేసెదనయ్యరామ సీ తాపతిరామ భద్రగిరి దాసరథీ కరుణాపయోనిధీ. ॥ 63 ॥
నీసహజంబు సాత్వికము నీవిడిపట్టు సుధాపయోధి, ప ద్మాసనుడాత్మజుండు, గమలాలయనీ ప్రియురాలు నీకు సిం హాసనమిద్ధరిత్రి; గొడుగాక సమక్షులు చంద్రబాస్కరుల్ నీసుమతల్పమాదిఫణి నీవె సమస్తము గొల్చినట్టి నీ దాసుల భాగ్యమెట్టిదయ దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 64 ॥
చరణము సోకినట్టి శిలజవ్వనిరూపగు టొక్కవింత, సు స్ధిరముగ నీటిపై గిరులు దేలిన దొక్కటి వింతగాని మీ స్మరణ దనర్చుమానవులు సద్గతి జెందిన దెంతవింత? యీ ధరను ధరాత్మజారమణ దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 65 ॥
దైవము తల్లిదండ్రితగు దాత గురుండు సఖుండు నిన్నె కా భావన సేయుచున్నతఱి పాపములెల్ల మనోవికార దు ర్భావితుజేయుచున్నవికృపామతివైనను కావుమీ జగ త్పావనమూర్తి భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 66 ॥
వాసవ రాజ్యభోగ సుఖ వార్ధిని దేలు ప్రభుత్వమబ్బినా యాసకుమేర లేదు కనకాద్రిసమాన ధనంబుగూర్చినం గాసును వెంటరాదు కని కానక చేసిన పుణ్యపాపముల్ వీసరబోవ నీవు పదివేలకు జాలు భవంబునొల్ల నీ దాసునిగాగ నేలుకొను దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 67 ॥
సూరిజనుల్ దయాపరులు సూనృతవాదు లలుబ్ధమానవుల్ వేరపతిప్రతాంగనలు విప్రులు గోవులు వేదముల్ మహా భారముదాల్పగా జనులు పావనమైన పరోపకార స త్కార మెఱుంగులే రకట దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 68 ॥
వారిచరావతారము వారిధిలో జొఱబాఱి క్రోధ వి స్తారగుడైన యా నిగమతస్కరవీర నిశాచరేంద్రునిం జేరి వధించి వేదముల చిక్కెడలించి విరించికి మహో దారతనిచ్చితీవెగద దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 69 ॥
కరమనుర క్తిమందరము గవ్వముగా నహిరాజుద్రాడుగా దొరకొన దేవదానవులు దుగ్ధపయోధిమథించుచున్నచో ధరణిచలింపలోకములు తల్లడమందగ గూర్మమై ధరా ధరము ధరించితీవెకద దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 70 ॥
ధారుణి జాపజుట్టిన విధంబునగైకొని హేమనేత్రుడ వ్వారిధిలోనదాగినను వానివధించి వరాహమూర్తివై ధారుణిదొంటికై వడిని దక్షిణశృంగమున ధరించి వి స్తార మొనర్చితీవే కద దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 71 ॥
పెటపెటనుక్కు కంబమున భీకరదంత నఖాంతర ప్రభా పటలము గప్ప నుప్పతిలి భండనవీధి నృసింహభీకర స్ఫుటపటుశక్తి హేమకశిపు విదళించి సురారిపట్టి నం తటగృపజూచితీవెకద దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 72 ॥
పదయుగళంబు భూగగన భాగముల వెసనూని విక్రమా స్పదమగునబ్బలీంద్రునొక పాదమునందల క్రిందనొత్తిమే లొదవజగత్త్రయంబు బురు హూతునికియ్యవటుండవైనచి త్సదమలమూర్తి వీవెకద దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 73 ॥
ఇరువదియొక్కమాఱు ధరణీశుల నెల్లవధించి తత్కళే బర రుధిర ప్రవాహమున బైతృకతర్పణ మొప్పజేసి భూ సురవరకోటికి ముదము సొప్పడ భార్గవరామమూర్తివై ధరణినొసంగితీ వెకద దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 74 ॥
దురమున దాటకందునిమి ధూర్జటివిల్ దునుమాడిసీతనుం బరిణయమంది తండ్రిపనుప ఘన కాననభూమి కేగి దు స్తరపటుచండ కాండకులిశాహతి రావణకుంభకర్ణ భూ ధరముల గూల్చితీ వెకద దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 75 ॥
అనుపమయాదవాన్వయసు ధాబ్ధిసుధానిధి కృష్ణమూర్తినీ కనుజుడుగాజనించి కుజనావళినెల్ల నడంచి రోహిణీ తనయుడనంగ బాహుబల దర్పమున బలరామ మూర్తివై తనరిన వేల్పవీవెకద దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 76 ॥
సురలునుతింపగా ద్రిపుర సుందరుల వరియింపబుద్ధరూ పరయగ దాల్చితీవు త్రిపురాసురకోటి దహించునప్పుడా హరునకుదోడుగా వరశ రాసన బాణముఖో గ్రసాధనో త్కర మొనరించితీవుకద దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 77 ॥
సంకరదుర్గమై దురిత సంకులమైన జగంబుజూచి స ర్వంకషలీల ను త్తమ తురంగమునెక్కి కరాసిబూని వీ రాంకవిలాస మొప్ప గలి కాకృత సజ్జనకోటికి నిరా తంక మొనర్చితీవుకద దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 78 ॥
మనముననూహపోషణలు మర్వకమున్నె కఫాదిరోగముల్ దనువుననంటి మేనిబిగి దప్పకమున్నెనరుండు మోక్ష సా ధన మొనరింపँగావలయుँ దత్త్వవిచారము మానియుండుట ల్తనువునకు విరోధమిది దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 79 ॥
ముదమున కాటపట్టుభవ మోహమద్వ దిరదాంకుశంబు సం పదల కొటారు కోరికల పంట పరంబున కాది వైరుల న్నదన జయించుత్రోవ విపదబ్ధికినావగదా సదాభవ త్సదమలనామసంస్మరణ దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 80 ॥
దురిత లతానుసార భయ దుఃఖ కదంబము రామనామభీ కరతల హేతిచేँ దెగి వకావకలై చనకుండ నేర్చునే దరికొని మండుచుండు శిఖ దార్కొనిన శలబాదికీటకో త్కరము విలీనమైచనవె దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 81 ॥
హరిపదభక్తినింద్రియజ యాన్వితుడుత్తముँడింద్రిమంబులన్ మరుగక నిల్పనూదినను మధ్యముँడింద్రియపారశ్యుడై పరగినచో నికృష్టుడని పల్కగ దుర్మతినైన నన్ను నా దరమున నెట్లుకాచెదవొ దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 82 ॥
వనకరిచిక్కు మైనసకు పాచవికిం జెడిపోయె మీనుతా వినికికిँజిక్కెँజిల్వగను వేँదుఱుँ జెందెను లేళ్ళు తావిలో మనికినశించె దేటితర మాయిరుమూँటిని గెల్వనై దుసా ధనములనీ వె కావనగు దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 83 ॥
కరములుమీకుమ్రొక్కులిడ కన్నులు మిమ్మునె చూడ జిహ్వ మీ స్మరణదనర్పవీనులుభ వత్కథలన్ వినుచుండనాస మీ యఱుతును బెట్టుపూసరుల కాసగొనం బరమార్థ సాధనో త్కరమిది చేయవేకృపను దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 84 ॥
చిరతరభక్తి నొక్కతుళసీదళ మర్పణ చేయువాడు ఖే చరగరు డోరగ ప్రముఖ సంఘములో వెలుగన్ సధా భవత్ సురుచిర ధీంద పాదముల బూజలొనర్చిన వారికెల్లద త్పర మరచేతిధాత్రిగద దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 85 ॥
భానుడు తూర్పునందుగను పుట్టినँ బావక చంద్ర తేజముల్ హీనత జెందినట్లు జగదేక విరాజితమైన నీ పద ధ్యానము చేయుచున్నँ బర దైవమరీచులడంగకుండు నే దానవ గర్వ నిర్దళన దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 86 ॥
నీమహనీయతత్త్వ రస నిర్ణ యబోధ కథామృతాబ్ధిలో దామునుగ్రుంకులాడకవృ థాతనుకష్టముజెంది మానవుం డీ మహిలోకతీర్థముల నెల్ల మునింగిన దుర్వికార హృ తామసపంకముల్ విదునె దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 87 ॥
నీమహనీయతత్త్వ రస నిర్ణ యబోధ కథామృతాబ్ధిలో దామునుగ్రుంకులాడకవృ థాతనుకష్టముజెంది మానవుం డీ మహిలోకతీర్థముల నెల్ల మునింగిన దుర్వికార హృ తామసపంకముల్ విదునె దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 88 ॥
కాంచన వస్తుసంకలిత కల్మష మగ్ని పుటంబు బెట్టెవా రించినరీతి నాత్మనిగిడించిన దుష్కర దుర్మలత్రయం బంచిత భ క్తియోగ దహ నార్చిँదగుల్పక పాయునే కన త్కాంచనకుండలాభరణ దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 89 ॥
నీసతి పెక్కు గల్ములిడనేర్పిరి, లోక మకల్మషంబుగా నీసుత సేయు పావనము నిర్మిత కార్యధురీణ దక్షుడై నీసుతుడిచ్చు నాయువులు నిన్న భుజించినँ గల్గకుండునే దాసులకీప్సి తార్థముల దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 90 ॥
వారిజపత్రమందిడిన వారివిధంబున వర్తనీయమం దారయ రొంపిలోన దను వంటని కుమ్మరపుర్వురీతి సం సారమున మెలంగుచు విచారడైపరమొందుగాదెస త్కార మెఱింగి మానవుడు దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 91 ॥
ఎక్కడి తల్లిదండ్రి సుతులెక్కడి వారు కళత్ర బాంధవం బెక్కడ జీవుँడెట్టి తను వెత్తిన బుట్టును బోవుచున్న వా డొక్కడెపాప పుణయ ఫల మొందిన నొక్కడె కానరాడువే ఱొక్కడు వెంటనంటిభవ మొల్లనయాకృప జూడువయ్యనీ టక్కరి మాయలందిడక దాశరథీ కరుణా పయోనిధీ. ॥ 92 ॥
దొరసినకాయముల్ముదిమి తోచినँజూచిప్రభుత్వముల్సిరు ల్మెఱపులుగాగజూచిమఱి మేదినిలోँదమతోడివారుముం దరుగుటజూచిచూచి తెగు నాయువెఱుంగక మోహపాశము ళరుగనివారికేమిగతి దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 93 ॥
సిరిగలనాँడు మైమఱచి చిక్కిననాँడుదలంచి పుణ్యముల్ పొరిँబొరి సేయనైతినని పొక్కినँ గల్గు నెగాలిచిచ్చుపైँ గెరలిన వేళँదప్పికొని కీడ్పడు వేళ జలంబు గోరి త త్తరమునँ ద్రవ్వినం గలదె దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 94 ॥
జీవనమింకँ బంకమున జిక్కిన మీను చలింపకెంతయు దావుననిల్చి జీవనమె దద్దయుँ గోరువిధంబు చొప్పడం దావలమైనँగాని గుఱి తప్పనివాँడు తరించువాँడయా తావకభక్తియో గమున దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 95 ॥
సరసునిమానసంబు సర సజ్ఞుడెరుంగును ముష్కరాధముం డెఱిँగిగ్రహించువాడె కొల నేకనిసముँ గాగదుర్దురం బరయँగ నేర్చునెట్లు విక చాబ్దమరంద రసైక సౌరభో త్కరముమిళింద మొందుక్రియ దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 96 ॥
నోँచినతల్లిదండ్రికిँ దనూభవుँడొక్కడెచాలు మేటిచే చాँచనివాడు వేఱొకँడు చాచిన లేదన కిచ్చువాँడునో రాँచినిజంబకాని పలు కాడనివాँడు రణంబులోన మేన్ దాచనివాँడు భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 97 ॥
శ్రీయుతజానకీరమణ చిన్నయరూప రమేశరామ నా రాయణ పాహిపాహియని బ్రస్తుతిँ జేసితి నామనంబునం బాయక కిల్బిషవ్రజ వి పాటనమందँగ జేసి సత్కళా దాయి ఫలంబునాకియవె దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 98 ॥
ఎంతటిపుణ్యమో శబరి యెంగిలిగొంటివి వింతగాదె నీ మంతన మెట్టిదో యుడుత మైనిక రాగ్ర నఖాంకురంబులన్ సంతసమందँ జేసితివి సత్కులజన్మము లేమి లెక్క వే దాంతముగాదె నీ మహిమ దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 99 ॥
బొంకనివాँడెయోగ్యుడరి బృందము లెత్తిన చోటజివ్వకుం జంకనివాँడెజోదు రభసంబున నర్థి కరంబుసాँచినం గొంకనివాँడెదాత మిముँ గొల్చిభజించిన వాँడె పోనిరా తంక మనస్కుँ డెన్న గను దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 100 ॥
భ్రమరముగీటకంబుँ గొని పాల్పడి ఝాంకరణో కారియై భ్రమరముగానొనర్చునని పల్కుటँ జేసి భవాది దుఃఖసం తమసమెడల్చి భక్తిసహి తంబుగ జీవుని విశ్వరూప త త్త్వమునధరించు టేమరుదు దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 101 ॥
తరువులు పూచికాయలగు దక్కుసుమంబులు పూజగాభవ చ్చరణము సోకిదాసులకు సారములో ధనధాన్యరాశులై కరిభట ఘోటకాంబర నకాయములై విరజా సము త్తరణ మొనర్చుజిత్రమిది దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 102 ॥
పట్టితిభట్టరార్యగురు పాదములిమ్మెయినూర్ధ్వ పుండ్రముల్ వెట్టితిమంత్రరాజ మొడి బెట్టితి నయ్యమకింక రాలికిం గట్టితిబొమ్మమీచరణ కంజలందుँ దలంపుపెట్టి బో దట్టితిँ బాపపుంజముల దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 103 ॥
అల్లన లింగమంత్రి సుతుడత్రిజ గోత్రజుడాదిశాఖ కం చెర్ల కులోద్బవుం దంబ్రసిద్ధిడనై భవదంకితంబుగా నెల్లకవుల్ నుతింప రచియించితి గోపకవీంద్రుడన్ జగ ద్వల్లభ నీకు దాసుడను దాశరథీ కరుణాపయోనిధీ. ॥ 104 ॥
Browse Related Categories: