Telugu Songs · Traditional devotional text · Source: vignanam.org (Traditional devotional text (public-domain shlokas))
జాతికి ఊపిరి స్వాతంత్ర్యం, అది జ్యోతిగ వెలిగే చైతన్యం ఆ చైతన్యం నిలిచిన నాడే సమస్త జగతికి సౌభాగ్యమ్ ॥
శిఖరంలా , ప్రతి మనిషీ, శిరసెత్తిన నాడే, జలనిధిలా ప్రతి హృదయం అలలెత్తిన నాడే, మానవ జీవన గమనంలో మాయని వెలుగుల మహోదయమ్ ॥
ఎప్పటి ఎప్పటి రుచిరస్వప్నం, ఈ స్వాతంత్ర్యం ఎందరి ఎందరి త్యాగ ఫలం, ఈ స్వాతంత్ర్యం అందక అందక అందిన ఫలమును అందరికీ అందివ్వండి ॥
స్వరాజ్య సిద్ధికి లక్ష్యమేమిటో స్మరించుకోండి జాతి విధాత వినూత్న ఫలాలను సాధించండి సమస్యలన్నీ పరిష్కరించే సౌమ్య మార్గం చూపండి ॥
కలతలు కక్షలు రేపొద్దు ఏ కులం పేరుతో మారణ హోమం జరపొద్దు ఏ మతం ముసుగులో సమైక్య భారత సౌధాగ్రం పై, శాంతి దీపం నిలపండి ॥
Browse Related Categories:
Offered for worship and study, not as prediction. Non-commercial.