Telugu Songs · Traditional devotional text · Source: vignanam.org (Traditional devotional text (public-domain shlokas))
మన స్వతంత్ర్య భారత కేతనమునెత్తి నడువరా కటి బిగించి రిపుధాటిని కాల రాచి నిలువరా ॥
ఆర్ధిక సమతా ఘంటిక అల్లదిగో మ్రోగెనురా అందరమొక కుటుంబమై ఆనందము కనవలెరా ॥
మతసమైక్యతా నినాదమే మనకు బలమురా గతచరిత్ర తలచి జగద్~హితము నేడు కనుమురా ॥
ఉదయోజ్వల భాస్కర కిరణోదంచితమురా నభం భువన మానవాభ్యుదయ విజయమదే మనకు శుభమ్ ॥
Browse Related Categories:
Offered for worship and study, not as prediction. Non-commercial.