Sri Venkateswara Swamy · Traditional devotional text · Source: vignanam.org (Traditional devotional text (public-domain shlokas))
రాగం: మధ్యమావతి (22 ఖరహరప్రియ జన్య) ఆ: స రి2 మ1 ప ద1 ని2 స అవ: స ని2 ప మ1 రి2 స తాళం: ఆది పల్లవి అదివో అల్లదివో శ్రీ హరి వాసము పదివేల శేషుల పడగల మయము ॥ (2.5) చరణం 1 అదె వేంకటాచల మఖిలోన్నతము అదివో బ్రహ్మాదుల కపురూపము । (2) అదివో నిత్యనివాస మఖిల మునులకు అదె చూడు డదె మొక్కు డానందమయము ॥ (1.5) అదివో అల్లదివో శ్రీ హరి వాసము పదివేల శేషుల పడగల మయము ॥ (1.5) చరణం 2 చెంగట నల్లదివో శేషాచలమూ నింగి నున్న దేవతల నిజవాసము । (2) ముంగిట నల్లదివో మూలనున్న ధనము బంగారు శిఖరాల బహు బ్రహ్మమయము ॥(1.5) అదివో అల్లదివో శ్రీ హరి వాసము పదివేల శేషుల పడగల మయము ॥ (1.5) చరణం 3 కైవల్య పదము వేంకట నగ మదివో శ్రీ వేంకటపతికి సిరులైనది । (2) భావింప సకల సంపద రూపమదివో పావనముల కెల్ల పావన మయమూ ॥ (1.5) అదివో అల్లదివో శ్రీ హరి వాసము పదివేల శేషుల పడగల మయము ॥ (2.5)
Offered for worship and study, not as prediction. Non-commercial.
More devotional texts
Browse Related Categories: