Sri Venkateswara Swamy · Traditional devotional text · Source: vignanam.org (Traditional devotional text (public-domain shlokas))
రాగం: రాగ మాలికా / నీలాంబరి ఆ: స రి2 గ3 మ1 ప ద2 ప ని3 స అవ: స ని3 ప మ1 గ3 రి2 గ3 స తాళం: ఖండ చాపు పల్లవి అలర చంచలమైన ఆత్మలందుండ నీ యలవాటు చేసె నీ వుయ్యాల । పలుమారు నుచ్ఛ్వాస పవనమందుండ నీ భావంబు దెలిపె నీ వుయ్యాల ॥ (1.5) చరణం 1 ఉదాయాస్త శైలంబు లొనర కంభములైన వుడుమండలము మోచె నుయ్యాల । అదన ఆకాశపదము అడ్డౌదూలంబైన అఖిలంబు నిండె నీ వుయ్యాల ॥ (1.5) చరణం 2 పదిలముగ వేదములు బంగారు చేరులై పట్టి వెరపై తోచె వుయ్యాల । వదలకిటు ధర్మదేవత పీఠమై మిగుల వర్ణింప నరుదాయె వుయ్యాల ॥ (1.5) చరణం 3 మేలు కట్లయి మీకు మేఘమండలమెల్ల మెరుగునకు మెరుగాయె వుయ్యాల । నీల శైలమువంటి నీ మేనికాంతికి నిజమైన తొడవాయె వుయ్యాల ॥ (1.5) అలర చంచలమైన ఆత్మలందుండ నీ యలవాటు చేసె నీ వుయ్యాల । పలుమారు నుచ్ఛ్వాస పవనమందుండ నీ భావంబు దెలిపె నీ వుయ్యాల ॥ (ప.) (1.5) చరణం 4 పాలిండ్లు కదలగా పయ్యదలు రాపాడ భామినులు వడినూచు వుయ్యాల । వోలి బ్రహ్మాండములు వొరగువో యని భీతి నొయ్య నొయ్యనైరి వూచిరుయ్యాల ॥ చరణం 5 కమలకును భూపతికి కదలు కదలకు మిమ్ము కౌగలింపగజేసె నుయ్యాల । అమరాంగనలకు నీ హాస భావ విలాస మందంద చూపె నీ వుయ్యాల ॥ చరణం 6 కమలాసనాదులకు కన్నుల పండుగై గణుతింప నరుదాయె వుయ్యాల । కమనీయ మూర్తి వేంకటశైలపతి నీకు కడువేడుకై వుండె వుయ్యాల ॥
Browse Related Categories:
Offered for worship and study, not as prediction. Non-commercial.
More devotional texts