Dattatreya · Traditional devotional text · Source: vignanam.org (Traditional devotional text (public-domain shlokas))
పల్లవి సచ్చిదానంద సద్గురు దత్తం భజ భజ భక్త షోడశావతార రూప దత్తం భజరే భక్త
చరణం మహిషపురవాస శ్రీ కాలాగ్నిశమన దత్తం ప్రొద్దుటూరు గ్రామవాస యోగిరాజవల్లభం బెంగళూరు నగరస్థిత దత్తయోగిరాజం అనంతపురే స్థితం జ్ఞానసాగరం భజ దత్తమ్ ॥ 1 ॥
విజయవాడ విలసితం శ్యామకమలలోచనం మచిలీపట్టణ సంస్థితం అత్రివరదరాజం జయలక్ష్మీపురే సంస్కారహీన శివరూపం మద్రాసు నగర సంవాసం ఆదిగురు నామకం ॥ 2 ॥
ఋషీకేశ తీర్థరాజం శ్రీ దిగంబర దత్తం ఆకివీడుస్థం విశ్వాంబరావధూత దత్తం నూజివీడు పట్టణే దేవదేవ అవతారం భాగ్యనగర స్థితం దత్తావధూతం భజ ॥ 3 ॥
గండిగుంట జనపదే దత్తదిగంబర దేవం కొచ్చిన్ నగరే స్థితం సిద్ధరాజ నామకం మాయాముక్తావధూత మచ్చరపాకే లీలావిశ్వంభరం సూరన్నగరే భజ ॥ 4 ॥
సచ్చిదానంద జన్మస్థలే దత్తకాశీశ్వరం పూర్వసముద్ర తీరే దత్త రామేశ్వరం సచ్చిదానంద సద్గురు దత్తం భజ భజ భక్త షోడశావతార రూప దత్తం భజరే భక్త ॥ 5 ॥
Browse Related Categories:
Offered for worship and study, not as prediction. Non-commercial.
More devotional texts