Vishnu · Traditional devotional text · Source: vignanam.org (Traditional devotional text (public-domain shlokas))
సూర్యస్పర్ధికిరీటమూర్ధ్వతిలకప్రోద్భాసిఫాలాంతరం కారుణ్యాకులనేత్రమార్ద్రహసితోల్లాసం సునాసాపుటం। గండోద్యన్మకరాభకుండలయుగం కంఠోజ్వలత్కౌస్తుభం త్వద్రూపం వనమాల్యహారపటలశ్రీవత్సదీప్రం భజే॥1॥
కేయూరాంగదకంకణోత్తమమహారత్నాంగులీయాంకిత- శ్రీమద్బాహుచతుష్కసంగతగదాశంఖారిపంకేరుహామ్ । కాంచిత్ కాంచనకాంచిలాంచ్ఛితలసత్పీతాంబరాలంబినీ- మాలంబే విమలాంబుజద్యుతిపదాం మూర్తిం తవార్తిచ్ఛిదమ్ ॥2॥
Offered for worship and study, not as prediction. Non-commercial.
More devotional texts
యత్త్త్రైలోక్యమహీయసోఽపి మహితం సమ్మోహనం మోహనాత్ కాంతం కాంతినిధానతోఽపి మధురం మాధుర్యధుర్యాదపి । సౌందర్యోత్తరతోఽపి సుందరతరం త్వద్రూపమాశ్చర్యతోఽ- ప్యాశ్చర్యం భువనే న కస్య కుతుకం పుష్ణాతి విష్ణో విభో ॥3॥
తత్తాదృఙ్మధురాత్మకం తవ వపుః సంప్రాప్య సంపన్మయీ సా దేవీ పరమోత్సుకా చిరతరం నాస్తే స్వభక్తేష్వపి । తేనాస్యా బత కష్టమచ్యుత విభో త్వద్రూపమానోజ్ఞక - ప్రేమస్థైర్యమయాదచాపలబలాచ్చాపల్యవార్తోదభూత్ ॥4॥
లక్ష్మీస్తావకరామణీయకహృతైవేయం పరేష్వస్థిరే- త్యస్మిన్నన్యదపి ప్రమాణమధునా వక్ష్యామి లక్ష్మీపతే । యే త్వద్ధ్యానగుణానుకీర్తనరసాసక్తా హి భక్తా జనా- స్తేష్వేషా వసతి స్థిరైవ దయితప్రస్తావదత్తాదరా ॥5॥
ఏవంభూతమనోజ్ఞతానవసుధానిష్యందసందోహనం త్వద్రూపం పరచిద్రసాయనమయం చేతోహరం శృణ్వతామ్ । సద్యః ప్రేరయతే మతిం మదయతే రోమాంచయత్యంగకం వ్యాసించత్యపి శీతవాష్పవిసరైరానందమూర్ఛోద్భవైః ॥6॥
ఏవంభూతతయా హి భక్త్యభిహితో యోగస్స యోగద్వయాత్ కర్మజ్ఞానమయాత్ భృశోత్తమతరో యోగీశ్వరైర్గీయతే । సౌందర్యైకరసాత్మకే త్వయి ఖలు ప్రేమప్రకర్షాత్మికా భక్తిర్నిశ్రమమేవ విశ్వపురుషైర్లభ్యా రమావల్లభ ॥7॥
నిష్కామం నియతస్వధర్మచరణం యత్ కర్మయోగాభిధం తద్దూరేత్యఫలం యదౌపనిషదజ్ఞానోపలభ్యం పునః । తత్త్వవ్యక్తతయా సుదుర్గమతరం చిత్తస్య తస్మాద్విభో త్వత్ప్రేమాత్మకభక్తిరేవ సతతం స్వాదీయసీ శ్రేయసీ ॥8॥
అత్యాయాసకరాణి కర్మపటలాన్యాచర్య నిర్యన్మలా బోధే భక్తిపథేఽథవాఽప్యుచితతామాయాంతి కిం తావతా । క్లిష్ట్వా తర్కపథే పరం తవ వపుర్బ్రహ్మాఖ్యమన్యే పున- శ్చిత్తార్ద్రత్వమృతే విచింత్య బహుభిస్సిద్ధ్యంతి జన్మాంతరైః ॥9॥
త్వద్భక్తిస్తు కథారసామృతఝరీనిర్మజ్జనేన స్వయం సిద్ధ్యంతీ విమలప్రబోధపదవీమక్లేశతస్తన్వతీ । సద్యస్సిద్ధికరీ జయత్యయి విభో సైవాస్తు మే త్వత్పద- ప్రేమప్రౌఢిరసార్ద్రతా ద్రుతతరం వాతాలయాధీశ్వర ॥10॥
Browse Related Categories: