Vishnu · Traditional devotional text · Source: vignanam.org (Traditional devotional text (public-domain shlokas))
ప్రాతః సంత్రస్తభోజక్షితిపతివచసా ప్రస్తుతే మల్లతూర్యే సంఘే రాజ్ఞాం చ మంచానభియయుషి గతే నందగోపేఽపి హర్మ్యమ్ । కంసే సౌధాధిరూఢే త్వమపి సహబలః సానుగశ్చారువేషో రంగద్వారం గతోఽభూః కుపితకువలయాపీడనాగావలీఢమ్ ॥1॥
పాపిష్ఠాపేహి మార్గాద్ద్రుతమితి వచసా నిష్ఠురక్రుద్ధబుద్ధే- రంబష్ఠస్య ప్రణోదాదధికజవజుషా హస్తినా గృహ్యమాణః । కేలీముక్తోఽథ గోపీకుచకలశచిరస్పర్ధినం కుంభమస్య వ్యాహత్యాలీయథాస్త్వం చరణభువి పునర్నిర్గతో వల్గుహాసీ ॥2॥
హస్తప్రాప్యోఽప్యగమ్యో ఝటితి మునిజనస్యేవ ధావన్ గజేంద్రం క్రీడన్నాపాత్య భూమౌ పునరభిపతతస్తస్య దంతం సజీవమ్ । మూలాదున్మూల్య తన్మూలగమహితమహామౌక్తికాన్యాత్మమిత్రే ప్రాదాస్త్వం హారమేభిర్లలితవిరచితం రాధికాయై దిశేతి ॥3॥
గృహ్ణానం దంతమంసే యుతమథ హలినా రంగమంగావిశంతం త్వాం మంగల్యాంగభంగీరభసహృతమనోలోచనా వీక్ష్య లోకాః । హంహో ధన్యో హి నందో నహి నహి పశుపాలాంగనా నో యశోదా నో నో ధన్యేక్షణాః స్మస్త్రిజగతి వయమేవేతి సర్వే శశంసుః ॥4॥
పూర్ణం బ్రహ్మైవ సాక్షాన్నిరవధి పరమానందసాంద్రప్రకాశం గోపేశు త్వం వ్యలాసీర్న ఖలు బహుజనైస్తావదావేదితోఽభూః । దృష్ట్వాఽథ త్వాం తదేదంప్రథమముపగతే పుణ్యకాలే జనౌఘాః పూర్ణానందా విపాపాః సరసమభిజగుస్త్వత్కృతాని స్మృతాని ॥5॥
చాణూరో మల్లవీరస్తదను నృపగిరా ముష్టికో ముష్టిశాలీ త్వాం రామం చాభిపేదే ఝటఝటితి మిథో ముష్టిపాతాతిరూక్షమ్ । ఉత్పాతాపాతనాకర్షణవివిధరణాన్యాసతాం తత్ర చిత్రం మృత్యోః ప్రాగేవ మల్లప్రభురగమదయం భూరిశో బంధమోక్షాన్ ॥6॥
హా ధిక్ కష్టం కుమారౌ సులలితవపుషౌ మల్లవీరౌ కఠోరౌ న ద్రక్ష్యామో వ్రజామస్త్వరితమితి జనే భాషమాణే తదానీమ్ । చాణూరం తం కరోద్భ్రామణవిగలదసుం పోథయామాసిథోర్వ్యాం పిష్టోఽభూన్ముష్టికోఽపి ద్రుతమథ హలినా నష్టశిష్టైర్దధావే ॥7॥
Offered for worship and study, not as prediction. Non-commercial.
More devotional texts
కంస సంవార్య తూర్యం ఖలమతిరవిదన్ కార్యమార్యాన్ పితృంస్తా- నాహంతుం వ్యాప్తమూర్తేస్తవ చ సమశిషద్దూరముత్సారణాయ । రుష్టో దుష్టోక్తిభిస్త్వం గరుడ ఇవ గిరిం మంచమంచన్నుదంచత్- ఖడ్గవ్యావల్గదుస్సంగ్రహమపి చ హఠాత్ ప్రాగ్రహీరౌగ్రసేనిమ్ ॥8॥
సద్యో నిష్పిష్టసంధిం భువి నరపతిమాపాత్య తస్యోపరిష్టా- త్త్వయ్యాపాత్యే తదైవ త్వదుపరి పతితా నాకినాం పుష్పవృష్టిః । కిం కిం బ్రూమస్తదానీం సతతమపి భియా త్వద్గతాత్మా స భేజే సాయుజ్యం త్వద్వధోత్థా పరమ పరమియం వాసనా కాలనేమేః ॥9॥
తద్భ్రాతృనష్ట పిష్ట్వా ద్రుతమథ పితరౌ సన్నమన్నుగ్రసేనం కృత్వా రాజానముచ్చైర్యదుకులమఖిలం మోదయన్ కామదానైః । భక్తానాముత్తమం చోద్ధవమమరగురోరాప్తనీతిం సఖాయం లబ్ధ్వా తుష్టో నగర్యాం పవనపురపతే రుంధి మే సర్వరోగాన్ ॥10॥
Browse Related Categories: