Sri Rama · Traditional devotional text · Source: vignanam.org (Traditional devotional text (public-domain shlokas))
తక్కువేమి మనకూ రాముం-డొక్కడుండు వరకూ
ప్రక్కతోడుగా భగవంతుడు మన చక్రధారియై చెంతనె ఉండగా ॥ 1 ॥ తక్కువేమి మనకూ ॥
మ్రుచ్చుసోమకుని మును జంపిన ఆ మత్సమూర్తి మనపక్షమునుండగా ॥ 2 ॥ తక్కువేమి మనకూ ॥
భూమిస్వర్గములు పొందుగ గొలచిన వామనుండు మనవాడై యుండగ ॥ 3 ॥ తక్కువేమి మనకూ ॥
దశగ్రీవుముని దండించిన ఆ ధశరధ రాముని దయ మనకుండగ ॥ 4 ॥ తక్కువేమి మనకూ ॥
దుష్టకంసునీ దుంచినట్టి శ్రీ కృష్ణుడు మనపై గృపతో నుండగ ॥ 5 ॥ తక్కువేమి మనకూ ॥
రామదాసుని గాచెడి శ్రీ మన్నారాయణి నెరనమ్మియుండగ ॥ 6 ॥ తక్కువేమి మనకూ ॥
Browse Related Categories:
Offered for worship and study, not as prediction. Non-commercial.
More devotional texts