Sri Venkateswara Swamy · Traditional devotional text · Source: vignanam.org (Traditional devotional text (public-domain shlokas))
రాగం: ముఖారి ఆ: స రి2 మ1 ప ని2 ద2 స అవ: స ని2 ద1 ప మ1 గ2 రి2 స పల్లవి నగవులు నిజమని నమ్మేదా । వొగినడియాసలు వొద్దనవే ॥ (2.5) చరణం 1 తొల్లిటి కర్మము దొంతల నుండగ । చెల్లబోయిక జేసేదా । (2) యెల్ల లోకములు యేలేటి దేవుడ । (2) వొల్ల నొల్లనిక నొద్దనవే ॥ (2) నగవులు నిజమని నమ్మేదా..(ప..) చరణం 2 పోయిన జన్మము పొరుగులనుండగ । చీయనక యిందు జెలగేదా । వేయినామముల వెన్నుడమాయలు । ఓ యయ్య యింక నొద్దనవే ॥ చరణం 3 నలి నీనామము నాలికనుండగ । తలకొని యితరము చడవేదా । (2) బలు శ్రీ వేంకటపతి నిన్నుగొలిచి । వొలుకు చంచలము లొద్దనవే ॥ (2) నగవులు నిజమని నమ్మేదా । వొగినడియాసలు వొద్దనవే ॥ (2.5)
Browse Related Categories:
Offered for worship and study, not as prediction. Non-commercial.
More devotional texts