Sri Rama · Traditional devotional text · Source: vignanam.org (Traditional devotional text (public-domain shlokas))
రాజసభ, రఘు రామసభ సీతా కాంత కల్యాణ సభ । అరిషడ్వర్గములరయు సభ పరమపదంబును ఒసగు సభ ॥
వేదాంతులకే జ్ఞాన సభ విప్రవరులకే దాన సభ । దుర్జనులకు విరోధి సభ సజ్జనులకు సంతోష సభ ॥
రాజసభ, రఘు రామసభ సీతా కాంత కల్యాణ సభ ।
సురలు, అసురులు కొలచు సభ అమరులు, రుద్రులు పొగడు సభ । వెరువక హరివిల్లు విరచు సభ జనకుని మది మెప్పించు సభ ॥
రాజసభ, రఘు రామసభ సీతా కాంత కల్యాణ సభ ।
భక్తి జ్ఞానములొసగు సభ సృష్టి రహితులై నిలచు సభ । ఉత్తమ పురుషుల ముక్తి సభ చిత్త విశ్రాంతినొసగు సభ ॥
రాజసభ, రఘు రామసభ సీతా కాంత కల్యాణ సభ ।
గం-ధర్వులు గానము చేయు సభ రం-భాదులు నాట్యములాడు సభ । పుష్ప వర్షములు కురియు సభ పూజ్యులైన మునులుండు సభ ॥
రాజసభ, రఘు రామసభ సీతా కాంత కల్యాణ సభ । అరిషడ్వర్గములరయు సభ అరిషడ్వర్గములరయు సభ
Offered for worship and study, not as prediction. Non-commercial.
More devotional texts
Browse Related Categories: