Sri Rama · Traditional devotional text · Source: vignanam.org (Traditional devotional text (public-domain shlokas))
రాగం: బహుదారి 28 హరికాంబోజి జన్య ఆ: స గ3 మ1 ప ద2 ని2 స అవ: స ని2 ప మ1 గ3 స తాళం: దేశాది పల్లవి బ్రోవ భారమా, రఘు రామ భువనమెల్ల నేవై, నన్నొకని అనుపల్లవి శ్రీ వాసుదేవ! అండ కోట్ల కుక్షిని ఉంచుకోలేదా, నన్ను బ్రోవ భారమా, రఘు రామ.. (ప..) చరణం 1 కలశాంబుధిలో దయతో అమరులకై, అది గాక గోపికలకై కొండలెత్త లేదా కరుణాకర, త్యాగరాజుని బ్రోవ భారమా, రఘు రామ భువనమెల్ల నేవై, నన్నొకని
Browse Related Categories:
Offered for worship and study, not as prediction. Non-commercial.
More devotional texts