Sri Rama · Traditional devotional text · Source: vignanam.org (Traditional devotional text (public-domain shlokas))
రాగం: వరాళి తాళం: ఆది
అదిగో భద్రాద్రి గౌతమి ఇదిగో చూడండి ॥ అదిగో ॥
ముదముతో సీత ముదిత లక్ష్మణుడు కదసి కొలువగా కలడదె రఘుపతి ॥ 1 ॥ అదిగో ॥
చారు స్వర్ణ ప్రాకార గోపుర ద్వారములతో సుందరమై యుండెడి ॥ 2 ॥ అదిగో ॥
అనుపమానమై అతిసుందరమై తనరు చక్రమది ధగ ధగ మెరిసెడి ॥ 3 ॥ అదిగో ॥
కలియుగమందున నిల వైకుంఠము నలరుచునున్నది నయముగ మ్రొక్కుడి ॥ 4 ॥ అదిగో ॥
పొన్నల పొగడల పూపొద రిండ్లతొ చెన్ను మీరగను చెలగుచునున్నది ॥ 5 ॥ అదిగో ॥
శ్రీకరముగ శ్రీరామదాసుని ప్రాకటముగ బ్రోచే ప్రభువాసము ॥ 6 ॥ అదిగో ॥
Browse Related Categories:
Offered for worship and study, not as prediction. Non-commercial.
More devotional texts