Sri Venkateswara Swamy · Traditional devotional text · Source: vignanam.org (Traditional devotional text (public-domain shlokas))
నిగమనిగమాంతవర్ణిత మనోహర రూప- నగరాజధరుడ శ్రీనారయణా ॥ దీపించు వైరాగ్యదివ్య సౌఖ్యం బియ్య- నోపకరా నన్ను నొడబరపుచు । పైపైనె సంసారబంధముల గట్టేవు నాపలుకు చెల్లునా నారాయణా ॥ చికాకుపడిన నా చిత్తశాంతము సేయ- లేకకా నీవు బహులీల నన్ను । కాకుసేసెదవు బహుకర్మల బడువారు నాకొలదివారలా నారాయణా ॥ వివివిధ నిర్బంధముల వెడలద్రోయక నన్ను భవసాగరముల నడబడ జేతురా । దివిజేంద్రవంద్య శ్రీ తిరువేంకటాద్రీశ నవనీత చోర శ్రీనారాయణా ॥
Offered for worship and study, not as prediction. Non-commercial.
More devotional texts
Browse Related Categories: