Devi · Traditional devotional text · Source: vignanam.org (Traditional devotional text (public-domain shlokas))
అస్య శ్రీ దేవీవైభవాశ్చర్యాష్టోత్తరశతదివ్యనామ స్తోత్రమహామంత్రస్య ఆనందభైరవ ఋషిః, అనుష్టుప్ ఛందః, శ్రీ ఆనందభైరవీ శ్రీమహాత్రిపురసుందరీ దేవతా, ఐం బీజం, హ్రీం శక్తిః, శ్రీం కీలకం, మమ శ్రీఆనందభైరవీ శ్రీమహాత్రిపురసుందరీ ప్రసాదసిద్ధ్యర్థే జపే వినియోగః ।
Offered for worship and study, not as prediction. Non-commercial.
ధ్యానం కుంకుమపంకసమాభా- -మంకుశపాశేక్షుకోదండశరామ్ । పంకజమధ్యనిషణ్ణాం పంకేరుహలోచనాం పరాం వందే ॥
పంచపూజా లం పృథివ్యాత్మికాయై గంధం సమర్పయామి । హం ఆకాశాత్మికాయై పుష్పైః పూజయామి । యం వాయ్వాత్మికాయై ధూపమాఘ్రాపయామి । రం అగ్న్యాత్మికాయై దీపం దర్శయామి । వం అమృతాత్మికాయై అమృతం మహానైవేద్యం నివేదయామి । సం సర్వాత్మికాయై సర్వోపచారాన్ సమర్పయామి ॥
ఓం ఐం హ్రీం శ్రీమ్ । పరమానందలహరీ పరచైతన్యదీపికా । స్వయంప్రకాశకిరణా నిత్యవైభవశాలినీ ॥ 1 ॥
విశుద్ధకేవలాఖండసత్యకాలాత్మరూపిణీ । ఆదిమధ్యాంతరహితా మహామాయావిలాసినీ ॥ 2 ॥
గుణత్రయపరిచ్ఛేత్రీ సర్వతత్త్వప్రకాశినీ । స్త్రీపుంసభావరసికా జగత్సర్గాదిలంపటా ॥ 3 ॥
అశేషనామరూపాదిభేదచ్ఛేదరవిప్రభా । అనాదివాసనారూపా వాసనోద్యత్ప్రపంచికా ॥ 4 ॥
ప్రపంచోపశమప్రౌఢా చరాచరజగన్మయీ । సమస్తజగదాధారా సర్వసంజీవనోత్సుకా ॥ 5 ॥
భక్తచేతోమయానంతస్వార్థవైభవవిభ్రమా । సర్వాకర్షణవశ్యాదిసర్వకర్మధురంధరా ॥ 6 ॥
విజ్ఞానపరమానందవిద్యా సంతానసిద్ధిదా । ఆయురారోగ్యసౌభాగ్యబలశ్రీకీర్తిభాగ్యదా ॥ 7 ॥
ధనధాన్యమణీవస్త్రభూషాలేపనమాల్యదా । గృహగ్రామమహారాజ్యసామ్రాజ్యసుఖదాయినీ ॥ 8 ॥
సప్తాంగశక్తిసంపూర్ణసార్వభౌమఫలప్రదా । బ్రహ్మవిష్ణుశివేంద్రాదిపదవిశ్రాణనక్షమా ॥ 9 ॥
భుక్తిముక్తిమహాభక్తివిరక్త్యద్వైతదాయినీ । నిగ్రహానుగ్రహాధ్యక్షా జ్ఞాననిర్ద్వైతదాయినీ ॥ 10 ॥
పరకాయప్రవేశాదియోగసిద్ధిప్రదాయినీ । శిష్టసంజీవనప్రౌఢా దుష్టసంహారసిద్ధిదా ॥ 11 ॥
లీలావినిర్మితానేకకోటిబ్రహ్మాండమండలా । ఏకానేకాత్మికా నానారూపిణ్యర్ధాంగనేశ్వరీ ॥ 12 ॥
శివశక్తిమయీ నిత్యశృంగారైకరసప్రియా । తుష్టా పుష్టాఽపరిచ్ఛిన్నా నిత్యయౌవనమోహినీ ॥ 13 ॥
సమస్తదేవతారూపా సర్వదేవాధిదేవతా । దేవర్షిపితృసిద్ధాదియోగినీభైరవాత్మికా ॥ 14 ॥
నిధిసిద్ధిమణీముద్రా శస్త్రాస్త్రాయుధభాసురా । ఛత్రచామరవాదిత్రపతాకావ్యజనాంచితా ॥ 15 ॥
హస్త్యశ్వరథపాదాతామాత్యసేనాసుసేవితా । పురోహితకులాచార్యగురుశిష్యాదిసేవితా ॥ 16 ॥
సుధాసముద్రమధ్యోద్యత్సురద్రుమనివాసినీ । మణిద్వీపాంతరప్రోద్యత్కదంబవనవాసినీ ॥ 17 ॥
చింతామణిగృహాంతఃస్థా మణిమంటపమధ్యగా । రత్నసింహాసనప్రోద్యచ్ఛివమంచాధిశాయినీ ॥ 18 ॥
సదాశివమహాలింగమూలసంఘట్టయోనికా । అన్యోన్యాలింగసంఘర్షకండూసంక్షుబ్ధమానసా ॥ 19 ॥
కళోద్యద్బిందుకాళిన్యాతుర్యనాదపరంపరా । నాదాంతానందసందోహస్వయంవ్యక్తవచోఽమృతా ॥ 20 ॥
కామరాజమహాతంత్రరహస్యాచారదక్షిణా । మకారపంచకోద్భూతప్రౌఢాంతోల్లాససుందరీ ॥ 21 ॥
శ్రీచక్రరాజనిలయా శ్రీవిద్యామంత్రవిగ్రహా । అఖండసచ్చిదానందశివశక్త్యైక్యరూపిణీ ॥ 22 ॥
త్రిపురా త్రిపురేశానీ మహాత్రిపురసుందరీ । త్రిపురావాసరసికా త్రిపురాశ్రీస్వరూపిణీ ॥ 23 ॥
మహాపద్మవనాంతస్థా శ్రీమత్త్రిపురమాలినీ । మహాత్రిపురసిద్ధాంబా శ్రీమహాత్రిపురాంబికా ॥ 24 ॥
నవచక్రక్రమాదేవీ మహాత్రిపురభైరవీ । శ్రీమాతా లలితా బాలా రాజరాజేశ్వరీ శివా ॥ 25 ॥
ఉత్పత్తిస్థితిసంహారక్రమచక్రనివాసినీ । అర్ధమేర్వాత్మచక్రస్థా సర్వలోకమహేశ్వరీ ॥ 26 ॥
వల్మీకపురమధ్యస్థా జంబూవననివాసినీ । అరుణాచలశృంగస్థా వ్యాఘ్రాలయనివాసినీ ॥ 27 ॥
శ్రీకాలహస్తినిలయా కాశీపురనివాసినీ । శ్రీమత్కైలాసనిలయా ద్వాదశాంతమహేశ్వరీ ॥ 28 ॥
శ్రీషోడశాంతమధ్యస్థా సర్వవేదాంతలక్షితా । శ్రుతిస్మృతిపురాణేతిహాసాగమకలేశ్వరీ ॥ 29 ॥
భూతభౌతికతన్మాత్రదేవతాప్రాణహృన్మయీ । జీవేశ్వరబ్రహ్మరూపా శ్రీగుణాఢ్యా గుణాత్మికా ॥ 30 ॥
అవస్థాత్రయనిర్ముక్తా వాగ్రమోమామహీమయీ । గాయత్రీభువనేశానీదుర్గాకాళ్యాదిరూపిణీ ॥ 31 ॥
మత్స్యకూర్మవరాహాదినానారూపవిలాసినీ । మహాయోగీశ్వరారాధ్యా మహావీరవరప్రదా ॥ 32 ॥
సిద్ధేశ్వరకులారాధ్యా శ్రీమచ్చరణవైభవా ॥ 33 ॥
పునర్ధ్యానం కుంకుమపంకసమాభా- -మంకుశపాశేక్షుకోదండశరామ్ । పంకజమధ్యనిషణ్ణాం పంకేరుహలోచనాం పరాం వందే ॥
ఇతి శ్రీగర్భకులార్ణవతంత్రే దేవీ వైభవాశ్చర్యాష్టోత్తరశతనామ స్తోత్రమ్ ।
Browse Related Categories: