Sri Rama · Traditional devotional text · Source: vignanam.org (Traditional devotional text (public-domain shlokas))
రాగం: దేవామృతవర్షిణి తాళం: దేశాది
పల్లవి ఎవరని నిర్ణయించిరిరా ని న్నెట్లారిధించిరిరా నర వరు ॥ లెవరని ॥
అను పలవి శివుడనో మాధవుడనో కమల భవుడనో పరబ్రహ్మనో ॥ ఎవరని ॥
చరణము(లు) శివమంత్రమునకు మా జీవము మా ధవమంత్రమునకు రాజీవము ఈ వివరము దెలిసిన ఘనులకు మ్రొక్కెద వితరణగుణ త్యాగరాజ వినుత ని ॥ న్నెట్లారిధించిరిరా ॥
Browse Related Categories:
Offered for worship and study, not as prediction. Non-commercial.
More devotional texts