Sri Rama · Traditional devotional text · Source: vignanam.org (Traditional devotional text (public-domain shlokas))
॥ బాలకాండః ॥
శుద్ధబ్రహ్మపరాత్పర రామ । కాలాత్మకపరమేశ్వర రామ । శేషతల్పసుఖనిద్రిత రామ । బ్రహ్మాద్యమరప్రార్థిత రామ । చండకిరణకులమండన రామ । శ్రీమద్దశరథనందన రామ । కౌసల్యాసుఖవర్ధన రామ । విశ్వామిత్రప్రియధన రామ । ఘోరతాటకాఘాతక రామ । మారీచాదినిపాతక రామ । 10 । కౌశికమఖసంరక్షక రామ । శ్రీమదహల్యోద్ధారక రామ । గౌతమమునిసంపూజిత రామ । సురమునివరగణసంస్తుత రామ । నావికధావికమృదుపద రామ । మిథిలాపురజనమోహక రామ । విదేహమానసరంజక రామ । త్ర్యంబకకార్ముఖభంజక రామ । సీతార్పితవరమాలిక రామ । కృతవైవాహికకౌతుక రామ । 20 । భార్గవదర్పవినాశక రామ । శ్రీమదయోధ్యాపాలక రామ ॥
రామ రామ జయ రాజా రామ । రామ రామ జయ సీతా రామ ॥
॥ అయోధ్యాకాండః ॥
అగణితగుణగణభూషిత రామ । అవనీతనయాకామిత రామ । రాకాచంద్రసమానన రామ । పితృవాక్యాశ్రితకానన రామ । ప్రియగుహవినివేదితపద రామ । తత్క్షాలితనిజమృదుపద రామ । భరద్వాజముఖానందక రామ । చిత్రకూటాద్రినికేతన రామ । 30 । దశరథసంతతచింతిత రామ । కైకేయీతనయార్పిత రామ । (తనయార్థిత) విరచితనిజపితృకర్మక రామ । భరతార్పితనిజపాదుక రామ ॥
రామ రామ జయ రాజా రామ । రామ రామ జయ సీతా రామ ॥
॥ అరణ్యకాండః ॥
దండకావనజనపావన రామ । దుష్టవిరాధవినాశన రామ । శరభంగసుతీక్ష్ణార్చిత రామ । అగస్త్యానుగ్రహవర్దిత రామ । గృధ్రాధిపసంసేవిత రామ । పంచవటీతటసుస్థిత రామ । 40 । శూర్పణఖార్త్తివిధాయక రామ । ఖరదూషణముఖసూదక రామ । సీతాప్రియహరిణానుగ రామ । మారీచార్తికృతాశుగ రామ । వినష్టసీతాన్వేషక రామ । గృధ్రాధిపగతిదాయక రామ । శబరీదత్తఫలాశన రామ । కబంధబాహుచ్ఛేదన రామ ॥
Offered for worship and study, not as prediction. Non-commercial.
More devotional texts
రామ రామ జయ రాజా రామ । రామ రామ జయ సీతా రామ ॥
॥ కిష్కింధాకాండః ॥
హనుమత్సేవితనిజపద రామ । నతసుగ్రీవాభీష్టద రామ । 50 । గర్వితవాలిసంహారక రామ । వానరదూతప్రేషక రామ । హితకరలక్ష్మణసంయుత రామ । రామ రామ జయ రాజా రామ । రామ రామ జయ సీతా రామ । ॥ సుందరకాండః ॥
కపివరసంతతసంస్మృత రామ । తద్గతివిఘ్నధ్వంసక రామ । సీతాప్రాణాధారక రామ । దుష్టదశాననదూషిత రామ । శిష్టహనూమద్భూషిత రామ । సీతావేదితకాకావన రామ । కృతచూడామణిదర్శన రామ । 60 । కపివరవచనాశ్వాసిత రామ ॥
రామ రామ జయ రాజా రామ । రామ రామ జయ సీతా రామ ॥
॥ యుద్ధకాండః ॥
రావణనిధనప్రస్థిత రామ । వానరసైన్యసమావృత రామ । శోషితశరదీశార్త్తిత రామ । విభీష్ణాభయదాయక రామ । పర్వతసేతునిబంధక రామ । కుంభకర్ణశిరశ్ఛేదక రామ । రాక్షససంఘవిమర్ధక రామ । అహిమహిరావణచారణ రామ । సంహృతదశముఖరావణ రామ । 70 । విధిభవముఖసురసంస్తుత రామ । ఖఃస్థితదశరథవీక్షిత రామ । సీతాదర్శనమోదిత రామ । అభిషిక్తవిభీషణనుత రామ । (నత) పుష్పకయానారోహణ రామ । భరద్వాజాదినిషేవణ రామ । భరతప్రాణప్రియకర రామ । సాకేతపురీభూషణ రామ । సకలస్వీయసమానత రామ । రత్నలసత్పీఠాస్థిత రామ । 80 । పట్టాభిషేకాలంకృత రామ । పార్థివకులసమ్మానిత రామ । విభీషణార్పితరంగక రామ । కీశకులానుగ్రహకర రామ । సకలజీవసంరక్షక రామ । సమస్తలోకోద్ధారక రామ ॥ (లోకాధారక) రామ రామ జయ రాజా రామ । రామ రామ జయ సీతా రామ ॥
॥ ఉత్తరకాండః ॥
ఆగత మునిగణ సంస్తుత రామ । విశ్రుతదశకంఠోద్భవ రామ । సీతాలింగననిర్వృత రామ । నీతిసురక్షితజనపద రామ । 90 । విపినత్యాజితజనకజ రామ । కారితలవణాసురవధ రామ । స్వర్గతశంబుక సంస్తుత రామ । స్వతనయకుశలవనందిత రామ । అశ్వమేధక్రతుదీక్షిత రామ । కాలావేదితసురపద రామ । ఆయోధ్యకజనముక్తిత రామ । విధిముఖవిభుదానందక రామ । తేజోమయనిజరూపక రామ । సంసృతిబంధవిమోచక రామ । 100 । ధర్మస్థాపనతత్పర రామ । భక్తిపరాయణముక్తిద రామ । సర్వచరాచరపాలక రామ । సర్వభవామయవారక రామ । వైకుంఠాలయసంస్థిత రామ । నిత్యానందపదస్థిత రామ ॥
రామ రామ జయ రాజా రామ ॥ రామ రామ జయ సీతా రామ ॥ 108 ॥
ఇతి శ్రీలక్ష్మణాచార్యవిరచితం నామరామాయణం సంపూర్ణమ్ ।
Browse Related Categories: