Vishnu · Traditional devotional text · Source: vignanam.org (Traditional devotional text (public-domain shlokas))
మంగళశ్లోకాః మంగళం భగవాన్విష్ణుర్మంగళం మధుసూదనః । మంగళం పుండరీకాక్షో మంగళం గరుడధ్వజః ॥ 1
మంగళం కోసలేంద్రాయ మహనీయగుణాబ్ధయే । చక్రవర్తితనూజాయ సార్వభౌమాయ మంగళమ్ ॥ 2
వేదవేదాంతవేద్యాయ మేఘశ్యామలమూర్తయే । పుంసాం మోహనరూపాయ పుణ్యశ్లోకాయ మంగళమ్ ॥ 3
విశ్వామిత్రాంతరంగాయ మిథిలానగరీపతేః । భాగ్యానాం పరిపాకాయ భవ్యరూపాయ మంగళమ్ ॥ 4
పితృభక్తాయ సతతం భ్రాతృభిః సహ సీతయా । నందితాఖిలలోకాయ రామచంద్రాయ మంగళమ్ ॥ 5
త్యక్తసాకేతవాసాయ చిత్రకూటవిహారిణే । సేవ్యాయ సర్వయమినాం ధీరోదాత్తాయ మంగళమ్ ॥ 6
సౌమిత్రిణా చ జానక్యా చాపబాణాసిధారిణా । సంసేవ్యాయ సదా భక్త్యా సానుజాయాస్తు మంగళమ్ ॥ 7
దండకారణ్యవాసాయ ఖండితామరశత్రవే । గృధ్రరాజాయ భక్తాయ ముక్తిదాయాస్తు మంగళమ్ ॥ 8
సాదరం శబరీదత్తఫలమూలాభిలాషిణే । సౌలభ్యపరిపూర్ణాయ సత్త్వోద్యుక్తాయ మంగళమ్ ॥ 9
Offered for worship and study, not as prediction. Non-commercial.
More devotional texts
హనూమత్సమవేతాయ హరీశాభీష్టదాయినే । వాలిప్రమథనాయాస్తు మహాధీరాయ మంగళమ్ ॥ 10
శ్రీమతే రఘువీరాయ సేతులంఘితసింధవే । జితరాక్షసరాజాయ రణధీరాయ మంగళమ్ ॥ 11
ఆసాద్య నగరీం దివ్యామభిషిక్తాయ సీతయా । రాజాధిరాజరాజాయ రామభద్రాయ మంగళమ్ ॥ 12
విభీషణకృతే ప్రీత్యా విశ్వాభీష్టప్రదాయినే । జానకీప్రాణనాథాయ సదా రామాయ మంగళమ్ ॥ 13
—-
శ్రీరామం త్రిజగద్గురుం సురవరం సీతామనోనాయకం శ్యామాంగం శశికోటిపూర్ణవదనం చంచత్కలాకౌస్తుభమ్ । సౌమ్యం సత్యగుణోత్తమం సుసరయూతీరే వసంతం ప్రభుం త్రాతారం సకలార్థసిద్ధిసహితం వందే రఘూణాం పతిమ్ ॥ 14
శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘువరాన్వయరత్నదీపమ్ । ఆజానుబాహుమరవిందదళాయతాక్షం రామం నిశాచరవినాశకరం నమామి ॥ 15
శ్రీరామచంద్ర కరుణాకర రాఘవేంద్ర రాజేంద్రచంద్ర రఘువంశసముద్రచంద్ర । సుగ్రీవనేత్రయుగళోత్పల-పూర్ణచంద్ర సీతామనఃకుముదచంద్ర నమో నమస్తే ॥ 16
సీతామనోమానసరాజహంస సంసారసంతాపహర క్షమావన్ । శ్రీరామ దైత్యాంతక శాంతరూప శ్రీతారకబ్రహ్మ నమో నమస్తే ॥ 17
విష్ణో రాఘవ వాసుదేవ నృహరే దేవౌఘచూడామణే । సంసారార్ణవకర్ణధారక హరే కృష్ణాయ తుభ్యం నమః ॥ 18
సుగ్రీవాదిసమస్తవానరవరైస్సంసేవ్యమానం సదా । విశ్వామిత్రపరాశరాదిమునిభిస్సంస్తూయమానం భజే ॥ 19
రామం చందనశీతలం క్షితిసుతామోహాకరం శ్రీకరం వైదేహీనయనారవిందమిహిరం సంపూర్ణచంద్రాననమ్ । రాజానం కరుణాసమేతనయనం సీతామనోనందనం సీతాదర్పణచారుగండలలితం వందే సదా రాఘవమ్ ॥ 20
జానాతి రామ తవ నామరుచిం మహేశో జానాతి గౌతమసతీ చరణప్రభావమ్ । జానాతి దోర్బలపరాక్రమమీశచాపో జానాత్యమోఘపటుబాణగతిం పయోధిః ॥ 21
మాతా రామో మత్పితా రామచంద్రో భ్రాతా రామో మత్సఖా రాఘవేశః । సర్వస్వం మే రామచంద్రో దాయాళు- ర్నాన్యం దైవం నైవ జానే న జానే ॥ 22
విమలకమలనేత్రం విస్ఫురన్నీలగాత్రం తపనకులపవిత్రం దానవధ్వంతమిత్రమ్ । భువనశుభచరిత్రం భూమిపుత్రీకళత్రం దశరథవరపుత్రం నౌమి రామాఖ్యమిత్రమ్ ॥ 23
మార్గే మార్గే శాఖినాం రత్నవేదీ వేద్యాం వేద్యాం కిన్నరీబృందగీతమ్ । గీతే గీతే మంజులాలాపగోష్ఠీ గోష్ఠ్యాం గోష్ఠ్యాం త్వత్కథా రామచంద్ర ॥ 24
వృక్షే వృక్షే వీక్షితాః పక్షిసంఘాః సంఘే సంఘే మంజులామోదవాక్యమ్ । వాక్యే వాక్యే మంజులాలాపగోష్ఠీ గోష్ఠ్యాం గోష్ఠ్యాం త్వత్కథా రామచంద్ర ॥ 25
దురితతిమిరచంద్రో దుష్టకంజాతచంద్రః సురకువలయచంద్రస్సూర్యవంశాబ్ధిచంద్రః । స్వజననివహచంద్రశ్శత్రురాజీవచంద్రః ప్రణతకుముదచంద్రః పాతు మాం రామచంద్రః ॥ 26
కళ్యాణదం కౌశికయజ్ఞపాలం కళానిధిం కాంచనశైలధీరమ్ । కంజాతనేత్రం కరుణాసముద్రం కాకుత్స్థరామం కలయామి చిత్తే ॥ 27
రాజీవాయతలోచనం రఘువరం నీలోత్పలశ్యామలం మందారాంచితమండపే సులలితే సౌవర్ణకే పుష్పకే । ఆస్థానే నవరత్నరాజిఖచితే సింహాసనే సంస్థితం సీతాలక్ష్మణలోకపాలసహితం వందే మునీంద్రాస్పదమ్ ॥ 28
ధ్యాయే రామం సుధాంశుం నతసకలభవారణ్యతాపప్రహారమ్ । శ్యామం శాంతం సురేంద్రం సురమునివినుతం కోటిసూర్యప్రకాశమ్ । సీతాసౌమిత్రిసేవ్యం సురనరసుగమం దివ్యసింహాసనస్థమ్ । సాయాహ్నే రామచంద్రం స్మితరుచిరముఖం సర్వదా మే ప్రసన్నమ్ ॥ 29
ఇంద్రనీలమణిసన్నిభదేహం వందనీయమసకృన్మునిబృందైః । లంబమానతులసీవనమాలం చింతయామి సతతం రఘువీరమ్ ॥ 30
సంపూర్ణచంద్రవదనం సరసీరుహాక్షం మాణిక్యకుండలధరం ముకుటాభిరామమ్ । చాంపేయగౌరవసనం శరచాపహస్తం శ్రీరామచంద్రమనిశం మనసా స్మరామి ॥ 31
మాతుః పార్శ్వే చరంతం మణిమయశయనే మంజుభూషాంచితాంగమ్ । మందం మందం పిబంతం ముకుళితనయనం స్తన్యమన్యస్తనాగ్రమ్ । అంగుళ్యాగ్రైః స్పృశంతం సుఖపరవశయా సస్మితాలింగితాంగమ్ । గాఢం గాఢం జనన్యా కలయతు హృదయం మామకం రామబాలమ్ ॥ 32
రామాభిరామం నయనాభిరామం వాచాభిరామం వదనాభిరామమ్ । సర్వాభిరామం చ సదాభిరామం వందే సదా దాశరథిం చ రామమ్ ॥ 33
రాశబ్దోచ్చారమాత్రేణ ముఖాన్నిర్యాతి పాతకాః । పునః ప్రవేశభీత్యా చ మకారస్తు కవాటవత్ ॥ 34
అనర్ఘమాణిక్యవిరాజమాన- శ్రీపాదుకాలంకృతశోభనాభ్యామ్ । అశేషబృందారకవందితాభ్యాం నమో నమో రామపదాంబుజాభ్యామ్ ॥ 35
చలత్కనకకుండలోల్లసితదివ్యగండస్థలం చరాచరజగన్మయం చరణపద్మగంగాశ్రయమ్ । చతుర్విధఫలప్రదం చరమపీఠమధ్యస్థితం చిదంశమఖిలాస్పదం దశరథాత్మజం చింతయే ॥ 36
సనందనమునిప్రియం సకలవర్ణవేదాత్మకం సమస్తనిగమాగమస్ఫురితతత్త్వసింహాసనమ్ । సహస్రనయనాబ్జజాద్యమరబృందసంసేవితం సమష్టిపురవల్లభం దశరథాత్మజం చింతయే ॥ 37
జాగ్రత్స్వప్నసుషుప్తి-కాలవిలసత్తత్త్వాత్మచిన్మాత్రకం చైతన్యాత్మకమాధిపాపరహితం భూమ్యాదితన్మాత్రకమ్ । శాంభవ్యాదిసమస్తయోగకులకం సాంఖ్యాదితత్త్వాత్పరం శబ్దావాచ్యమహం నమామి సతతం వ్యుత్పత్తినాశాత్పరమ్ ॥ 38
ఇక్ష్వాకువంశార్ణవజాతరత్నం సీతాంగనాయౌవనభాగ్యరత్నమ్ । వైకుంఠరత్నం మమ భాగ్యరత్నం శ్రీరామరత్నం శిరసా నమామి ॥ 39
ఇక్ష్వాకునందనం సుగ్రీవపూజితం త్రైలోక్యరక్షకం సత్యసంధం సదా । రాఘవం రఘుపతిం రాజీవలోచనం రామచంద్రం భజే రాఘవేశం భజే ॥ 40
భక్తప్రియం భక్తసమాధిగమ్యం చింతాహరం చింతితకామధేనుమ్ । సూర్యేందుకోటిద్యుతిభాస్వరం తం రామం భజే రాఘవరామచంద్రమ్ ॥ 41
శ్రీరామం జనకక్షితీశ్వరసుతావక్త్రాంబుజాహారిణం శ్రీమద్భానుకులాబ్ధికౌస్తుభమణిం శ్రీరత్నవక్షస్స్థలమ్ । శ్రీకంఠాద్యమరౌఘరత్నమకుటాలంకారపాదాంబుజం శ్రీవత్సోజ్జ్వలమింద్రనీలసదృశం శ్రీరామచంద్రం భజే ॥ 42
రామచంద్ర చరితాకథామృతం లక్ష్మణాగ్రజగుణానుకీర్తనమ్ । రాఘవేశ తవ పాదసేవనం సంభవంతు మమ జన్మజన్మని ॥ 43
అజ్ఞానసంభవ-భవాంబుధిబాడబాగ్ని- రవ్యక్తతత్త్వనికరప్రణవాధిరూఢః । సీతాసమేతమనుజేన హృదంతరాళే ప్రాణప్రయాణసమయే మమ సన్నిధత్తే ॥ 44
రామో మత్కులదైవతం సకరుణం రామం భజే సాదరం రామేణాఖిలఘోరపాపనిహతీ రామాయ తస్మై నమః । రామాన్నాస్తి జగత్రయైకసులభో రామస్య దాసోఽస్మ్యహం రామే ప్రీతిరతీవ మే కులగురో శ్రీరామ రక్షస్వ మామ్ ॥ 45
వైదేహీసహితం సురద్రుమతలే హైమే మహామంటపే । మధ్యేపుష్పకమాసనే మణిమయే వీరాసనే సంస్థితమ్ । అగ్రే వాచయతి ప్రభంజనసుతే తత్త్వం మునిభ్యః పరమ్ । వ్యాఖ్యాంతం భరతాదిభిః పరివృతం రామం భజే శ్యామలమ్ ॥ 46
వామే భూమిసుతా పురస్తు హనుమాన్పశ్చాత్సుమిత్రాసుత- శ్శత్రుఘ్నో భరతశ్చ పార్శ్వదళయోర్వాయ్వాదికోణేష్వపి । సుగ్రీవశ్చ విభీషణశ్చ యువరాట్ తారాసుతో జాంబవాన్ మధ్యే నీలసరోజకోమలరుచిం రామం భజే శ్యామలమ్ ॥ 47
కేయూరాంగదకంకణైర్మణిగణైర్వైరోచమానం సదా రాకాపర్వణిచంద్రకోటిసదృశం ఛత్రేణ వైరాజితమ్ । హేమస్తంభసహస్రషోడశయుతే మధ్యే మహామండపే దేవేశం భరతాదిభిః పరివృతం రామం భజే శ్యామలమ్ ॥ 48
సాకేతే శరదిందుకుందధవళే సౌఘే మహామంటపే । పర్యస్తాగరుధూపధూమపటలే కర్పూరదీపోజ్జ్వలే । సుగ్రీవాంగదవాయుపుత్రసహితం సౌమిత్రిణా సేవితం లీలామానుషవిగ్రహం రఘుపతిం రామం భజే శ్యామలమ్ ॥ 49
శాంతం శారదచంద్రకోటిసదృశం చంద్రాభిరామాననం చంద్రార్కాగ్నివికాసికుండలధరం చంద్రావతంసస్తుతమ్ । వీణాపుస్తకసాక్షసూత్రవిలసద్వ్యాఖ్యానముద్రాకరం దేవేశం భరతాదిభిః పరివృతం రామం భజే శ్యామలమ్ ॥ 50
రామం రాక్షసమర్దనం రఘుపతిం శక్రారివిధ్వంసినం సుగ్రీవేప్సితరాజ్యదం సురపతేః పుత్రాంతకం శార్ంగిణమ్ । భక్తానామభయప్రదం భయహరం పాపౌఘవిధ్వంసినం సీతాసేవితపాదపద్మయుగళం రామం భజే శ్యామలమ్ ॥ 51
కందర్పాయుతకోటికోటితులితం కాలాంబుదశ్యామలం కంబుగ్రీవముదారకౌస్తుభధరం కర్ణావతంసోత్పలమ్ । కస్తూరీతిలకోజ్జ్వలం స్మితముఖం చిన్ముద్రయాలంకృతం సీతాలక్ష్మణవాయుపుత్రసహితం సింహాసనస్థం భజే ॥ 52
సాకేతే నవరత్నపంక్తిఖచితే చిత్రధ్వజాలంకృతే వాసే స్వర్ణమయే దళాష్టలలితే పద్మే విమానోత్తమే । ఆసీనం భరతాదిసోదరజనైః శాఖామృగైః కిన్నరైః దిక్పాలైర్మునిపుంగవైర్నృపగణైస్సంసేవ్యమానం భజే ॥ 53
కస్తూరీఘనసారకుంకుమలసచ్ఛ్రీచందనాలంకృతం కందర్పాధికసుందరం ఘననిభం కాకుత్స్థవంశధ్వజమ్ । కళ్యాణాంభరవేష్టితం కమలయా యుక్తం కలావల్లభం కళ్యాణాచలకార్ముకప్రియసఖం కళ్యాణరామం భజే ॥ 54
ముక్తేర్మూలం మునివరహృదానందకందం ముకుందం కూటస్థాఖ్యం సకలవరదం సర్వచైతన్యరూపమ్ । నాదాతీతం కమలనిలయం నాదనాదాంతతత్త్వం నాదాతీతం ప్రకృతిరహితం రామచంద్రం భజేఽహమ్ ॥ 55
తారాకారం నిఖిలనిలయం తత్త్వమస్యాదిలక్ష్యం శబ్దావాచ్యం త్రిగుణరహితం వ్యోమమంగుష్ఠమాత్రమ్ । నిర్వాణాఖ్యం సగుణమగుణవ్యోమరంధ్రాంతరస్థం సౌషుమ్నాంతః ప్రణవసహితం రామచంద్రం భజేఽహమ్ ॥ 56
నిజానందాకారం నిగమతురగారాధితపదం పరబ్రహ్మానందం పరమపదగం పాపహరణమ్ । కృపాపారావారం పరమపురుషం పద్మనిలయం భజే రామం శ్యామం ప్రకృతిరహితం నిర్గుణమహమ్ ॥ 57
సాకేతే నగరే సమస్తమహిమాధారే జగన్మోహనే రత్నస్తంభసహస్రమంటపమహాసింహాసనే సాంబుజే । విశ్వామిత్రవసిష్ఠగౌతమశుకవ్యాసాదిభిర్మౌనిభిః ధ్యేయం లక్ష్మణలోకపాలసహితం సీతాసమేతం భజే ॥ 58
రామం శ్యామాభిరామం రవిశశినయనం కోటిసూర్యప్రకాశం దివ్యం దివ్యాస్త్రపాణిం శరముఖశరధిం చారుకోడండహస్తమ్ । కాలం కాలాగ్నిరుద్రం రిపుకులదహనం విఘ్నవిచ్ఛేదదక్షం భీమం భీమాట్టహాసం సకలభయహరం రామచంద్రం భజేఽహమ్ ॥ 59
శ్రీరామం భువనైకసుందరతనుం ధారాధరశ్యామలం రాజీవాయతలోచనం రఘువరం రాకేందుబింబాననమ్ । కోదండాదినిజాయుధాశ్రితభుజైర్భ్రాంతం విదేహాత్మజా- ధీశం భక్తజనావనం రఘువరం శ్రీరామచంద్రం భజే ॥ 60
శ్రీవత్సాంకముదారకౌస్తుభలసత్పీతాంబరాలంకృతం నానారత్నవిరాజమానమకుటం నీలాంబుదశ్యామలమ్ । కస్తూరీఘనసారచర్చితతనుం మందారమాలాధరం కందర్పాయుతసుందరం రఘుపతిం సీతాసమేతం భజే ॥ 61
సదానందదేవే సహస్రారపద్మే గలచ్చంద్రపీయూషధారామృతాంతే । స్థితం రామమూర్తిం నిషేవే నిషేవే- ఽన్యదైవం న సేవే న సేవే న సేవే ॥ 62
సుధాభాసితద్వీపమధ్యే విమానే సుపర్వాళివృక్షోజ్జ్వలే శేషతల్పే । నిషణ్ణం రమాంకం నిషేవే నిషేవే- ఽన్యదైవం న సేవే న సేవే న సేవే ॥ 63
చిదంశం సమానందమానందకందం సుషుమ్నాఖ్యరంధ్రాంతరాళే చ హంసమ్ । సచక్రం సశంఖం సపీతాంబరాంకం పరంచాన్యదైవం న జానే న జానే ॥ 64
చతుర్వేదకూటోల్లసత్కారణాఖ్యం స్ఫురద్దివ్యవైమానికే భోగితల్పే । పరంధామమూర్తిం నిషణ్ణం నిషేవే నిషేవేఽన్యదైవం న సేవే న సేవే ॥ 65
సింహాసనస్థం సురసేవితవ్యం రత్నాంకితాలంకృతపాదపద్మమ్ । సీతాసమేతం శశిసూర్యనేత్రం రామం భజే రాఘవ రామచంద్రమ్ ॥ 66
రామం పురాణపురుషం రమణీయవేషం రాజాధిరాజమకుటార్చితపాదపీఠమ్ । సీతాపతిం సునయనం జగదేకవీరం శ్రీరామచంద్రమనిశం కలయామి చిత్తే ॥ 67
పరానందవస్తుస్వరూపాదిసాక్షిం పరబ్రహ్మగమ్యం పరంజ్యోతిమూర్తిమ్ । పరాశక్తిమిత్రాఽప్రియారాధితాంఘ్రిం పరంధామరూపం భజే రామచంద్రమ్ ॥ 68
మందస్మితం కుండలగండభాగం పీతాంబరం భూషణభూషితాంగమ్ । నీలోత్పలాంగం భువనైకమిత్రం రామం భజే రాఘవ రామచంద్రమ్ ॥ 69
అచింత్యమవ్యక్తమనంతరూప- మద్వైతమానందమనాదిగమ్యమ్ । పుణ్యస్వరూపం పురుషోత్తమాఖ్యం రామం భజే రాఘవ రామచంద్రమ్ ॥ 70
పద్మాసనస్థం సురసేవితవ్యం పద్మాలయానందకటాక్షవీక్ష్యమ్ । గంధర్వవిద్యాధరగీయమానం రామం భజే రాఘవ రామచంద్రమ్ ॥ 71
అనంతకీర్తిం వరదం ప్రసన్నం పద్మాసనం సేవకపారిజాతమ్ । రాజాధిరాజం రఘువీరకేతుం రామం భజే రాఘవ రామచంద్రమ్ ॥ 72
సుగ్రీవమిత్రం సుజనానురూపం లంకాహరం రాక్షసవంశనాశమ్ । వేదాశ్రయాంగం విపులాయతాక్షం రామం భజే రాఘవ రామచంద్రమ్ ॥ 73
సకృత్ప్రణతరక్షాయాం సాక్షీ యస్య విభీషణః । సాపరాధప్రతీకారః స శ్రీరామో గతిర్మమ ॥ 74
ఫలమూలాశినౌ దాంతౌ తాపసౌ ధర్మచారిణౌ । రక్షఃకులవిహంతారౌ భ్రాతరౌ రామలక్ష్మణౌ ॥ 75
తరుణౌ రూపసంపన్నౌ సుకుమారౌ మహాబలౌ । పుండరీక విశాలాక్షౌ చీరకృష్ణాజినాంబరౌ ॥ 76
కౌసల్యానయనేందుం దశరథముఖారవిందమార్తాండమ్ । సీతామానసహంసం రామం రాజీవలోచనం వందే ॥ 77
భర్జనం భవబీజానాం మార్జనం సుఖసంపదామ్ । తర్జనం యమదూతానాం రామరామేతి కీర్తనమ్ ॥ 78
న జానే జానకీ జానే రామ త్వన్నామవైభవమ్ । సర్వేశో భగవాన్ శంభుర్వాల్మీకిర్వేత్తి వా నవా ॥ 79
కరతలధృతచాపం కాలమేఘస్వరూపం సరసిజదళనేత్రం చారుహాసం సుగాత్రమ్ । విచినుతవనవాసం విక్రమోదగ్రవేషం ప్రణమత రఘునాథం జానకీప్రాణనాథమ్ ॥ 80
విద్యుత్స్ఫురన్మకరకుండలదీప్తచారు- గండస్థలం మణికిరీటవిరాజమానమ్ । పీతాంబరం జలదనీలముదారకాంతిం శ్రీరామచంద్రమనిశం కలయామి చిత్తే ॥ 81
రత్నోల్లసజ్జ్వలితకుండలగండభాగం కస్తూరికాతిలకశోభితఫాలభాగమ్ । కర్ణాంతదీర్ఘనయనం కరుణాకటాక్షం శ్రీరామచంద్ర ముఖమాత్మని సన్నిధత్తమ్ ॥ 82
వైదేహీసహితం చ లక్ష్మణయుతం కైకేయిపుత్రాన్వితం సుగ్రీవం చ విభీషణానిలసుతౌ నీలం నలం సాంగదమ్ । విశ్వామిత్రవసిష్ఠగౌతమభరద్వాజాదికాన్ మానయన్ రామో మారుతిసేవితః స్మరతు మాం సామ్రాజ్యసింహాసనే ॥ 83
సకలగుణనిధానం యోగిభిస్స్తూయమానం భజితసురవిమానం రక్షితేంద్రాదిమానమ్ । మహితవృషభయానం సీతయా శోభమానం స్మరతు హృదయభానుం బ్రహ్మరామాభిరామమ్ ॥ 84
త్రిదశకుముదచంద్రో దానవాంభోజచంద్రో దురితతిమిరచంద్రో యోగినాం జ్ఞానచంద్రః । ప్రణతనయనచంద్రో మైథిలీనేత్రచంద్రో దశముఖరిపుచంద్రః పాతు మాం రామచంద్రః ॥ 85
యన్నామైవ సహస్రనామసదృశం యన్నామ వేదైస్సమం యన్నామాంకితవాక్య-మాసురబలస్త్రీగర్భవిచ్ఛేదనమ్ । యన్నామ శ్వపచార్యభేదరహితం ముక్తిప్రదానోజ్జ్వలం తన్నామాఽలఘురామరామరమణం శ్రీరామనామామృతమ్ ॥ 86
రాజీవనేత్ర రఘుపుంగవ రామభద్ర రాకేందుబింబసదృశానన నీలగాత్ర । రామాఽభిరామ రఘువంశసముద్భవ త్వం శ్రీరామచంద్ర మమ దేహి కరావలంబమ్ ॥ 87
మాణిక్యమంజీరపదారవిందం రామార్కసంఫుల్లముఖారవిందమ్ । భక్తాభయప్రాపికరారవిందాం దేవీం భజే రాఘవవల్లభాం తామ్ ॥ 88
జయతు విజయకారీ జానకీమోదకారీ తపనకులవిహారీ దండకారణ్యచారీ । దశవదనకుఠారీ దైత్యవిచ్ఛేదకారీ మణిమకుటకధారీ చండకోదండధారీ ॥ 89
రామః పితా రఘవ ఏవ మాతా రామస్సుబంధుశ్చ సఖా హితశ్చ । రామో గురుర్మే పరమం చ దైవం రామం వినా నాఽన్యమహం స్మరామి ॥ 90
శ్రీరామ మే త్వం హి పితా చ మాతా శ్రీరామ మే త్వం హి సుహృచ్చ బంధుః । శ్రీరామ మే త్వం హి గురుశ్చ గోష్ఠీ శ్రీరామ మే త్వం హి సమస్తమేవ ॥ 91
రామచంద్రచరితామృతపానం సోమపానశతకోటిసమానమ్ । సోమపానశతకోటిభిరీయా- జ్జన్మ నైతి రఘునాయకనామ్నా ॥ 92
రామ రామ దయాసింధో రావణారే జగత్పతే । త్వత్పాదకమలాసక్తి-ర్భవేజ్జన్మని జన్మని ॥ 93
శ్రీరామచంద్రేతి దయాపరేతి భక్తప్రియేతి భవబంధనమోచనేతి । నాథేతి నాగశయనేతి సదా స్తువంతం మాం పాహి భీతమనిశం కృపణం కృపాళో ॥ 94
అయోధ్యానాథ రాజేంద్ర సీతాకాంత జగత్పతే । శ్రీరామ పుండరీకాక్ష రామచంద్ర నమోఽస్తు తే ॥ 95
హే రామ హే రమణ హే జగదేకవీర హే నాథ హే రఘుపతే కరుణాలవాల । హే జానకీరమణ హే జగదేకబంధో మాం పాహి దీనమనిశం కృపణం కృతఘ్నమ్ ॥ 96
జానాతి రామ తవ తత్త్వగతిం హనూమాన్ । జానాతి రామ తవ సఖ్యగతిం కపీశః । జానాతి రామ తవ యుద్ధగతిం దశాస్యో । జానాతి రామ ధనదానుజ ఏవ సత్యమ్ ॥ 97
సేవ్యం శ్రీరామమంత్రం శ్రవణశుభకరం శ్రేష్ఠసుజ్ఞానిమంత్రం స్తవ్యం శ్రీరామమంత్రం నరకదురితదుర్వారనిర్ఘాతమంత్రమ్ । భవ్యం శ్రీరామమంత్రం భజతు భజతు సంసారనిస్తారమంత్రం దివ్యం శ్రీరామమంత్రం దివి భువి విలసన్మోక్షరక్షైకమంత్రమ్ ॥ 98
నిఖిలనిలయమంత్రం నిత్యతత్త్వాఖ్యమంత్రం భవకులహరమంత్రం భూమిజాప్రాణమంత్రమ్ । పవనజనుతమంత్రం పార్వతీమోక్షమంత్రం పశుపతినిజమంత్రం పాతు మాం రామమంత్రమ్ ॥ 99
ప్రణవనిలయమంత్రం ప్రాణనిర్వాణమంత్రం ప్రకృతిపురుషమంత్రం బ్రహ్మరుద్రేంద్రమంత్రమ్ । ప్రకటదురితరాగద్వేషనిర్ణాశమంత్రం రఘుపతినిజమంత్రం రామరామేతిమంత్రమ్ ॥ 100
దశరథసుతమంత్రం దైత్యసంహారమంత్రం విబుధవినుతమంత్రం విశ్వవిఖ్యాతమంత్రమ్ । మునిగణనుతమంత్రం ముక్తిమార్గైకమంత్రం రఘుపతినిజమంత్రం రామరామేతిమంత్రమ్ ॥ 101
సంసారసాగరభయాపహవిశ్వమంత్రం సాక్షాన్ముముక్షుజనసేవితసిద్ధమంత్రమ్ । సారంగహస్తముఖహస్తనివాసమంత్రం కైవల్యమంత్రమనిశం భజ రామమంత్రమ్ ॥ 102
జయతు జయతు మంత్రం జన్మసాఫల్యమంత్రం జననమరణభేదక్లేశవిచ్ఛేదమంత్రమ్ । సకలనిగమమంత్రం సర్వశాస్త్రైకమంత్రం రఘుపతినిజమంత్రం రామరామేతిమంత్రమ్ ॥ 103
జగతి విశదమంత్రం జానకీప్రాణమంత్రం విబుధవినుతమంత్రం విశ్వవిఖ్యాతమంత్రమ్ । దశరథసుతమంత్రం దైత్యసంహారమంత్రం రఘుపతినిజమంత్రం రామరామేతిమంత్రమ్ ॥ 104
బ్రహ్మాదియోగిమునిపూజితసిద్ధమంత్రం దారిద్ర్యదుఃఖభవరోగవినాశమంత్రమ్ । సంసారసాగరసముత్తరణైకమంత్రం వందే మహాభయహరం రఘురామమంత్రమ్ ॥ 105
శత్రుచ్ఛేదైకమంత్రం సరసముపనిషద్వాక్యసంపూజ్యమంత్రం సంసారోత్తారమంత్రం సముచితసమయే సంగనిర్యాణమంత్రమ్ । సర్వైశ్వర్యైకమంత్రం వ్యసనభుజగసందష్టసంత్రాణమంత్రం జిహ్వే శ్రీరామమంత్రం జప జప సఫలం జన్మసాఫల్యమంత్రమ్ ॥ 106
నిత్యం శ్రీరామమంత్రం నిరుపమమధికం నీతిసుజ్ఞానమంత్రం సత్యం శ్రీరామమంత్రం సదమలహృదయే సర్వదారోగ్యమంత్రమ్ । స్తుత్యం శ్రీరామమంత్రం సులలితసుమనస్సౌఖ్యసౌభాగ్యమంత్రం పఠ్యం శ్రీరామమంత్రం పవనజవరదం పాతు మాం రామమంత్రమ్ ॥ 107
వ్యామోహప్రశమౌషధం మునిమనోవృత్తిప్రవృత్త్యౌషధం దైత్యోన్మూలకరౌషధం భవభయప్రధ్వంసనైకౌషధమ్ । భక్తానందకరౌషధం త్రిభువనే సంజీవనైకౌషధం శ్రేయః ప్రాప్తికరౌషధం పిబ మనః శ్రీరామనామౌషధమ్ ॥ 108
సకలభువనరత్నం సర్వశాస్త్రార్థరత్నం సమరవిజయరత్నం సచ్చిదానందరత్నమ్ । దశముఖహరరత్నం దానవారాతిరత్నం రఘుకులనృపరత్నం పాతు మాం రామరత్నమ్ ॥ 109
సకలభువనరత్నం సచ్చిదానందరత్నం సకలహృదయరత్నం సూర్యబింబాంతరత్నమ్ । విమలసుకృతరత్నం వేదవేదాంతరత్నం పురహరజపరత్నం పాతు మాం రామరత్నమ్ ॥ 110
నిగమశిఖరరత్నం నిర్మలానందరత్నం నిరుపమగుణరత్నం నాదనాదాంతరత్నమ్ । దశరథకులరత్నం ద్వాదశాంతస్స్థరత్నం పశుపతిజపరత్నం పాతు మాం రామరత్నమ్ ॥ 111
శతమఖసుతరత్నం షోడశాంతస్స్థరత్నం మునిజనజపరత్నం ముఖ్యవైకుంఠరత్నమ్ । నిరుపమగుణరత్నం నీరజాంతస్స్థరత్నం పరమపదవిరత్నం పాతు మాం రామరత్నమ్ ॥ 112
సకలసుకృతరత్నం సత్యవాక్యార్థరత్నం శమదమగుణరత్నం శాశ్వతానందరత్నమ్ । ప్రణయనిలయరత్నం ప్రస్ఫుటద్యోతిరత్నం పరమపదవిరత్నం పాతు మాం రామరత్నమ్ ॥ 113
నిగమశిఖరరత్నం నిత్యమాశాస్యరత్నం జననుతనృపరత్నం జానకీరూపరత్నమ్ । భువనవలయరత్నం భూభుజామేకరత్నం రఘుకులవరరత్నం పాతు మాం రామరత్నమ్ ॥ 114
విశాలనేత్రం పరిపూర్ణగాత్రం సీతాకలత్రం సురవైరిజైత్రమ్ । కారుణ్యపాత్రం జగతః పవిత్రం శ్రీరామరత్నం ప్రణతోఽస్మి నిత్యమ్ ॥ 115
హే గోపాలక హే దయాజలనిధే హే సద్గుణాంభోనిధే హే దైత్యాంతక హే విభీషణదయాపరీణ హే భూపతే । హే వైదేహసుతామనోజవిహృతే హే కోటిమారాకృతే హే నవ్యాంబుజనేత్ర పాలయ పరం జానామి న త్వాం వినా ॥ 116
యస్య కించిదపి నో హరణీయం కర్మ కించిదపి నో చరణీయమ్ । రామనామ చ సదా స్మరణీయం లీలయా భవజలం తరణీయమ్ ॥ 117
దశరథసుతమీశం దండకారణ్యవాసం శతమఖమణినీలం జానకీప్రాణలోలమ్ । సకలభువనమోహం సన్నుతాంభోదదేహం బహుళనుతసముద్రం భావయే రామభద్రమ్ ॥ 118
విశాలనేత్రం పరిపూర్ణగాత్రం సీతాకళత్రం సురవైరిజైత్రమ్ । జగత్పవిత్రం పరమాత్మతంత్రం శ్రీరామచంద్రం ప్రణమామి చిత్తే ॥ 119
జయ జయ రఘురామ శ్రీముఖాంభోజభానో జయ జయ రఘువీర శ్రీమదంభోజనేత్ర । జయ జయ రఘునాథ శ్రీకరాభ్యర్చితాంఘ్రి జయ జయ రఘువర్య శ్రీశ కారుణ్యసింధో ॥ 120
మందారమూలే మణిపీఠసంస్థం సుధాప్లుతం దివ్యవిరాట్స్వరూపమ్ । సబిందునాదాంతకలాంతతుర్య- మూర్తిం భజేఽహం రఘువంశరత్నమ్ ॥ 121
నాదం నాదవినీలచిత్తపవనం నాదాంతత్త్వప్రియం నామాకారవివర్జితం నవఘనశ్యామాంగనాదప్రియమ్ । నాదాంభోజమరందమత్తవిలసద్భృంగం మదాంతస్స్థితం నాదాంతధృవమండలాబ్జరుచిరం రామం భజే తారకమ్ ॥ 122
నానాభూతహృదబ్జపద్మనిలయం నామోజ్జ్వలాభూషణమ్ । నామస్తోత్రపవిత్రితత్రిభువనం నారాయణాష్టాక్షరమ్ । నాదాంతేందుగళత్సుధాప్లుతతనుం నానాత్మచిన్మాత్రకమ్ । నానాకోటియుగాంతభానుసదృశం రామం భజే తారకమ్ ॥ 123
వేద్యం వేదగురుం విరించిజనకం వేదాంతమూర్తిం స్ఫుర- ద్వేదం వేదకలాపమూలమహిమాధారాంతకందాంకురమ్ । వేదశృంగసమానశేషశయనం వేదాంతవేద్యాత్మకం వేదారాధితపాదపంకజమహం రామం భజే తారకమ్ ॥ 124
మజ్జీవం మదనుగ్రహం మదధిపం మద్భావనం మత్సుఖం మత్తాతం మమ సద్గురుం మమ వరం మోహాంధవిచ్ఛేదనమ్ । మత్పుణ్యం మదనేకబాంధవజనం మజ్జీవనం మన్నిధిం మత్సిద్ధిం మమ సర్వకర్మసుకృతం రామం భజే తారకమ్ ॥ 125
నిత్యం నీరజలోచనం నిరుపమం నీవారశూకోపమం నిర్భేదానుభవం నిరంతరగుణం నీలాంగరాగోజ్జ్వలమ్ । నిష్పాపం నిగమాగమార్చితపదం నిత్యాత్మకం నిర్మలం నిష్పుణ్యం నిఖిలం నిరంజనపదం రామం భజే తారకమ్ ॥ 126
ధ్యాయే త్వాం హృదయాంబుజే రఘుపతిం విజ్ఞానదీపాంకురం హంసోహంసపరంపరాదిమహిమాధారం జగన్మోహనమ్ । హస్తాంభోజగదాబ్జచక్రమతులం పీతాంబరం కౌస్తుభం శ్రీవత్సం పురుషోత్తమం మణినిభం రామం భజే తారకమ్ ॥ 127
సత్యజ్ఞానమనంతమచ్యుతమజం చావ్యాకృతం తత్పరం కూటస్థాదిసమస్తసాక్షిమనఘం సాక్షాద్విరాట్తత్త్వదమ్ । వేద్యం విశ్వమయం స్వలీనభువనస్వారాజ్యసౌఖ్యప్రదం పూర్ణం పూర్ణతరం పురాణపురుషం రామం భజే తారకమ్ ॥ 128
రామం రాక్షసవంశనాశనకరం రాకేందుబింబాననం రక్షోరిం రఘువంశవర్ధనకరం రక్తాధరం రాఘవమ్ । రాధాయాత్మనివాసినం రవినిభం రమ్యం రమానాయకం రంధ్రాంతర్గతశేషశాయినమహం రామం భజే తారకమ్ ॥ 129
ఓతప్రోతసమస్తవస్తునిచయం ఓంకారబీజాక్షరం ఓంకారప్రకృతిం షడక్షరహితం ఓంకారకందాంకురమ్ । ఓంకారస్ఫుటభూర్భువస్సుపరితం ఓఘత్రయారాధితం ఓంకారోజ్జ్వలసింహపీఠనిలయం రామం భజే తారకమ్ ॥ 130
సాకేతే నగరే సమస్తసుఖదే హర్మ్యేఽబ్జకోటిద్యుతే నక్షత్రగ్రహపంక్తిలగ్నశిఖరే చాంతర్యపంకేరుహే । వాల్మీకాత్రిపరాశరాదిమునిభిస్సంసేవ్యమానం స్థితం సీతాలంకృతవామభాగమనిశం రామం భజే తారకమ్ ॥ 131
వైకుంఠే నగరే సురద్రుమతలే చానందవప్రాంతరే నానారత్నవినిర్మితస్ఫుటపటుప్రాకారసంవేష్టితే । సౌధేందూపలశేషతల్పలలితే నీలోత్పలచ్ఛాదితే పర్యంకే శయనం రమాదిసహితం రామం భజే తారకమ్ ॥ 132
వందే రామమనాదిపూరుషమజం వందే రమానాయకం వందే హారికిరీటకుండలధరం వందే సునీలద్యుతిమ్ । వందే చాపకలంబకోజ్జ్వలకరం వందే జగన్మంగళం వందే పంక్తిరథాత్మజం మమ గురుం వందే సదా రాఘవమ్ ॥ 133
వందే శౌనకగౌతమాద్యభినుతం వందే ఘనశ్యామలం వందే తారకపీఠమధ్యనిలయం వందే జగన్నాయకమ్ । వందే భక్తజనౌఘదేవివటపం వందే ధనుర్వల్లభం వందే తత్త్వమసీతివాక్యజనకం వందే సదా రాఘవమ్ ॥ 134
వందే సూర్యశశాంకలోచనయుగం వందే జగత్పావనం వందే పత్రసహస్రపద్మనిలయం వందే పురారిప్రియమ్ । వందే రాక్షసవంశనాశనకరం వందే సుధాశీతలం వందే దేవకపీంద్రకోటివినుతం వందే సదా రాఘవమ్ ॥ 135
వందే సాగరగర్వభంగవిశిఖం వందే జగజ్జీవనం వందే కౌశికయాగరక్షణకరం వందే గురుణాం గురుమ్ । వందే బాణశరాసనోజ్జ్వలకరం వందే జటావల్కలం వందే లక్ష్మణభూమిజాన్వితమహం వందే సదా రాఘవమ్ ॥ 136
వందే పాండరపుండరీకనయనం వందేఽబ్జబింబాననం వందే కంబుగళం కరాబ్జయుగళం వందే లలాటోజ్జ్వలమ్ । వందే పీతదుకూలమంబుదనిభం వందే జగన్మోహనం వందే కారణమానుషోజ్జ్వలతనుం వందే సదా రాఘవమ్ ॥ 137
వందే నీలసరోజకోమలరుచిం వందే జగద్వందితం వందే సూర్యకులాబ్ధికౌస్తుభమణిం వందే సురారాధితమ్ । వందే పాతకపంచకప్రహరణం వందే జగత్కారణం వందే వింశతిపంచతత్త్వరహితం వందే సదా రాఘవమ్ ॥ 138
వందే సాధకవర్గకల్పకతరుం వందే త్రిమూర్త్యాత్మకం వందే నాదలయాంతరస్థలగతం వందే త్రివర్గాత్మకమ్ । వందే రాగవిహీనచిత్తసులభం వందే సభానాయకం వందే పూర్ణదయామృతార్ణవమహం వందే సదా రాఘవమ్ ॥ 139
వందే సాత్త్వికతత్త్వముద్రితతనుం వందే సుధాదాయకం వందే చారుచతుర్భుజం మణినిభం వందే షడబ్జస్థితమ్ । వందే బ్రహ్మపిపీలికాదినిలయం వందే విరాట్విగ్రహం వందే పన్నగతల్పశాయినమహం వందే సదా రాఘవమ్ ॥ 140
సింహాసనస్థం మునిసిద్ధసేవ్యం రక్తోత్పలాలంకృతపాదపద్మమ్ । సీతాసమేతం శశిసూర్యనేత్రం రామం భజే రాఘవరామచంద్రమ్ ॥ 141
శ్రీరామభద్రాశ్రితసద్గురూణాం పాదారవిందం భజతాం నరాణామ్ । ఆరోగ్యమైశ్వర్యమనంతకీర్తి- రంతే చ విష్ణోః పదమస్తి సత్యమ్ ॥ 142
దశరథవరపుత్రం జానకీసత్కళత్రం దశముఖహరదక్షం పద్మపత్రాయతాక్షమ్ । కరధృతశరచాపం చారుముక్తాకలాపం రఘుకులనృవరేణ్యం రామమీడే శరణ్యమ్ ॥ 143
దశముఖగజసింహం దైత్యగర్వాతిరంహం కదనభయదహస్తం తారకబ్రహ్మ శస్తమ్ । మణిఖచితకిరీటం మంజులాలాపవాటం దశరథకులచంద్రం రామచంద్రం భజేఽహమ్ ॥ 144
రామం రక్తసరోరుహాక్షమమలం లంకాధినాథాంతకం కౌసల్యానయనోత్సుకం రఘువరం నాగేంద్రతల్పస్థితమ్ । వైదేహీకుచకుంభకుంకుమరజోలంకారహారం హరిం మాయామానుషవిగ్రహం రఘుపతిం సీతాసమేతం భజే ॥ 145
రామం రాక్షసమర్దనం రఘువరం దైతేయభిధ్వంసినం సుగ్రీవేప్సితరాజ్యదం సురపతేర్భీత్యంతకం శార్ంగిణమ్ । భక్తానామభయప్రదం భయహరం పాపౌఘవిధ్వంసినం సామీరిస్తుతపాదపద్మయుగళం సీతాసమేతం భజే ॥ 146
యత్పాదాంబుజరేణునా మునిసతీ ముక్తింగతా యన్మహః పుణ్యం పాతకనాశనం త్రిజగతాం భాతి స్మృతం పావనమ్ । స్మృత్వా రాఘవమప్రమేయమమలం పూర్ణేందుమందస్మితం తం రామం సరసీరుహాక్షమమలం సీతాసమేతం భజే ॥ 147
వైదేహీకుచమండలాగ్ర-విలసన్మాణిక్యహస్తాంబుజం చంచత్కంకణహారనూపుర-లసత్కేయూరహారాన్వితమ్ । దివ్యశ్రీమణికుండలోజ్జ్వల-మహాభూషాసహస్రాన్వితం వీరశ్రీరఘుపుంగవం గుణనిధిం సీతాసమేతం భజే ॥ 148
వైదేహీకుచమండలోపరి-లసన్మాణిక్యహారావళీ- మధ్యస్థం నవనీతకోమలరుచిం నీలోత్పలశ్యామలమ్ । కందర్పాయుతకోటిసుందరతనుం పూర్ణేందుబింబాననం కౌసల్యాకులభూషణం రఘుపతిం సీతాసమేతం భజే ॥ 149
దివ్యారణ్యయతీంద్రనామనగరే మధ్యే మహామంటపే స్వర్ణస్తంభసహస్రషోడశయుతే మందారమూలాశ్రితే । నానారత్నవిచిత్రనిర్మలమహాసింహాసనే సంస్థితం సీతాలక్ష్మణసేవితం రఘుపతిం సీతాసమేతం భజే ॥ 150
కస్తూరీతిలకం కపీంద్రహరణం కారుణ్యవారాంనిధిం క్షీరాంభోధిసుతాముఖాబ్జమధుపం కల్యాణసంపన్నిధిమ్ । కౌసల్యానయనోత్సుకం కపివరత్రాణం మహాపౌరుషం కౌమారప్రియమర్కకోటిసదృశం సీతాసమేతం భజే ॥ 151
విద్యుత్కోటిదివాకరద్యుతినిభం శ్రీకౌస్తుభాలంకృతం యోగీంద్రైస్సనకాదిభిః పరివృతం కైలాసనాథప్రియమ్ । ముక్తారత్నకిరీటకుండలధరం గ్రైవేయహారాన్వితం వైదేహీకుచసన్నివాసమనిశం సీతాసమేతం భజే ॥ 152
మేఘశ్యామలమంబుజాతనయనం విస్తీర్ణవక్షస్స్థలం బాహుద్వంద్వవిరాజితం సువదనం శోణాంఘ్రిపంకేరుహమ్ । నానారత్నవిచిత్రభూషణయుతం కోదండబాణాంకితం త్రైలోక్యాఽప్రతిమానసుందరతనుం సీతాసమేతం భజే ॥ 153
వైదేహీయుతవామభాగమతులం వందారుమందారకం వందే ప్రస్తుతకీర్తివాసితతరుచ్ఛాయానుకారిప్రభమ్ । వైదేహీకుచకుంకుమాంకితమహోరస్కం మహాభూషణం వేదాంతైరుపగీయమానమసకృత్సీతాసమేతం భజే ॥ 154
దేవానాం హితకారణేన భువనే ధృత్వాఽవతారం ధ్రువం రామం కౌశికయజ్ఞవిఘ్నదలనం తత్తాటకాసంహరమ్ । నిత్యం గౌతమపత్నిశాపదలనశ్రీపాదరేణుం శుభం శంభోరుత్కటచాపఖండనమహాసత్వం భజే రాఘవమ్ ॥ 155
శ్రీరామం నవరత్నకుండలధరం శ్రీరామరక్షామణిం శ్రీరామం చ సహస్రభానుసదృశం శ్రీరామచంద్రోదయమ్ । శ్రీరామం శ్రుతకీర్తిమాకరమహం శ్రీరామముక్తిప్రదం శ్రీరామం రఘునందనం భయహరం శ్రీరామచంద్రం భజే ॥ 156
రామమిందీవరశ్యామం రాజీవాయతలోచనమ్ । జ్యాఘోషనిర్జితారాతిం జానకీరమణం భజే ॥ 157
దీర్ఘబాహుమరవిందలోచనం దీనవత్సలమనాథరక్షకమ్ । దీక్షితం సకలలోకరక్షణే దైవతం దశరథాత్మజం భజే ॥ 158
ప్రాతస్స్మరామి రఘునాథముఖారవిందం మందస్మితం మధురభాషి విశాలఫాలమ్ । కర్ణావలంబిచలకుండలగండభాగం కర్ణాంతదీర్ఘనయనం నయనాభిరామమ్ ॥ 159
ప్రాతర్భజామి రఘునాథకరారవిందం రక్షోగణాయ భయదం వరదం నిజేభ్యః । యద్రాజసంసది విభిద్య మహేశచాపం సీతాకరగ్రహణమంగళమాప సద్యః ॥ 160
ప్రాతర్నమామి రఘునాథపదారవిందం పద్మాంకుశాదిశుభరేఖశుభావహం చ । యోగీంద్రమానసమధువ్రతసేవ్యమానం శాపాపహం సపది గౌతమధర్మపత్న్యాః ॥ 161
ప్రాతర్వదామి వచసా రఘునాథనామ వాగ్దోషహారి సకలం కలుషం నిహంతృ । యత్పార్వతీ స్వపతినా సహ భోక్తుకామా ప్రీత్యా సహస్రహరినామసమం జజాప ॥ 162
ప్రాతః శ్రయే శ్రుతినుతం రఘునాథమూర్తిం నీలాంబుదోత్పలసితేతరరత్ననీలామ్ । ఆముక్తమౌక్తికవిశేషవిభూషణాఢ్యాం ధ్యేయాం సమస్తమునిభిర్నిజభృత్యముఖ్యైః ॥ 163
రఘుకులవరనాథో జానకీప్రాణనాథః పితృవచనవిధాతా కీశరాజ్యప్రదాతా । ప్రతినిశిచరనాశః ప్రాప్తరాజ్యప్రవేశో విహితభువనరక్షః పాతు పద్మాయతాక్షః ॥ 164
కువలయదళనీలః పీతవాసాః స్మితాస్యో వివిధరుచిరభూషాభూషితో దివ్యమూర్తిః । దశరథకులనాథో జానకీప్రాణనాథో నివసతు మమ చిత్తే సర్వదా రామచంద్రః ॥ 165
జయతు జయతు రామో జానకీవల్లభోఽయం జయతు జయతు రామశ్చంద్రచూడార్చితాంఘ్రిః । జయతు జయతు వాణీనాథనాథః పరాత్మా జయతు జయతు రామోఽనాథనాథః కృపాళుః ॥ 166
వదతు వదతు వాణీ రామరామేతి నిత్యం జయతు జయతు చిత్తం రామపాదారవిందమ్ । నమతు నమతు దేహం సంతతం రామచంద్రం న భవతు మమ పాపం జన్మజన్మాంతరేషు ॥ 167
ఆనందరూపం వరదం ప్రసన్నం సింహేక్షణం సేవకపారిజాతమ్ । నీలోత్పలాంగం భువనైకమిత్రం రామం భజే రాఘవరామచంద్రమ్ ॥ 168
లంకావిరామం రణరంగభీమం రాజీవనేత్రం రఘువంశమిత్రమ్ । కారుణ్యమూర్తిం కరుణాప్రపూర్తిం శ్రీరామచంద్రం శరణం ప్రపద్యే ॥ 169
సుగ్రీవమిత్రం పరమం పవిత్రం సీతాకళత్రం నవహేమసూత్రమ్ । కారుణ్యపాత్రం శతపత్రనేత్రం శ్రీరామచంద్రం శిరసా నమామి ॥ 170
శ్రీరాఘవేతి రమణేతి రఘూద్వహేతి రామేతి రావణహరేతి రమాధవేతి । సాకేతనాథసుముఖేతి చ సువ్రతేతి వాణీ సదా వదతు రామ హరే హరేతి ॥ 171
శ్రీరామనామామృతమంత్రబీజం సంజీవనం చేన్మనసి ప్రతిష్ఠమ్ । హాలాహలం వా ప్రళయానలం వా మృత్యోర్ముఖం వా వితథీకరోతి ॥ 172
కిం యోగశాస్త్రైః కిమశేషవిద్యా కిం యాగగంగాదివిశేషతీర్థైః । కిం బ్రహ్మచర్యాశ్రమసంచరేణ భక్తిర్నచేత్తే రఘువంశకీర్త్యామ్ ॥ 173
ఇదం శరీరం శ్లథసంధిజర్ఝరం పతత్యవశ్యం పరిణామపేశలమ్ । కిమౌషథం పృచ్ఛసి మూఢ దుర్మతే నిరామయం రామకథామృతం పిబ ॥ 174
హే రామభద్రాశ్రయ హే కృపాళో హే భక్తలోకైకశరణ్యమూర్తే । పునీహి మాం త్వచ్చరణారవిందం జగత్పవిత్రం శరణం మమాఽస్తు ॥ 175
నీలాభ్రదేహ నిఖిలేశ జగన్నివాస రాజీవనేత్ర రమణీయగుణాభిరామ । శ్రీదామ దైత్యకులమర్దన రామచంద్ర త్వత్పాదపద్మమనిశం కలయామి చిత్తే ॥ 176
శ్రీరామచంద్ర కరుణాకర దీనబంధో సీతాసమేత భరతాగ్రజ రాఘవేశ । పాపార్తిభంజన భయాతురదీనబంధో పాపాంబుధౌ పతితముద్ధర మామనాథమ్ ॥ 177
ఇందీవరదళశ్యామ-మిందుకోటినిభాననమ్ । కందర్పకోటిలావణ్యం వందేఽహం రఘునందనమ్ ॥ 175
ఇతి శ్రీబోధేంద్రసరస్వతీ కృత శ్రీరామకర్ణామృతమ్ ॥
Browse Related Categories: