Sri Rama · Traditional devotional text · Source: vignanam.org (Traditional devotional text (public-domain shlokas))
రాగం: హంసనాదం 60 నీతిమతి జన్య ఆ: స రి2 మ2 ప ద3 ని3 స అవ: స ని3 ద3 ప మ2 రి2 స తాళం: దేశాది పల్లవి బంటు రీతి కొలువీయ వయ్య రామ (బంటు) అనుపల్లవి తుంట వింటి వాని మొదలైన మదాదుల బట్టి నేల కూలజేయు నిజ బంటు రీతి కొలువీయ వయ్య రామ.. (బంటు) చరణం 1 రోమాంచమనే, ఘన కంచుకము రామ భక్తుడనే, ముద్రబిళ్ళయు రామ నామమనే, వర ఖఢ్గమి- -విరాజిల్లునయ్య, త్యాగరాజునికే బంటు రీతి కొలువీయ వయ్య రామ (బంటు)
Browse Related Categories:
Offered for worship and study, not as prediction. Non-commercial.
More devotional texts