Sri Venkateswara Swamy · Traditional devotional text · Source: vignanam.org (Traditional devotional text (public-domain shlokas))
చదువులోనే హరిని జట్టిగొనవలెగాక । మదముగప్పినమీద మగుడ నది గలదా ॥ జడమతికి సహజమే సంసారయాతన యిది । కడు నిందులో బరము గడియించవలెగాక । తొడరి గాలప్పుడు తూర్పెత్తక తాను । విడిచి మఱచిన వెనక వెదకితే గలదా ॥ భవబంధునకు విధిపాపపుణ్యపులంకె । తివిరి యిందునే తెలివి తెలుసుకోవలెగాక । అవల వెన్నెలలోనే అల్లునేరే ళ్లింతే । నివిరి నిన్నటివునికి నేటికి గలదా ॥ దేహధారికి గలదే తెగనియింద్రియబాధ । సాహసంబున భక్తి సాధించవలెగాక । యిహలను శ్రీవేంకటేశుదాసులవలన । వూహించి గతిగానక వొదిగితే గలదా ॥
Offered for worship and study, not as prediction. Non-commercial.
More devotional texts
Browse Related Categories: