Sri Venkateswara Swamy · Traditional devotional text · Source: vignanam.org (Traditional devotional text (public-domain shlokas))
రామ దశరథరామ నిజ సత్య- కామ నమో నమో కాకుత్థ్సరామ ॥ కరుణానిధి రామ కౌసల్యానందన రామ పరమ పురుష సీతాపతిరామ । శరధి బంధన రామ సవన రక్షక రామ గురుతర రవివంశ కోదండ రామ ॥ దనుజహరణ రామ దశరథసుత రామ వినుతామర స్తోత్ర విజయరామ । మనుజావతారా రామ మహనీయ గుణరామ అనిలజప్రియ రామ అయోధ్యరామ ॥ సులలితయశ రామ సుగ్రీవ వరద రామ కలుష రావణ భయంకర రామ । విలసిత రఘురామ వేదగోచర రామ కలిత ప్రతాప శ్రీవేంకటగిరి రామ ॥
Offered for worship and study, not as prediction. Non-commercial.
More devotional texts
Browse Related Categories: