Sri Venkateswara Swamy · Traditional devotional text · Source: vignanam.org (Traditional devotional text (public-domain shlokas))
దేవ యీ తగవు దీర్చవయ్యా వేవేలకు నిది విన్నపమయ్యా ॥ తనువున బొడమినతతి నింద్రియములు పొనిగి యెక్కడికి బోవునయా । పెనగి తల్లికడ బిడ్డలు భువిలో యెనగొని యెక్కడి కేగుదురయ్యా ॥ పొడుగుచు మనమున బొడమిన యాసలు అదన నెక్కడికి నరుగునయా । వొదుగుచు జలములనుండు మత్స్యములు పదపడి యేగతి బాసీనయ్యా ॥ లలి నొకటొకటికి లంకెలు నివే అలరుచు నేమని యందునయా । బలు శ్రీవేంకటపతి నాయాత్మను గలిగితి వెక్కడి కలుషములయ్యా ॥
Offered for worship and study, not as prediction. Non-commercial.
More devotional texts
Browse Related Categories: