Sri Venkateswara Swamy · Traditional devotional text · Source: vignanam.org (Traditional devotional text (public-domain shlokas))
రాగం: దేవగాంధారి /ఆనందభైరవి ఆ: స గ2 రి2 గ2 మ1 ప ద2 ప ని2 స అవ: స ని2 ద2 ప మ1 గ2 రి2 స తాళం: త్/ఏక పల్లవి ఇట్టి ముద్దులాడి బాలు డేడవాడు వాని బట్టి తెచ్చి పొట్టనిండ బాలు వోయరే ॥ (2) చరణం 1 గామిడై పారితెంచి కాగెడి వెన్నెలలోన చేమ పూవు కడియాల చేయి పెట్టి । (2) చీమ గుట్టెనని తన చెక్కిట గన్నీరు జార వేమరు వాపోయే వాని వెడ్డు వెట్టరే ॥ (2) ఇట్టి ముద్దులాడి బాలు డేడవాడు .. (ప..) చరణం 2 ముచ్చువలె వచ్చి తన ముంగ మురువుల చేయి తచ్చెడి పెరుగులోన దగబెట్టి । (2) నొచ్చెనని చేయిదీసి నోర నెల్ల జొల్లుగార వొచ్చెలి వాపోవువాని నూరడించరే ॥ (2) ఇట్టి ముద్దులాడి బాలు డేడవాడు .. (ప..) చరణం 3 ఎప్పుడు వచ్చెనో మా యిల్లు చొచ్చి పెట్టెలోని చెప్పరాని వుంగరాల చేయి పెట్టి । (2) అప్పడైన వేంకటాద్రి అసవాలకుడు గాన తప్పకుండ బెట్టె (బట్టి) వాని తలకెత్తరే ॥ (2) ఇట్టి ముద్దులాడి బాలు డేడవాడు వాని బట్టి తెచ్చి పొట్టనిండ బాలు వోయరే ॥ (2) (ప..)
Offered for worship and study, not as prediction. Non-commercial.
More devotional texts
Browse Related Categories: