Sri Venkateswara Swamy · Traditional devotional text · Source: vignanam.org (Traditional devotional text (public-domain shlokas))
కలిగెనిదె నాకు కైవల్యము తొలుతనెవ్వరికి దొరకనిది ॥ జయపురుషోత్తమ జయ పీతాంబర జయజయ కరుణాజలనిధి । దయ యెఱంగ నే ధర్మము నెఱగ నా క్రియ యిది నీదివ్యకీర్తనమే ॥ శరణము గోవింద శరణము కేశవ శరణు శరణు శ్రీజనార్ధన । పరమ మెఱంగను భక్తి యెఱంగను నిరతము నాగతి నీదాస్యమే ॥ నమో నారాయణా నమో లక్ష్మీపతి నమో పుండరీకనయనా । అమిత శ్రీవేంకటాధిప యిదె నా క్రమమెల్లను నీకయింకర్యమే ॥
Offered for worship and study, not as prediction. Non-commercial.
More devotional texts
Browse Related Categories: