Sri Venkateswara Swamy · Traditional devotional text · Source: vignanam.org (Traditional devotional text (public-domain shlokas))
రాగం: హిందోళం (20 నటభైరవి జన్య) ఆ: స గ2 మ1 ద1 ని2 స అవ: స ని2 ద1 మ1 గ2 స తాళం: ఆది పల్లవి కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు కొండలంత వరములు గుప్పెడు వాడు ॥ (2.5) చరణం 1 కుమ్మర దాసుడైన కురువరతి నంబి ఇమ్మన్న వరములెల్ల ఇచ్చినవాడు । (1) దొమ్ములు సేసిన యట్టి తొండమాన్ చక్కురవర్తి రమ్మన్న చోటికి వచ్చి నమ్మిన వాడు ॥ (2.5) కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు (ప.) కొండలంత వరములు గుప్పెడు వాడు ॥ (ప.)(2.5) చరణం 2 అచ్చపు వేడుకతోడ ననంతాళ్వారుకి ముచ్చిలి వెట్టికి మన్ని మోసినవాడు । మచ్చిక దొలక తిరునంబి తోడుత నిచ్చ నిచ్చ మాటలాడి నొచ్చినవాడు ॥ చరణం 3 కంచిలోన నుండ దిరుకచ్చినంబి మీద కరుణించి తన యెడకు రప్పించిన వాడు । (2) యెంచి ఎక్కుడైన వేంకటేశుడు మనలకు మంచివాడై కరుణ బాలించిన వాడు ॥ (2.5) కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు (ప.) కొండలంత వరములు గుప్పెడు వాడు (ప.) (2.5)
Offered for worship and study, not as prediction. Non-commercial.
More devotional texts
Browse Related Categories: