Sri Venkateswara Swamy · Traditional devotional text · Source: vignanam.org (Traditional devotional text (public-domain shlokas))
రాగం: కురిన్జి 29 శన్కరాభరణం జన్య ఆ: స ని3 స రి2 గ3 మ1 ప ద2 అవ: ద2 ప మ1 గ3 రి2 స ని3 స తాళం: ఆది పల్లవి క్షీరాబ్ధి కన్యకకు శ్రీ మహాలక్ష్మికిని నీరజాలయమునకు నీరాజనం ॥ (2) చరణం 1 జలజాక్షి మోమునకు జక్కవ కుచంబులకు నెలకొన్న కప్పురపు నీరాజనం । అలివేణి తురుమునకు హస్తకమలంబులకు నిలువుమాణిక్యముల నీరాజనం ॥ క్షీరాబ్ధి కన్యకకు శ్రీ మహాలక్ష్మికిని నీరజాలయమునకు నీరాజనం ॥ (ప..) (1) చరణం 2 చరణ కిసలయములకు సకియరంభోరులకు నిరతమగు ముత్తేల నీరాజనం । అరిది జఘనంబునకు అతివనిజనాభికిని నిరతి నానావర్ణ నీరాజనం ॥ చరణం 3 పగటు శ్రీవేంకటేశు పట్టపురాణియై నెగడు సతికళలకును నీరాజనం । జగతి నలమేల్మంగ చక్కదనములకెల్ల నిగుడు నిజ శోభనపు నీరాజనం ॥ క్షీరాబ్ధి కన్యకకు శ్రీ మహాలక్ష్మికిని నీరజాలయమునకు నీరాజనం ॥ (ప..) (1)
Offered for worship and study, not as prediction. Non-commercial.
More devotional texts
Browse Related Categories: