Sri Venkateswara Swamy · Traditional devotional text · Source: vignanam.org (Traditional devotional text (public-domain shlokas))
రాగం: సామంత ఆ: స రి2 గ3 మ1 ప ద3 ని3 స అవ: స ని3 ద3 ని3 ద3 ప మ1 గ3 రి2 స రాగం: ధర్మవతి తాళం: ఆది ఆ: స రి2 గ2 మ2 ప ద2 ని3 స అవ: స ని3 ద2 ప మ2 గ2 రి2 స పల్లవి మంగాంబుధి హనుమంతా నీ శరణ । మంగవించితిమి హనుమంతా ॥ (2.5) చరణం 1 బాలార్క బింబము ఫలమని ప ట్టిన ఆలరి చేతల హనుమంతా । (2) తూలని బ్రహ్మాదులచే వరములు ఓలి చేకొనినా హనుమంతా ॥ (2) మంగాంబుధి హనుమంతా నీ శరణ..(ప..) చరణం 2 జలధి దాట నీ సత్వము కపులకు అలరి తెలిపితివి హనుమంతా । ఇలయు నాకసము నేకముగా, నటు బలిమి పెరిగితివి భళి హనుమంతా ॥ చరణం 3 పాతాళము లోపలి మైరావణు ఆతల జంపిన హనుమంతా । చేతులు మోడ్చుక శ్రీ వేంకటపతి నీ తల గోలిచే హిత హనుమంతా ॥ మంగాంబుధి హనుమంతా నీ శరణ । మంగవించితిమి హనుమంతా ॥ (2.5)
Offered for worship and study, not as prediction. Non-commercial.
More devotional texts
Browse Related Categories: