Sri Venkateswara Swamy · Traditional devotional text · Source: vignanam.org (Traditional devotional text (public-domain shlokas))
నవనీతచోర నమో నమో నవమహిమార్ణవ నమో నమో ॥ హరి నారాయణ కేశవాచ్యుత శ్రీకృష్ణ నరసింహ వామన నమో నమో । మురహర పద్మ నాభ ముకుంద గోవింద నరనారాయణరూప నమో నమో ॥ నిగమగోచర విష్ణు నీరజాక్ష వాసుదేవ నగధర నందగోప నమో నమో । త్రిగుణాతీత దేవ త్రివిక్రమ ద్వారక నగరాధినాయక నమో నమో ॥ వైకుంఠ రుక్మిణీవల్లభ చక్రధర నాకేశవందిత నమో నమో । శ్రీకరగుణనిధి శ్రీ వేంకటేశ్వర నాకజనననుత నమో నమో ॥
Offered for worship and study, not as prediction. Non-commercial.
More devotional texts
Browse Related Categories: