Sri Venkateswara Swamy · Traditional devotional text · Source: vignanam.org (Traditional devotional text (public-domain shlokas))
రాగం: సింధు భైరవ రంగ రంగ రంగ పతి రంగనాధా నీ । సింగారాలె తరచాయ శ్రి రంగ నాధా ॥ పట్ట పగలే మాతో పలుచగ నవ్వేవు । ఒట్టులేల టలిగిరించు వడి నీ మాటలు వింటె । రట్టడివి మేరమీరకు రంగనాధా । రంగనాధా శ్రీ రంగనాధా ॥ కావేటి రంగమున కాంతపై పాదాలు సాచి । రావు పోవు ఎక్కడికి రంగ నాధా । శ్రీ వేంకటాద్రి మీద చేరి నను కూడితివి । ఏవల చూచిన నీవేయిట రంగనాధా ॥ రంగనాధా శ్రీ రంగనాధా
Offered for worship and study, not as prediction. Non-commercial.
More devotional texts
Browse Related Categories: